21, అక్టోబర్ 2009, బుధవారం

ఆపరేషన్ గ్రీన్ హంట్ వెనక చిదంబర రహస్యం

దేశంలో మావోయిస్టు ఉద్యమాన్ని పూర్తిగా నిర్మూలించే కార్యక్రమంగా ప్రకటించిన ఆపరేషన్ గ్రీన్ హంట్ కార్యక్రమం ఎవరి గురించి చేపట్టారు? నిజానికి ఈ రోజు నూటా పది కోట్లకు పైగా జనాభా కలిగిన భారత దేశంలో మావోయిస్టు పార్టీ వెనక వున్నజనం ఎంతమంది? ప్రభుత్వ లెక్కల ప్రకారం సుమారుగా నాలుగువేలమంది సాయుధ మావోయిస్టు సభ్యులున్నారని తెలుస్తోంది. మరి వీరి గురించి సుమారు లక్షకు పైగా సైన్యాన్ని తరలించే కార్యక్రమం చేపట్టిన దేశీయ వ్యవహారాల మంత్రి ఇదంతా ఎవరికోసం చేస్తున్నట్లు. శ్రీలంకలో రాజపక్సే ఎల్టీ టీఈ వారిని సైనిక చర్యల ద్వారా అత్యంత పాశవికంగా అణచివేసిన స్ఫూర్తితో ఇక్కడ కూడా అదే పద్ధతిలో మావోలను పూర్తిగా నిర్మూలించే కార్యక్రమాన్ని చేపట్టారు.

అయితే వీరి కార్యక్రమం వలన వేలాది గిరిజన ప్రజానీకం నిర్వాసితులవుతున్నారు. అలాగే ఈ మధ్య కాలంలో అనేక మంది వూచకోతకు గురయ్యారు. దీనిని ఆపేందుకు సిటిజన్స్ ఇనిశియీతివ్ ఫర్ పీస్ పేరిట నిన్నను ఢిల్లీలోజరిగిన ఒక సమావేశంలో దీశావ్యాప్తంగా వివిధ రంగాలకు చెందిన మేధావులు, మాజీ న్యాయమూర్తులు, పౌరహక్కుల సంఘాల నేతలు దేశంలో అంతర్గత యుద్ధం తగదని ప్రభుత్వానికి హితవు చెప్పారు. దీనికి సమాధానంగా చిదంబరం మావోలు హింసను విడనాడితే మేము చర్చలకు సిద్ధమని ప్రకటించారు. కాని ఆయన ప్రకటనను నమ్మేందుకు ఆయన గురించి తెలిసిన వాళ్ళెవరు నమ్మలెరని ప్రముఖ రచయిత్రి అరుంధతి రాయ్ వ్యాఖ్యానించారు. ఇటివల ఒక విదేశీ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలోచిదంబరం మాటలకు చేతలకు మధ్య వున్న వైరుధ్యాన్ని ఆమె వివరించారు. చిదంబరం హార్వర్డ్ లో శిక్షణ పొందిన న్యాయవాది. దేశ చరిత్రలో మొదటిసారి అతిపెద్ద కార్పోరేట్ కుంభకోణం జరిపిన ఎన్రాన్ సంస్థకు ఆయన న్యాయవాదిగా వ్యవహరించారు. సెక్యూరిటీకుంభకోణం లో పాలుపంచుకున్న ఫైయిర్ గ్రోత్ కంపెనీలో వాటాలు కొన్నందుకు పీవీ హయాంలో ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేసారు. ఒరిస్సాలో మైనింగ్ కార్యక్రమాలు నిర్వహిస్తున్న ప్రపంచంలోనే అతి పెద్ద మైనింగ్ కార్పోరేట్ సంస్థ వేదాంత గవర్నర్ల బోర్డ్ లో చిదంబరం వున్నారు. ఆర్దిక మంత్రి అయిన మొదటి రోజే ఈ బోర్డ్ కు రాజీనామా చేసారు. ఆయన ఎన్నో పెద్ద పెద్ద కంపెనీల తరపున న్యాయవాదిగా వ్యవహరించి ఆర్ధిక మంత్రి అయిన తర్వాత వాటినుండి వైదొలిగారు. అయితే చిదంబరం స్థానంలో ఆయన సతీమణి నలిని ఆ కేసులను వాదించడం యాదృచ్చిక మాత్రం కాదు.

