20, నవంబర్ 2009, శుక్రవారం

జోహార్లు కెన్ సారోవివా జోహార్లు


నైజీరియా సైనిక నియంత అబాచా ప్రభుత్వంచే నవంబరు పది పందొమ్మిదివందల తొ౦బై ఐదున ఉరితీయబడ్డ కెన్ సారోవివా మరి ఎనిమిదిమంది ఉద్యమకారులు తమ ప్రాణత్యాగంతో ఒక మహత్తర సత్యాన్ని తెలియజేసారు. సామ్రాజ్య వాదుల అడుగులకు మడుగులొత్తే విధానాన్ని అనుసరిస్తూ తమ తల్లి స్తన్యాన్నే పణంగా పెట్టే పాలకవర్గ కుట్రలకు దేశప్రజానీకం బలవుతున్ననిజాన్ని వెల్లడించారు.

షెల్ దాని అనుబంధ చమురుకంపెనీలు నైజీరియాలోని పాలక సైనిక ముఠా అ౦డద౦డలతో, చమురును ఆబగా పైక౦గా మార్చుకుని కుబేరులయ్యరుగాని, ఆ చమురు క్షేత్రాల వద్ద, పరిసరాలలో పర్యావరణం ఎంతగా నాశనమవుతోందో, ఒగోనీ తెగ ప్రజల సంప్రదాయక పంటలు ఎలా నాశనమయ్యాయో, వారు జీవన భృతి క్రమ౦గా ఎలా కోల్పోయారో, ఇటువంటి విషయాలు పట్టించుకోలేదు. వారు తమకు జరిగిన నష్టానికి పరిహారం చెల్లించాలని ఎలుగెత్తి నినది౦చారు. స్వయం పాలనకు డిమా౦డ్ చేశారు.

ఈ ప్రజా౦దోళనను సహజంగానే సైనిక ముతా ప్రభుత్వం అత్య౦త పాశవికంగా అణచివేసింది. మొబైల్ పోలీస్ ఫోర్స్ ఒగోనీ ప్రజల ఆ౦దోళననలనణచివేయడానికి మొదటిసారి తొంభైలో ఏనాభి మందిని ఊచకోత కోసి౦ది. నాలుగువ౦దల తొ౦బైఐదు ఇళ్ళను ధ్వస౦ చేసి౦ది. మరల తొ౦బై రె౦డు వేసవిలో ఘరాన్ చమురు క్షేత్రం వద్ద వున్నా గ్రామాలపై ఈ ఎం.బి.ఎఫ్ దాడి చేసి ముప్పై మ౦దిని చ౦పిది. నూటా ఏభై మ౦దిపై లాఠీ చార్జీ చేసింది.

దీనిని అంతర్జాతీయ వేదికలలో మాట్లాడి ప్రప౦చ ప్రజల దృష్టికి ఈ సమస్యను తీసుకు వచ్చారు. తొ౦బై రె౦డులో యు.ఎస్.వర్కి౦గ్ గ్రూప్ ఆన్ ఇ౦డియన్ పాపులేషన్ సమావేశంలో (జెనీవా) మాట్లాడారు. అక్కడిను౦చి న్యూయార్క్ లోని యు.ఎన్.ఓ.సమావేశ౦లో మాట్లాడుతూ, 'చమురు వెలికితీత వల్ల-తగు జాగ్రత్తలు, రక్షణలు పాటి౦చక నిర్లక్ష్యం చేసిన౦దువలన ఒగోనీ నేడు మరుభూమిగా మారిపోయింది. దీనికి బదులుగా మాకు లభి౦చేదేమ౦టే ఒక పెద్ద గు౦డు సున్నా మాత్రమె' అన్నారు.

దీనితో శానీ అబాచా సైనిక ముఠా ప్రభుత్వం ఒగోనీలను అణచడానికి ఇరుగుపొరుగునున్న స్వదేశీ తెగల వారిని వారిపైకి ఉసిగొలిపి౦ది. ( సల్వాజుడుం, హర్మద్ వాహిని వంటివి భారత పాలక వర్గ హంతక ముఠాలువీటికి నేటి ప్రతిరూపాలు )

కెన్ సారో వివా నెలకొల్పిన ఎం.ఓ.ఎస్.ఫై.ఓ స౦స్థ షెల్ ను పది బిలియన్ డాలర్ల నష్ట పరిహార౦గా ఇవ్వాలని, దేశం విడిచిపోవాలని డిమా౦డ్ చేసి౦ది.

