17, ఫిబ్రవరి 2011, గురువారం

ప్రజాస్వామ్యం అంటే ఏమిటో?



ఈ రోజు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం ప్రజాస్వామ్యం ఖూనీ ఐపోవడమా?


అసలు ఈ గవర్నర్ ఎన్నడైనా ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించారా? ఆయన వచ్చినప్పటినుండి ఇక్కడ వివాదాలను సృష్టిస్తూ వస్తున్నారు. ప్రజా సమస్యలపట్ల చాలా చులకన భావంతో వ్యాఖ్యానిస్తుంటారు. అసలు ఓ మాజీ ఐ.పి.ఎస్.అధికారిని ఇక్కడ గవర్నర్ గానియమించడంలో ఉద్దేశ్యం పాలనా పగ్గాలను పోలీసు వారికి అందజేయడానికే కదా? తెలంగాణా అంశం పట్ల వైరి భావంతో వున్న ఆయన తన ప్రసంగ పాఠం అంతా రాష్ట్రం సుభిక్షంగా వర్థిల్లుతోందన్న రాత కాపీని చదివి ఎవర్ని మోసపుచ్చడానికి. ఇన్నాళ్ళకు తెలుగు వాళ్ళకు పౌరుషముందనిపించారు. మాజీ తమిళపోళ్ళందరికీ పదవులు కట్టబెడుతున్న చిదంబరం అండ్ కో కు ఇది చెంపదెబ్బ.

ఇంక ఏకైక సత్తా MLA గారు జె.పి. మైకు దొరగ్గానే తన బాణీలో రెందు నాల్కల ధోరణిలో కఱ విరక్క పాము చావక లాంటి మాటలు మాటాడుతుంటే తగిన బుద్ధి చెప్పారు. ఈయనొక్కడే నీతిమంతుడు ప్రజాస్వామ్య పరిరక్షకుడులా ఫోజు కొడ్తుంటాడు. ఈయన IAS అయిన తరువాత ఆ ముందు ఆస్తులు గురించి మాటాడితే బాగుణ్ణు.

అసెంబ్లీ, పార్లమెంటు సభ్యులను ప్రశ్నించడం నేరమా? ఆ రెండూ నిజంగా ప్రజాస్వామ్య యుతంగా పనిచేస్తున్నాయా? అసలు వీళ్ళంతా రాజ్యాంగ బద్ధంగా వ్యవహరిస్తున్నారా? ఓట్లేసిన పాపానికి జనం నెత్తినెక్కి వీళ్ళ వీళ్ళ కులాలు, వర్గాల వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడానికి, ఆస్తులను కాపాడుకోవడానికి తప్ప వేరే ధ్యాస వుందా? ఎవడికి నచ్చినట్లు వాడు జీవోలను రాసుకుంటూ స్వప్రయోజనాలను కాపాడుకోవడాఅనికి పాటుపడడమే. కోట్లాది రూపాయల కుంభకోణాలు చేస్తూ ప్రజల ఆస్తులను తెగనమ్మేస్తూ హిరణ్యాక్ష పాలనచేస్తున్న వీళ్ళు ప్రజాస్వామ్యం గురించి కామెంటు చేయడం? ఎవడి స్వలాభపేక్ష కోసం వాడు ప్రజలకు ఏదో చేసేస్తామని హామీలు ఇచ్చి గద్దెనిక్కి వారి మందీ మార్బలాన్ని పెంచుకోవడానికి కాకపోతే నీతి కబుర్లెందుకు?

ఆరు వందలమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం ప్రజ్సాస్వామ్యం ఖూనీ కావడం కాదా? వాళ్ళ ఆశను నెరవేరుస్తున్నామని చెప్పి మోసం చేయడం ప్రజాస్వామ్యం ఖూనీ కావడం కాదా?

7 కామెంట్‌లు:

  1. అసలు ఆంద్ర ప్రదేశ్ అసెంబ్లీ,
    ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం ఏమాత్రమైనా ప్రజాస్వామ్య బద్ధం గా వ్యవహరిస్తోందా?
    అంటా శ్రీరంగ నీతులు వల్లించే వాళ్ళే గానీ
    ౨౦౦౪ నుంచీ కాంగ్రెస్, టీ డీ పీ ల వ్యవహార శైలి , వాళ్ళు ప్రజల కిచ్చిన హామీలు,
    వాటినే తుంగలో తొక్కినా తీరు, రెండుకాళ్ళ సిద్దాతాలు, ఒకే పార్టీలో రెండు వాదనలు
    ఇదంతా ప్రజాస్వామ్య బాధ్ధమేనా.
    దొంగ లంజా కొడుకు లసలే మెసలే దూర్తలోకంగా మార లేదు మన సమైక్యాంధ్ర
    ఇంకా ఎందుకీ ఆత్మ వంచన

    రిప్లయితొలగించండి
  2. jp voka tolubomma,aaDinchedi voka iTali bomma,manmohan vennemuka lEni bomma,chiranjeevi voka chinna bomma,chandrababu guDDi bomma.....so...antaa aatalo baagamE....aata pEru prajaasvaamyamu.

    రిప్లయితొలగించండి
  3. /౨౦౦౪ నుంచీ కాంగ్రెస్, టీ డీ పీ ల వ్యవహార శైలి , వాళ్ళు ప్రజల కిచ్చిన హామీలు,వాటినే తుంగలో తొక్కినా తీరు, రెండుకాళ్ళ సిద్దాతాలు, ఒకే పార్టీలో రెండు వాదనలు ఇదంతా ప్రజాస్వామ్య బాధ్ధమేనా./

    YES. That IS perfectly within democratic spirit, any doubt?! People would/should have voted out them out if not w/o deposit. Your questioning is also democratic, but not attacking them to agree with you.