ఈ దేశంలో ఎనభై ఐదు శాతం మంది ప్రజలు నగరాల్లో జీవిస్తే దేశం బాగుపడుతుందని ఆయన ఒకసారి ప్రకటించారు, అంటే దాదాపు డబ్భై కోట్ల మంది దాకా పల్లెలు ఖాళీ చేసి పట్టణాలలో పడాలన్నమాట. దీనిని సాధించేందుకు లక్షలాది మంది సైన్యాన్ని గ్రామాలకు తరలించి ఖాళీ చేయిస్తున్నారు. అత్యంత ఆధునిక ఆయుధాలతోను, ఉపగ్రహ సహకారంతోను మావోయిస్టులను అణచివేసేందుకు లక్షల కోట్ల ప్రభుత్వ ధనాన్ని వినియోగిస్తున్నారు. నిజానికి ఇదే చైతన్యంతో మారుమూల గ్రామాలకు కనీస సౌకర్యాల కల్పనకు ఈ దేశంలో గత అరవై రెండు సం.లుగా ఏలిన ప్రభుత్వాలు కార్యక్రమాలు చేపట్టిన దాఖలాలు లేవు., ఆదివాసీ ప్రాంతాలపై ప్రభుత్వ దృష్టి మళ్లడం వెనుక ఆ ప్రాంతంలోని ఖనిజ సంపదను కొల్లగొట్టేందుకు విదేశీ కంపెనీలకు అవకాశంకల్పించేందుకు మాత్రమేనన్నది చిదంబర రహస్యమేమీ కాదు. విదేశి కంపెనీలు ఈ దేశంలో స్వేచ్చగా అడుగు పెట్టేందుకు చిదంబరం వంటి ఆర్ధిక మంత్రి కావలసి వచ్చాడు మన్మోహన్ సింగ్ కు. అలాగే ఇప్పుడు వారి కార్యకలాపాలు నిర్వహించుకునేందుకు అడ్డుపడుతున్న మావోయిస్టులను అణచివేసేందుకు హోం మంత్రి రూపంలో చిదంబరం అవసరమయ్యాడు. చర్చలు జరిపినా, అందుకు మావోయిస్టులు అంగీకరించినా చిదంబరం ఆదివాసీలను తమ ప్రాంతంలో తామూ నివసించేందుకు అనుమతిస్తారా? అంతర్గత యుద్ధం చేయడానికి ఇంతగా ముందుకు వచ్చిన తరువాత చర్చలు అన్నవి ఒక ముసుగు మాత్రమె. తెల్లపంచే, దోవతిలతో, చెరగని చిరునవ్వుతో అడ్డు నామంతో దర్సనమిచ్చే ఈ గోముఖ వ్యాఘ్రం వెనక వున్న శక్తి సామ్రాజ్య వాదమని వారి పెట్టుబడితో, ఆయుధ, సాంకేతిక సహకారాలతో విరుచుకు పడుతున్నది కార్పోరేట్ పెట్టుబడిదారీ వ్యవస్థని అర్థం కాని ముర్ఖులేవరున్నారు.

ఆపరేషన్ గ్రీన్ హంట్ పేరిట దళారి బూర్జువాలు, అమెరికన్ సామ్రాజ్యవాదులు ఈ దేశ వనరులను కొల్లగొట్టేందుకు వీలుగా వత్తిళ్ళు చేయడమే వీరి ఉద్దేశ్యం. టాటాలు, మిట్టల్స్, రుయాలు, జిందాల్స్, బిర్లాలు, వేదాంత, పోస్కో కంపెనీలు యుపియే నేతలకు ఎన్నికల నిధులు సమకూర్చాయి. వారి దోపిడీని అడ్డుకునే ప్రథాన శత్రువు దేశంలో మావోయిస్టు పార్టీ మాత్రమే. అందుకే వారి అడ్డును పూర్తిగా తొలగించే కార్యక్రమాన్ని చేపట్టే పేరుతొ ఆదివాసీ ప్రాంతాలను అప్రకటిత యుద్ధానికి సిద్ధమయింది. ఈ వినాశకర యుద్ధాన్ని ఆపేందుకు మేధావులు, ప్రజాస్వామిక వాదులు కృషి చేయాలి. నిజానికిది నక్సలిజం పై యుద్ధం పేరుతొ సహజ సంపదను బడా కంపెనీలకు ధారాదత్తం చేసే కుట్రగానే గుర్తించాలి.

