5, ఆగస్టు 2011, శుక్రవారం

కా.సరోజ్ దత్తా స్మృతిలో...


ఈ దేశ ప్రజల విముక్తి కొరకు ప్రాణాలర్పించిన మొదటి రాష్ట్ర కమిటీ నాయకుడు (అవిభక్త సి.పి.ఐ.ఎంల్ పార్టీ), కవి, రచయిత కా.సరోజ్ దత్తా అమరుడైన దినం.

కా.సరోజ్ దత్తా వెస్ట్ బెంగాల్ లోని జెస్సోర్ లోని భూస్వామ్య కుటుంబంలో పందొమ్మిది వందల పద్నాలుగు లో జన్మించారు. కలకత్తా యూనివర్శిటీలో ఇంగ్లీషులో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసాక అమృతబజార్ పత్రికలో నలభైల ప్రాంతంలో చేరారు. ఆ తరువాత పూర్తికాలపు కార్యకర్తగా భారత కమ్యూనిస్ట్ పార్టీలో 'స్వాధీనత' సంఘంలో చేరారు. 'పరిచయ్' అనే సాంస్కృతిక పత్రికకు సంపాదకునిగా కూడా పనిచేసారు.

అరవై రెండులో కా.సరోజ్ దత్తా కా.చారుమజుందార్ను జైలులో కలిసారు. ఆ తరువాత సిపిఐ నాయకత్వపు డెంగీ సిద్ధాంతానికి వ్యతిరేకిస్తూ మార్క్సిస్ట్ పార్టీలో అరవై నాలుగు చీలిక సందర్భంగా చేరారు. కానీ ఈ నయా రివిజనిస్ట్ నాయకత్వం అనుసరిస్తున్న కృస్చేవ్ మార్గాన్ని వ్యతిరేకించి సుశితల్ రాయ్ చౌదరి, అసిత్ సేన్ వంటి వారితో కలిసి మార్క్సిస్ట్ లెనినిస్ట్ స్టడీ సెంటర్ ను నయా రివిజనిస్టులకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసారు. ఆ తరువాత నక్సల్బరీ పోరాట ఉధృతితో మార్క్సిస్ట్ పార్టీ బహిష్కరణకు గురయ్యారు.

ఎఐసిసిఆర్, సిపిఐ ఎం.ఎల్. పార్టీల ఏర్పాటుకు కా.సరోజ్ దత్తా ముఖ్యభూమిక పోషించారు. కా.చారుమజుందార్ నాయకత్వాన్ని బలపరుస్తు, పార్టీ అంతర్గత సైద్ధాంతిక చర్చలలో ప్రధాన భూమిక వహించారు.

పందొమ్మిది వందల డెబ్భై ల ప్రాంతంలో రాజ్యానికి మోస్ట్ వాంటెడ్ ప్రజా నాయకుడుగా మారారు. వారికి ప్రధాన శతృవుగా ప్రజల పక్షాన పోరాడే ముఖ్య నాయకుడిగా ప్రజల గుండెల్లో చోటు సంపాదించారు. రాజ్యం ఆగస్ట్ ఐదో తారీఖున డెబ్భై ఒకటో సం.లో కా.సరోజ్ దత్తా ను రహస్యంగా పిరికిపందలా చంపింది.

దేశబ్రతి పత్రికలో 'పత్రికార్ దునియార్' అని రాసిన పత్రం ఎం.ఎల్. రచనలలో గొప్పరచనగా నేటికీ గుర్తింపబడుతోంది..

ప్రజా నాయకుడైన కా.సరోజ్ దత్తా ప్రజల గుండెల్లో ఎప్పటికీ చిరంజీవి. అమర్ రహే కా.సరోజ్ దత్తా...




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆలోచనాత్మకంగా..