దీనిపై ఆగ్రహించిన సైనిక ప్రభుత్వం కెన్ సారోవివా ను మరి ఎనిమిదిమ౦ది ఉద్యమకారులను ఉరితీసి౦ది. కెన్ సారో వివా నలబై ఒకట్లో అక్టోబర్ పదో తేదీన రివర్స్ స్టేట్ రాష్ట్ర౦లో జన్మి౦చారు. గొప్ప జాతీయవాది. మహామేధావి. విశ్వవిద్యాలయ అధ్యాపకుడిగా ప్రత్యక్ష వలసపాలన ను౦డి నైజీరియా బయటపడిన తోలి స౦వత్సరాలలో ప్రభుత్వ పాలనాదికారిగా, అరవై ఎనిమిదిలో రాష్ట్ర మ౦త్రివర్గ౦లో కేబినేట్ మ౦త్రిగా పనిచేసారు. ఆయన నాలుగు నవలలు, రె౦డు కథా స౦పుటాలు, ఒక కవితా స౦పుటి, నాటికలు, తొమ్మిది పిల్లల పుస్తకాలు రాసారు. ఆయన రచనలు ఒగోనీ ప్రజల అ౦తరాత్మను ఆవిష్కరించాయి.

మీ సమాధిపై వు౦డే శిలా ఫలక౦పై ఏమిరాస్తే బాగు౦టు౦దని అడిగిన విలేకరితో వివా ఇలా చెప్పారు:
'నైజీరియా చేత మోసపోయిన మర్యాదస్తుడు ఇక్కడ శాశ్వత౦గా నిద్రపోతున్నాడు. వారు ఆయనకు సాధారణ౦గా అవసరమైన ఆరుఅడుగుల నేలనుకుడా తిరస్కరించారు'.

"ప్రభు! నా ఆత్మను స్వీకరి౦చు. కానీ, పోరాట౦ కొనసాగి తీరుతుంది" అన్నది వివా చివరి మాట.

కలలు క౦టూ చనిపోవాలని ఆశి౦చిన వివా కోరిక నిజ౦ కాకపోవడ౦ విషాదం.

చివరిగా ఇదే విధమైన అపార సైనిక, అధికార బలగాలతో అబూజ్ మడ్ (అపార ఖనిజ వనరులు కలిగిన దండకారణ్యం) ప్రా౦తంపైదాడిచేస్తు అక్కడి ఆదివాసీ ప్రజానీకాన్ని తరిమివేస్తూ, వారి గ్రామాలను తగలబెడుతూ,
స్వదేశంలోనే కా౦దిశీకులుగా మారుస్తున్నమేకవన్నెపులులప్రభుత్వం సామ్రాజ్య వాదుల అడుగులమడుగులొత్తుతున్న తీరును ప్రజాస్వామిక వాదులు తప్పక ఖండించాలి. లేకపోతే భవిష్యత్ తరాలకు ఈ దేశ వనరులు మిగలనివ్వకుండా అమ్ముకునే కుట్రకు బలి అవుతాం.

('కెన్ సారోవివా కోసం' పేరుతో జనసాహితి ప్రచురణలనుండి సమాచారం)


5 వ్యాఖ్యలు:

 1. కేం సారో వివ గురించి చాల బాగా రాసారు. సల్వాజుడుం అంటూ మనదేశం గురించి సూచించారు. మీరు రాజకీయ అంటే పార్టి లో ఎందుకు జాయిన్ అవ్వ కూడదు. నాకొక ప్రశ్న మీకు ఆస్తికత్వం మీద ఏదైనా అభిప్రాయం ఉందా