17 కామెంట్‌లు:

  1. కట్టేవి కాషాయం బట్టలు, ఆరగించేవి మటన్ బిర్యాణీలు, బీఫ్ బర్గర్లు. ఇది పాలక వర్గం వాళ్ళ స్టైల్. పోలీస్ పవర్ ని అంతగా నమ్మేది హిట్లర్ ఒక్కడే అనుకున్నాను. చిదంబరం కూడా హిట్లర్ లాంటివాడేనని ఇప్పుడు అర్థమయ్యింది.

    రిప్లయితొలగించండి
  2. Didnt China do the same and didnt all the Red gang members support China for that?

    It all depends on who is doing it - if it is your friend, you aint find no fault, but if it's the others then you change your stance :))

    రిప్లయితొలగించండి
  3. ఆపరేషన్ గ్రీన్ హంట్ గురించి మీరు వ్రాసిన పోస్ట్లు లోనే మీరు ఆపరేషన్ రెడ్ కారిడార్ గురించి కూడా వ్రాసి ఉంటే చాల బాగుండేది, అలాగే మావోయిస్టు లకు పబ్లిక్ పేస్ గా చెప్పుకొనే కొంత మంది ఉహాత్మకం గా ముస్లిం టెర్రరిస్టు లను వెనుకేసుకు రావటం గురించి కూడా రాయాలసింది.
    హింస ఎవరు చేసిన హింసే మావోయిస్టులు ఆదివాసులు ను అన్యాయం గా చంపేసిన సంఘటనలు లేవా ? మరి వాటిని ఎలా అర్థం చేసుకోవాలి? మందు పాతరలతొ అమాయకుల ప్రాణాలను తీసిన సంఘనలు ఎలా అర్థం చేసుకోవాలి? ఉద్యోగ నిర్వహణ లోనున్న అధికారుల ప్రాణాలు తీసే సంఘనలు ఎలా అర్థం చేసుకోవాలి? రాజ్యహింస రాజ్యహింస అని మొత్తుకుంటూ పబ్లిక్ ప్రాపర్టీ ని, ప్రాణాలతో సహా పోలీసు స్టేషన్ లను తగలబెట్టే సంఘటనలు ప్రోత్చహించటం ఎలా సమర్దిస్తారు ? వీళ్ళని ఇలానే వదిలేస్తే దేశం బయట శత్రువుల నుంచి కన్నా లోపల ఉన్న శత్రువుల నష్టం ద్వారా వచ్చే నష్టం ఖచ్చితం గా ఎక్కువ . ప్రభుత్వం ఎప్పటికన్నా మంచి నిర్ణయం తీసుకుంది ఈ విషయం లో.

    రిప్లయితొలగించండి
  4. ఇక్కడ చైనా ప్రస్తావం ఎందుకు సార్, చైనాను మావోయిస్టులు సపోర్టు చేయడం లేదు. చైనా కూడా మావో తరువాత కేపటలిస్టు ఆర్ధిక విధానాలను అనుసరిస్తున్నదని గుర్తించిన నాడే చారుమజుందార్ సి.పి.ఎం.నుండి విడిపోయి నక్సల్బరి ఉద్యమాన్ని మొదలుపెట్టి సి.పి.ఎం.వాళ్ళను కూడా రివిజనిస్టులుగా గుర్తించారు. మీకున్న కమ్యూనిస్టు వ్యతిరేకతతో అందరినీ ఒకేలా చూస్తూ సమస్య మూలాలలను గుర్తించడంలో విఫలమవుతున్నారు.అయినా చర్చలోకి వచ్చి చదివినందుకు థాంక్స్.

