15, ఆగస్టు 2011, సోమవారం

భ్రమలొద్దు అన్నా..


అనుభవంలోకి వస్తేనే కానీ వ్యవస్థ లోని నిరంకుశత్వం బోధపడదు. అన్నాహజారే లాంటి వాళ్ళు ఇన్నాళ్ళు వ్యవస్థలోని భాగాలుగా NGO సంస్థల ప్రతినిధులుగా ఏదో బాగు చేసేస్తున్నామన్న భ్రమలలో తాముండి జనాలను మభ్యపెట్టారు. ప్రజలను ఉద్యమాలనుండి వేరు చేయడానికి తమ వంతు కృషి చేసారు. ప్రజాపోరాటాలను వ్యతిరేకించారు. సంస్కరణ వాదంతో కేన్సర్ వ్యాధికి పలాస్త్రీ వైద్యం చేయబూనారు. అలాగే రాజ్యహింసకు వ్యతిరేకంగా జరిగే పోరాట రూపాలను తీవ్రవాద ముద్ర వేయడంలో దోహదపడ్డారు. దీంతో కార్పొరేట్ పాలకులకు తమ కౄర పాలనకు వెన్ను దన్ను లభించడంతో ఇటువంటి వారిని తమ మీడియా ద్వారా ఆకాశానికెత్తేసారు. అలాగే వీళ్ళ ద్వారా ప్రజల పోరాట పటిమను అణచివేయడానికి సంక్షేమ పథకాల ముసుగులో లక్షల కోట్ల రూపాయలు అభివృద్ధి ముసుగులో దోచుకున్నారు. వ్యవస్థలోని ఉపరితలాంశాలను చూపుతూ మూలాలను దాచిపెట్టే ప్రయత్నాలకు వెన్నుదన్నుగా నిలిచారు. దాంతో వీళ్ళకి రామన్ మెగసేసేలు, భారత భూషణాలు లభించేసరికి తమను తాము హీరోలమనుకున్నారు.

పాలక వర్గాలకు వ్యతిరేకంగా మాటాడితేనే ఏమవుతుందో, ఆఖరికి 'సత్యాగ్రహం' లాంటిది చేద్దామన్నా, నిరసన తెలుపడానికి నలుగురు కూడుదామన్నా అనుమతులు దొరకకపోవడం అరెస్టులు చేయడానికి సైతం రాజ్యం ముందుకు వస్తుండడటంతో ఇన్నాళ్ళు రాని అసహనం, కోపం ఆక్రోశం బయటపెడ్తున్నారు. న్యాయవాదులు, మాజీ ఐపిఎస్ లకు కాళ్ళూ చేతులు ఆడటంలేదు. ఇన్నేళ్ళుగా సామాన్య గిరిజనం, బహుజనం అనుభవించిన నిరంకుశత్వం ఎంత తీవ్రమైనదో తెలిసివస్తోందా?

తాము అవినీతి పరులుగా పదిమందిలో పాలకవర్గాన్ని నిలుపుదామనుకుంటే మీరూ గురివింద గింజలే అని చూపుతున్న పాలకవర్గాన్ని చూస్తే నవ్వొస్తోంది..మరో వైపు అసహ్యమేస్తోంది..





6 కామెంట్‌లు:

  1. వర్మ గారూ...మిగతా విషయాల సంగతేమో గానీ, ఈ ఉద్యమంలో భాగంగా అంటూ అరవింద్ కేజ్రీవాల్ హైదరాబాద్ వొచ్చి 'మన బాబు' తో చర్చలు జరిపిన విషయం పేపర్లలో చూసి, 'ఇక దీన్ని గురించి పట్టించుకోవడం టైం వేస్టు' అనిపించింది.... Hats off...very committed, honest and daring words....keep it up verma gaaru

    రిప్లయితొలగించండి
  2. NGOలు నడపడం కూడా లాభదాయకమైన వృత్తే. NGOలు అవినీతి చెయ్యవని ఎందుకు అనుకోవాలి? రాజకీయ నాయకులు మాత్రమే అవినీతి చేస్తారనుకుంటే అది సినిమాటిక్‌గా ఉంటుంది. మా పట్టణంలో ఒకతను ప్రభుత్వ కాలేజ్‌లో లెక్చరర్ ఉద్యోగానికి రాజీనామా చేసి NGO పెట్టాడు. ప్రభుత్వ ఉద్యోగి సైడ్ బిజినెస్‌లు చెయ్యడానికి రూల్స్ ఒప్పుకోవు కాబట్టి ఉద్యోగానికి రాజీనామా చేసి NGO పెట్టాడు. అనాథ పిల్లలు, నిరక్షరాస్యుల ఫొటోలు చూపించి, వాళ్ళకి చదువు నేర్పిస్తున్నామని చెప్పి రెండు చేతులా విరాళాలు సంపాదిస్తున్నాడు.

    రిప్లయితొలగించండి
  3. @Koduri Vijayakumar: Thank u sir...

    @Praveen Sharma: స్వచ్చంద సంస్థల వారి దోపిడీ అందరికీ తెలిసినదే...అంతా ఫోటోల షోతో ఫండ్ కలెక్షన్ కార్యక్రమాలే...థాంక్యూ...

    @డేవిడ్ః థాంక్యూ సార్..

    రిప్లయితొలగించండి
  4. వర్మ గారూ! ఇదేదో కొత్త కోణం నాకు. NGO ల డొల్లతనం గురించి తెలుసు గాని, అన్నా హజారేను కూడా అదే గాటకు కట్టేయవలసొస్తే మరింత నిరాశ ముంచుకోస్తోందండి. కాని మీరు వ్రాసినది లాస్ట లోతుగా ఆలోచించాల్సిందే. ఆలస్యం గా మీ వ్యాసం చదివాను.మీ సునిశిత పరిశీలన, ధైర్యం మెచ్చదగినవి. హజారే గురించి గతంలో నా స్పందన ఇక్కడ --http://gksraja.blogspot.com/2011/04/blog-post_09.html చూడండి.

    రిప్లయితొలగించండి
  5. @gksraja gaaru mee spandanaku thanksandi...state veellato elaa ataadukuntundo gamaninchaaraa..veellanta nadipina ngo la lekkalu vaalla daggara undi veella gontu nokkutondi..teliyaka chesina telisi chesina tappu tappe kadaa..evaroo ateetulu kaadu kadaa...raavisastri gaarannatlu teetulevaru leru..mee blog chustanu..

    రిప్లయితొలగించండి

ఆలోచనాత్మకంగా..