  ప్రత్యుత్తరంతొలగించు
 2. రమగారు మీ కామెంటుకు ధన్యవాదాలు. నేను మొదట నాస్తికుణ్ణయ్యాకే వామపక్షభావాల వైపు ఆకర్షితుడ్నయ్యాను. పై పోస్ట్ లో వున్నది వివా మాట. ఆయన ముస్లిం. ఖురాన్ నుండి సూక్తులను కూడా కోట్ చేస్తారు తన కోర్టు వాంగ్మూలంలోః "నాపై అబద్ధపు ఆరోపణలు చేసారు. ఈ విషయంలో నేను నిర్దోషిని. ఒగోనీ తెగవారినందరినీ, నైజర్ డెల్టా ప్రజలందరినీ, నైజీరియాలో అణచివేతకు గురౌతున్న మైనారిటీ తెగల వారినందరినీ నిటారుగా నిల్చోమనీ, భయపడకుండా తమ హక్కుల కొరకు శాంతియుతంగా పోరాడమని పిలుపునిస్తున్నా! చరిత్ర వారివైపే వుంది. దేవుడూ వారివైపే వున్నాడు. ఎందుకంటే పవిత్ర ఖురాన్ లో ఇలా వుంది. 'అణచివేతకు గురైనప్పుడు పోరాటం చేయడం నేరం కాదు. అణచివేతదారుడిని అల్లా శిక్షిస్తాడు." (సుర పద్యం ౪౧) ఆరోజు వచ్చుగాక. అంటారు వివా.

  ఇంక మీ సూచన పార్టీలో ఎందుకు జాయిన్ అవ్వకూడదు అని. ఏ పార్టీలో చేరమంటారు. ఎన్నికల రొంపిలో కూరుకుపోయి అధికార దాహంతో ప్రజల మానప్రాణాలను హరిస్తూ దోపిడీదారుల కొమ్ముకాస్తున్న రాజకీయాలలోనా? థూ...

  ప్రత్యుత్తరంతొలగించు
 3. వర్మ గారూ,
  చాల చక్కగ ఉంది మీ వ్యాసం. ఈ మధ్య టీవి 9 లో చేగువేరా మీద ఓ ప్రోగ్రాం చూపించేరు. అంత ఆథెంటిక్ గా లేదు. కెన్ సారో వివా మీద రాసినట్లుగానే చే గురించి మరొక్క మారు పరిచయం చేయకూడదూ. అయినా నేను ఈ మధ్యే ఈ బ్లాగ్లోకానికి వచ్చాను. నేను ఊహించిన దానికన్న చాల ఎక్కువ పనే జరుగుతుంది. మొత్తానికి మంచి బ్లాగులు నడుపుతున్నందుకు అభినందనలు
  కె ఎన్ మల్లీశ్వరి

  ప్రత్యుత్తరంతొలగించు
 4. మల్లీశ్వరి గారికి నా రాతలు నచ్చినందుకు ధన్యవాదాలు.

  చేగువేరా గురించి రాయాలనే వుంది. కానీ ఆయన గురించి ఇప్పటికే చాలా రచనలు వచ్చాయి కదా అని ఆలోచనలో వెనకడుగేసాను. మీరిచ్చిన స్ఫూర్తితో ప్రయత్నిస్తా.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. మంచి పోస్టు. నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లో ఆయన్ను ఉరి తీశారు. ఎంతగానో ఆవేశపడ్డాం. ఆవేదన చెందాం.
  ఈ టీవీ న్యూస్ లో పనిచేస్తున్నపుడు ఒకసారి మన ఈశాన్య రాష్ట్రాలపై చర్చ వచ్చింది. ఆ రోజు కేంద్రం వాళ్ళకు స్పెషల్ ప్యాకేజీ ప్రకటించింది. మా సీనియర్ ఒకాయన ఆవేదనగా అన్నారు. టీ ఎస్టేట్లని, కాఫీ తోటలని, చమురని ఈశాన్య రాష్ట్రాలను పీల్చి పిప్పి చేస్తున్నారు. ఇప్పుడు వాళ్ళకు ముష్టి వేస్తున్నారు. వేర్పాటు ధోరణి ప్రభుత్వాల్లోనే ఉంది. ఎంతసేపూ ఈశన్య రాష్త్రాలంటే వారికి ఆదాయ వనరుగానే కనబడుతుంది. అక్కడి మనుషుల ప్రాణాలకు ప్రబుత్వాల దృష్టిలో విలువ లేదు అని. తీవ్రవాదులు ఎందుకు తయారు కారు అని? ప్రపంచవ్యాప్తంగా ఎన్నో కోట్ల అమాయక ప్రజలు... వాళ్ళు చేసిన నేరమల్లా ఖనిజ సంపద ఉన్నచోట పుట్టడమే. ఒకోసారి ఎంతో దుఖం అనిపిస్తుంది. అక్కడి పిల్లలు ఎంత అద్వాన్నంగా ఉంటారు, వారి జీవితాలు ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉంటాయి????

  ప్రత్యుత్తరంతొలగించు

ఆలోచనాత్మకంగా..