    రిప్లయితొలగించండి
  5. శ్రావ్య గారు అధికారంలో వున్న వాళ్ళ కొమ్ముకాసేందుకు వుపయోగపడేట్లుగా వుండే అధికారులు చేస్తున్న వాటిని విస్మరిస్తారా? వారిని కాపాడుకునే బలగాలనే కొంతకాలంగా రికౄట్ చేసుకుంటున్న ప్రభుత్వాలను చూడరా? మిగిలిన వుద్యోగాలకంటే వాటినే ఎక్కువగా తీస్తూ మన వేలితో మనకంటినే పొడుస్తున్నారు. ఇది యుద్ధంగా మారుస్తూ వారి వ్యాపారాలను కొనసాగించేందుకు వాడుకుంటున్నారు. వాకపల్లి గిరిజన స్త్రీల తప్పేంటి. వారిని రేప్ చేయాల్సిన అవసరం ఏమిటి. రాజ్యం ప్రశ్నించే వాళ్ళను భయ బ్రాంతులకు గురిచేయడానికి తనకున్న అవకాశాలన్నింటిని వాడుతుంది. మన చాప కింద నీరు వచ్చేంత వరకు మనకు తెలియదు. ఆదివాసులను అన్యాయంగా చంపేయరు. మీ ఇంట్లో దొంగలు పడితే మీరు తప్పు బాబూ అని క్షమించేస్తారా? వారు ప్రభుత్వ ఏజెంట్లుగా మారి ఉద్యమానికి ద్రోహం చేయడమో, ఇంఫార్మర్లుగా మారిన నాడే శిక్షింపబడుతున్నారు. దూరంగా వుండి మీడియా కథనాలాధారంగా చూడొద్దు.

    రిప్లయితొలగించండి
  6. ప్రభుత్వ ఏజెంట్లుగా మారి ఉద్యమానికి ద్రోహం చేయడమో, ఇంఫార్మర్లుగా మారిన నాడే శిక్షింపబడుతున్నారు. అవునా, మరి అది నిజం అయినప్పుడు మనుష్యలనుండి మృగాలుగా మారి మావో లమని చెప్పుకొంటున్న కొందరి బుఱ్ఱ తక్కువ సన్యాసులను, వాళ్లకు సహాయ సహకారలూందిస్తున్న వాళ్ల అనుచరులు పోలీసులు చే శిక్షింపబడుతున్నారు అని ఎందుకనుకోకూడదు?

    అంటే ఒక సామాన్యపౌరుడను ఇంఫార్మర్లు పేరుతో చంపే హక్కు మావో లనబడే నరహంతక ముఠాలకు ఉంది కాని, వళ్లువంచి పనిచేసుకోవటానికి బద్దకం వేసి, ఆయుధాలు పట్టుకొని fashion అని ఫీలయ్యే ఈ నరహంతక ముఠాలను చంపటానికి పోలీసులకు హక్కు లేదు అంటారు అంతేనా పౌరహక్కు సంఘాలు (సారీ మావో హక్కు సంఘాల) వాళ్లు.

    ఇక వాకపల్లి గిరిజనులగురించి మాట్లాడుతున్నరు, అలాగే రైలు భొగీ లో సమిధలయిన అమాయక ప్రాణులగురించి ఎందుకు మాట్లాడరు? సారీ పౌరహక్కు మేతావులు కేవలం మావోలహక్కుల గురించి, లేక పోలీసులు చేసే తప్పులు గురించి మాత్రమే మాట్లాడతారుకదూ మర్సేపోయా!! లేక రైలు భొగీ ని కాల్చటం అందులో చనిపోయిన వాళ్ల ప్రాణాలు కూడా మీడియా సృష్టే నంటారా?

    రిప్లయితొలగించండి
  7. క్రిష్ణ గారు పౌరహక్కుల సంఘాలు, మేధావులు లేకపోతే మనం ఈ మాత్రం స్వేచ్చను కూడా అనుభవించం సార్, మీరెంత పెద్దవారైనా ఒక కానిస్టేబుల్ ముందు చేతులు కట్టుకోవాల్సిందే, లేకపోతే ఏదోఒక కేసుపెట్టి వేధించగలడు. వారికున్న అపరిమిత అధికారాలు అలాంటివి. ఎన్ని లాకప్ దెత్లు, మిస్సింగ్ కేసులు చూడడం లేదు. ఇక్కడ మన వర్గ స్వభావం కూడా పనిచేస్తుంది. విపరీత సైనిక బలగం కలిగిన రాజ్యంతో పోరాడే అణగారిన ప్రజలవైపు మాట్లాడడం మీకు తప్పుగా అనిపించొచ్చు.