    రిప్లయితొలగించండి
  4. సిగ్గేస్తోంది ఈ టపా చదవడానికి! సిగ్గేస్తోంది ఇక్కడ ఆ పక్కన చే ఫొటో చూడ్డానికి! సిగ్గేస్తోంది ఒక శాసనసభ్యుడిని "కొంట్టండ్రా ఆడిని" అని తోటి ఎమ్మెల్యే కొట్టించడాన్ని ఇంత నిస్సిగ్గుగా "బుద్ధి" చెప్పడంగా భావించడాన్ని!

    ఈ మోసపూరిత టపా చూస్తుంటే అక్కడికేదో నిన్న తెగబడ్డ గూండాలు కేవలం పాపం ప్రజాస్వామ్యాన్ని కాపాడ్డానికే గవర్నర్ చేతిలో పేపర్లు లాక్కుని, ఆయన మైకు విరగ్గొట్టినట్టు ఉంది కానీ మరో కారణంగా కాదు. ఆ గూండాలకి రాజ్యాంగ బద్ధత నిన్ననే గుర్తొచ్చిందా?

    ఆరు వందల మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోడానికి ప్రేరేపించిందెవరో ఒక్కసారి వంగి కింద నలుగు చూస్కుని మాట్లాడాలి, సహచరుడు అని పేరు పెట్టుకోగానే సరి కాదు. ఆత్మహత్యలు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే! మరి ఆ ప్రేరేపించివాళ్ళని ఏం చేయాలో ఆలోచించండి!
    కోట్లాది రూపాయల కుంభకోణాలు చేస్తూ ప్రజల ఆస్తులను తెగనమ్మేస్తూ హిరణ్యాక్ష పాలనచేస్తున్న వీళ్ళు ప్రజాస్వామ్యం గురించి కామెంటు చేయడం? ఎవడి స్వలాభపేక్ష కోసం వాడు ప్రజలకు ఏదో చేసేస్తామని హామీలు ఇచ్చి గద్దెనిక్కి వారి మందీ మార్బలాన్ని పెంచుకోవడానికి కాకపోతే నీతి కబుర్లెందుకు?....అబ్బ, చా! నిన్న వాళ్ళు వాడిన మాటలూ, చేసిన చేతలూ అందరూ హై డెఫినెషన్ LCD టీవీల్లో చూసార్లే,! ప్రజా స్వామ్యం కోసం వీళ్ళీ రకంగా దాడికి తెగబడితే ప్రజలెప్పుడో వీళ్ళకి దండలేసి దాసోహం అనేవాళ్ళే!

    ఒక్కటే నినాదం "తెలంగాణా లో ఉంటూ తెలంగాణా ద్రోహిహా ప్రవర్తినాడు" అని! దాంతోనే జేపీ ని కొట్టమని ప్రోత్సహించడం,ఒక బయటి వ్యక్తి....ఒక డ్రైవర్ ఉన్మాదంతో ఆయనమీద చేయి చేసుకోడం జరిగాయి.

    ఎవరికి చెప్తారు కీ సొల్లు కబుర్లు! రెండు కాదు, పది నాల్కల ధోరణి మీది.

    పోలీసులంటే మండిపడే నక్సల్స్ సానుభూతి పరుడిగా, ఒక మాజీ ఐపీఎస్ అధికారి గవర్నరుగా ఉండటం పట్ల మీ "కడుపు మంట" అర్థం చేసుకోదగ్గదే పాపం!


    నర నరానా ద్వేషం మీకు! సాటి తెలుగువాడంటే ద్వేషం సమైక్యవాదని!
    సాటి భారతీయుడంటే ద్వేషం తమిళవాడని!

    ఇక్కడ నరసిమ్హన్ మీద దాడి చేస్తే అక్కడ చిదంబరానికి చెంపదెబ్బా?అంటే ఈ దాడిని ఒక గవర్నర్ మీద జరిగిన దాడిగా కా ఒక తమిళవాడి మీద జరిగిన దాడిగా చూస్తున్నారా? మరి పైన గవర్నర్ ఏం పీకాడని దాడిచేయకూడదంటారే? ఇది ఏం ధోరణి?

    తెలంగాణా ప్రకటన చేయగానే చిదంబరం చుట్టమైపోయాడు మీకు. అది వెనక్కి పోగానే శత్రువై కూచున్నాడు. రేపు మళ్ళీ ఇస్తామని ప్రకటిస్తే మళ్ళీ ఆయన్నే దేవుడని పొగుడుతారు....ఇప్పుడు చెప్మదెబ్బలు కొట్టామని సంతోషించిన సంగతి మర్చిపోయి.

    నిస్సిగ్గుగా గూండాల్లా రెచ్చిపోయినవారిని వెనకేసుకు రావడానికి ప్రజాస్వామ్యాన్ని అడ్డుపెట్టుకోకండి సారు, దెబ్బతింటరు!

    రిప్లయితొలగించండి
  5. Did u notice, The third pera... is it not against first three peras? This third pera is not applicable to TRS?

    రిప్లయితొలగించండి
  6. Well said, Kiran Kumar. As usual, Communists traditionally try to fool others for their own survival. :)

    రిప్లయితొలగించండి

ఆలోచనాత్మకంగా..