    వాకపల్లి గిరిజన మహిళలపై జరిగిన దానిని సమర్ధిస్తారా? వారి ఘోషను విన్న ఒక్క న్యాయస్తానమైనా వుందా? అదే ఒక మంత్రిగారి కూతురుకో, రియలెస్టేట్ సేఠ్ గారి వారికో జరిగితే వేరేగా ఉంటుందన్న విషయం మీకు చెప్పాలా?

    కాకతీయ రైలు సంఘటనే కదా మీరన్నది. ఆ సరిదిద్దుకోలేని తప్పును గురించి ఒప్పుకొని మరల అటువంటి తప్పు జరగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.

    తుపాకీని ఫేషంగా పట్టుకోవడం కోసం ఎవరూ అడవులకెల్లరు, చావుకు సిద్ధపడరు సార్.

    దేశ వనరులన్నింటినీ నిరాటంకంగా అమ్మేస్తూ స్వంత ఆస్తులు, వ్యాపారాలు పెంచుకుంటున్న ఈ దళారీ నాయకుల కంటే ఉగ్రవాదం వుందా? భవిష్యత్ తరాలకు బానిసత్వాన్నే వారసత్వంగా ఇస్తారా?

    రిప్లయితొలగించండి
  8. మీ ఇంట్లో దొంగలు పడితే మీరు తప్పు బాబూ అని క్షమించేస్తారా? >>
    కుమార్ గారు మా ఇంట్లో దొంగలు పడితే నేను పోలీసు స్టేషన్ లో రిపోర్ట్ చేస్తాను లేదా చేతులు ముడుచుకొని కూర్చుంటాను, మరి ఎంతమంది మావోయిస్టులు సహాయం తీసుకుంటారో నాకు తెలియదు.

    వారు ప్రభుత్వ ఏజెంట్లుగా మారి ఉద్యమానికి ద్రోహం చేయడమో, ఇంఫార్మర్లుగా మారిన నాడే శిక్షింపబడుతున్నారు. దూరంగా వుండి >>
    మరి నాకు మావోయిస్టులు కూడా ప్రభుత్వ వ్యతిరేకులు గాను వాళ్ళను వ్యతిరేకించే వాళ్ళను అన్యాయం గా చంపే వాళ్ళు గా కనపడుతున్నారు అందుకే నేను ప్రభుత్వాన్ని సమర్దిస్తున్నాను.

    వాకపల్లి గిరిజన స్త్రీల తప్పేంటి. వారిని రేప్ చేయాల్సిన అవసరం ఏమిటి. >>
    ఇలాంటివి మావోయిస్టులు ఎన్ని ఆకృత్యాలకు పాల్పడ్డారో మీకు కనపడటం లేదేమో ?

    వారిని కాపాడుకునే బలగాలనే కొంతకాలంగా రికౄట్ చేసుకుంటున్న ప్రభుత్వాలను చూడరా? మిగిలిన వుద్యోగాలకంటే వాటినే ఎక్కువగా తీస్తూ మన వేలితో మనకంటినే పొడుస్తున్నారు.
    >> మరి మావోయిస్టులు చేసే రేక్రూమెట్మేంట్ల సంగతి ఏమిటి, ఎందుకు వారి బలగాన్ని పెంచుకుంటున్నారు.

    రాజ్యం ప్రశ్నించే వాళ్ళను భయ బ్రాంతులకు గురిచేయడానికి తనకున్న అవకాశాలన్నింటిని వాడుతుంది.
    >> దీని సమాధానం ఖచ్చితం గా మావోయిస్టు ఉద్యమం సాధనమా ?

    రిప్లయితొలగించండి
  9. ఇక్కడ చైనా ప్రస్తావం ఎందుకు సార్, చైనాను మావోయిస్టులు సపోర్టు చేయడం లేదు.
    ________________________________________________


    Could you please go back a couple of posts and read again what you wrote about China? Mind you, it was you who wrote it! You never made a mention about it in your article. When Suryudu tried to raise it, all you said was "we cant forget it but US was behind the unrest!" - You blamed the US for being supportive of a revolution because it was against the Pinkos - But where did YOU criticize China for the manslaughter?


    మీరెంత పెద్దవారైనా ఒక కానిస్టేబుల్ ముందు చేతులు కట్టుకోవాల్సిందే, లేకపోతే ఏదోఒక కేసుపెట్టి వేధించగలడు.
    ________________________________________________

    Aint you people killing the innocents the same way? That way the policeman is slightly better. He is, at least on paper, accountable - but you guys have no such accountability. You think you can kill anyone and expect everyone including the victim to support your murders :))

    దేశ వనరులన్నింటినీ నిరాటంకంగా అమ్మేస్తూ స్వంత ఆస్తులు, వ్యాపారాలు పెంచుకుంటున్న ఈ దళారీ నాయకుల కంటే ఉగ్రవాదం వుందా?
    ________________________________________________

    Aint you guys looting the nation? Who has looted the banks in the last few days? Who killed 455 innocents in the recent past?

    YOu still havent talked about the same Adivasis being used as the Human shields by you people!

    రిప్లయితొలగించండి
  10. In fact I asked the question in that China post itself,

    If you guys are so unselfish, why are you using Adivasis as human shields?

    If you are determined to fight the state why are you crying foul that that the state is fighting you? If you dont care for your lives, then go fight the security forces directly, without using the civilian shield to defend you (and later kill the same civilians under the false pretext as being informers).

    The reason is simple. You people dont have a logic to defend yourself. Thats why whenever somebody is questioning your (Sravya and Krishna) actions you are not able to JUSTIFY the violence perpetrated by your guys - and hence talking about the atrocities perpetrated by the state. A wronged state doesnt mean that you are right. IT IS A CLASSIC CASE WHERE BOTH THE PARTIES ARE WRONG AND ONE NEEDS TO BE REALLY HONEST TO ADMIT THAT.

    Talking about the media - Dont you pick your stories from the Media? Were you in China when the manslaughter happened? Did you see the Americans helping the protestors with your own eyes? Or is it that you accept the Media stories when they are favorable to you and reject them when they expose your misdeeds?

    రిప్లయితొలగించండి
  11. మీకు అంత నిజాయితీ ఉంటే ముప్పై ఏళ్ళ క్రితం తన వార్షిక ఆదాయం ఏడాదికి 36 వేలు అని చెప్పుకుని రాజకీయాలలోకి వచ్చిన తరువాత హెరిటేజ్ పేరుతో కార్పరేట్ పాల కంపెనీ పెట్టిన అవినీతి కింగ్ చంద్రబాబు నాయుడుని అడగండి. ఒక ఫాక్షనిస్ట్ హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోతే చనిపోయినవాడు ఎలాంటి వాడైనా శవాన్ని గౌరవించడం సంప్రదాయం అంటూ ఏడ్చిన పాలక వర్గ ప్రతినిధులైన మీకు పోలీసులు చేసే బూటకపు ఎంకౌంటర్లు, రేప్ లని సమర్థించడం కూడా కష్టం కాదులే.

    రిప్లయితొలగించండి
  12. భరద్వాజగారు ఉద్యమాలు ప్రజలకు దూరంగా లేవు. ప్రజల చేత నడుపబడినప్పుడు ప్రజలు యుద్ధంలో పాల్గొనకుండా ఎలావుంటారు. విప్లవాలు ఎవరు చేస్తారు. ప్రజల భాగస్వామ్యం లేకుండా విప్లవం సక్సెస్ కాదు. దీనికి ప్రజలను రక్షణకవచంగా వాడుకుంటున్నారనడం పోలీసు భాష. మావోయిస్టులైనా ఎవరైనా కేవలం కెటలిస్టు పాత్రమాత్రమే పోషిస్తారు. ఉద్యమ నిర్మాణ క్రమంలో ముందుంటారు. సరైన దిశలో నడిపేందుకు కృషి చేస్తారు. అంతిమంగా ప్రజలే పాల్గొని విప్లవాన్ని విజయవంతం చేస్తారు. ఇది చాలా మందికి అవగాహన లేక గణపతో, కోటేస్వరరావో విప్లవం చేసి తమకు కూచున్న చోటునుండి కదలకుండా కూడు పెడతారని భావిస్తూంటారు. ఇది తప్పుడు అవగాహన. అందుకే దీనిని దీర్ఘకాలిక పోరాటమంటున్నారు. ఈరోజు వార్తలు చూసారా? చిదంబరం ఇది రాజకీయ పోరాటంగా గుర్తిస్తున్నాం అని అన్నారు.అధికార పాలక వర్గానికి కొరకరాని కొయ్యలా ఏకైక ప్రతిపక్ష పాత్రను నిర్వహిస్తున్నది కనుకనే ఇన్ని కోట్ల రూపాయల పెట్టుబడితో దానిని నిర్మూలించేందుకు ప్రయత్నిస్తున్నారు. వారి అధికార పీఠాన్ని కబలించే శక్తి ప్రజలకుంది. ప్రజల ప్రతిఘటనా శక్తి పెరిగిన కొద్దీ మీ అనుమానాలు నివృత్తి అవుతాయి.

    అందుకే మహాకవి శ్రీశ్రీ అన్నారు:

    తెల్లవాడు నాడు నిన్ను భగత్ సింగ్ అన్నాడు
    నల్లవాడు నేడు నిన్ను నక్సలైట్ అన్నాడు
    ఎల్లవారు రేపు నిన్ను వేగుచుక్కవంటారు అని.

    అమెరి్కా పాత్ర గురించి మీడియాలోనే కాదు ప్రతి ప్రతీఘాతుక కుట్ర వెనకాల వుండేది వాడే అని కాస్తా ఆలోచించే ఎవరికైనా తెలుస్తుంది. మీడియా మంచి చెడ్డల గురించి తప్పక చర్చించాలి. విమర్శను విమర్శగానే తీసుకోవాలి. నిజాయితీగా పనిచేసే వారు కొందరైనా వున్నారు కనుకనే 10 శాతమైనా నిజాలు వెలుగుచూస్తున్నాయి. ఎన్ని కుంభకోణాలు వెలుగు చూస్తున్నాయి. ఎన్ని కనుమరుగు కాబడుతున్నాయి. ఇక్కడ కూడా మహాకవి మాటను గుర్తుకు తెచ్చుకోవచ్చు. వార్తా పత్రికలు పెట్టుబడికి విష పుత్రికలని అన్నాడు. కోట్ల రూపాయల పెట్టుబడులతో నడుస్తున్న వ్యాపారమది. కాదంటారా? కానీ సామాన్యుడి వెతలను కొన్నైనా పట్టించుకోకపోతే వారికి పత్రిక కొనేవాడుండడు, టీవీ లో చూసేవాడుండడు.

    రిప్లయితొలగించండి
  13. Praveen,

    Again trying to divert the topic? LOL ... this time I am taking the discussion up and hence will be ignoring senseless fellows like you with no brains at all :)) Whether it is YSR or Balagopal I treat the dead people the same way.


    Kumar garu,

    You still have not answered my question. HAVE YOU CRITICIZED CHINA EVER?

    And if you trea tthe Human shields as Civilian support, the Policemen treat Salwa Judum as Civilian support. Both the parties are exploiting the civilians

    రిప్లయితొలగించండి
  14. Yes. చైనా మార్చుకున్న రాజకీయార్థిక విధానాలను తప్పకుండా విమర్శిస్తున్నాము. నేను ఆ పోస్టులో రాసింది విప్లవ విజయాన్ని సాధించిన చైనా గురించి మిత్రమా? డెంగ్ అనుసరించిన విధానాలతో అది సామ్యవాద దృక్పథం నుండి తప్పుకున్నదన్నది సత్యం. దానిని రోల్ మోడల్ గా చూపి ఇక్కడ సి.పి.ఎం.వాళ్ళు బెంగాల్లో టాటాలకు అమ్ముడుపోయారు. దానిని అడ్డుకున్నది, ప్రజల పక్షాన పోరాడుతున్నది మావోయిస్టు పార్టీయే.

    సల్వాజుడుం పేరుతో వారు చేస్తున్న అకృత్యాలను అరాచకాలను కాస్తా అధ్యయనం చేయండి. డిబేట్ కోసం అలాంటి వాటిని సపోర్టు చేయడం ద్వారా నిజానికి మీరనుకున్న రాజ్యాంగబద్ధ పాలన కనుమరుగు అవుతోంది. విభజించు పాలించు సూత్రాన్ని నల్ల దొరలు కూడా ఫాలో అవుతూ మరల మన వేలితో మనకంటినే పొడుస్తున్నారు. మీరనుకుంటున్న ప్రజాస్వామ్యం నేతిబీరలో నేయి చందంగా మారుతోంది.

    ప్రవీణ్ ను అలా అనడం బాలేదు. అసలు మీరు వైఎస్ ను బాలగోపాల్ ను ఒకేలా చూస్తాననడంలోనే మీ తప్పుడు అవగాహన అర్థమవుతోంది. చనిపోయినంత మాత్రాన మనిషి చేసిన అకృత్యాలు అడుగంటిపోవు. చెడును చెడుగానే చూడాలి. దానికి అమరత్వం ఆపాదించొద్దు.

    రిప్లయితొలగించండి
  15. ఒకదానికొకటి పొంతన లేకుండా మాట్లాడుతున్నది ఎవరు బాబు? మానవ హక్కుల నాయకుడు బాలగోపాల్ కి ఒక ఫాక్షనిస్ట్ తో పోలికా? మాట్లాడుతున్నవాడికే దాని అర్థం తెలియాలి. బాలగోపాల్ ని నేను కూడా విమర్శించాను. అతను ఐక్య రాజ్య సమితి గుర్తించిన మానవ హక్కులనే అంగీకరిస్తాను అని చెప్పుకున్నాడు. ఐక్య రాజ్య సమితి ప్రైవేట్ ఆస్తిని కూడా మానవ హక్కుగా చేర్చింది. నేను ప్రైవేట్ ఆస్తివాదానికి వ్యతిరేకం. మార్క్సిస్ట్ చారిత్రక భౌతికవాదం ప్రకారం ప్రైవేట్ ఆస్తి చరిత్ర చివరి దశలో రద్దు అవుతుంది. అందుకే నేను బాలగోపాల్ వాదాన్ని అంగీకరించలేదు. బాలగోపాల్ ని చాలా విషయాలలో అంగీకరించకపోయినా పాలక వర్గాన్ని విమర్శించే విషయంలో మాత్రం అతని కాంట్రిబ్యూషన్ ని గుర్తుంచుకుంటాను. మీరు చేసింది ఏమిటి? బాలగోపాల్ బతికి ఉన్నప్పుడు అతన్ని నక్సలైట్ అని తిట్టారు. మానవ హక్కుల నాయకులకి నక్సలైట్లు మాత్రమే మానవులలాగ కనిపిస్తారు అని కూడా విమర్శించారు. ఇప్పుడు బాలగోపాల్ చనిపోయిన తరువాత అతను నక్సలైట్లని కూడా విమర్శించాడన్న విషయం గుర్తుకొచ్చిందా? చత్తీస్ గఢ్ లో సల్వా జుడుం లాగే జార్ఖండ్ లో నాగరిక్ సురక్షా సమితి అనే నరహంతక ముఠా ఉంది. పోలీసుల మీద నమ్మకం లేక కిరాయి హంతకులని నమ్ముతున్నారు.

    రిప్లయితొలగించండి
  16. చైనా మార్చుకున్న రాజకీయార్థిక విధానాలను తప్పకుండా విమర్శిస్తున్నాము
    ______________________________________________

    I was talking abpout China's manslaughter. Are you supporting the killings?


    సల్వాజుడుం పేరుతో వారు చేస్తున్న అకృత్యాలను అరాచకాలను కాస్తా అధ్యయనం చేయండి
    _________________________________________________

    Please read my message again. Did I support Salwa Judum? All I said was one group is killing people in the name of Maosim and the other is doing it in the name of Salwa Judum. BOTH THE PARTIES ARE KILLERS - CONTRACT KILLERS.

    అసలు మీరు వైఎస్ ను బాలగోపాల్ ను ఒకేలా చూస్తాననడంలోనే మీ తప్పుడు అవగాహన అర్థమవుతోంది.
    _________________________________________________

    You have many things against YS (Even I never liked YS) and I have seen what all Balagopal encouraged at Hyerabad Central University. But the very day following the death of a person is not the right occasion to criticize him unless he is a wanted criminal. In this case it is the Chief Minister of a State on the one hand and a highly respected Human Rights activist on the other hand. Before you question my understanding try to question yourself how much stuff you know.

    ప్రవీణ్ ను అలా అనడం బాలేదు
    ___________________

    That guy deserves it and much more. I am sure you have seen the kind of vulgar obscene and filthy messages he posts. If he lacks the basic decency I can respond the same way too.

    రిప్లయితొలగించండి
  17. and yes, in case of Praveen, he was the one who first questioned my understanding long back and he has proved to the world what kind of a senseless guy he is :))

    రిప్లయితొలగించండి

ఆలోచనాత్మకంగా..