11, జులై 2011, సోమవారం

మానవ మృగాలు

లంక మారణ హోమంలో ఒక జాతి మొత్తం నాశనం చేయబడిన తీరు చూస్తుంటే మనం ఏ కాలంలో వున్నామన్న ప్రశ్న ఉదయిస్తుంది.. ఇంత దారుణం జరిగినా మాటాడని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ కు అందుకే రెండో సారి పట్టం కట్టారా అనిపిస్తోంది.. మన దేశం నుండి వలస వెళ్ళి రెండో తెగ ప్రజలుగా అనేక విధాలుగా హీనంగా చూడబడ్డ వారిపై కనీస మానవత్వం చూపలేని ఈ దేశ పాలక వర్గం ఎంతకైనా తెగిస్తుందని తెలియవస్తోంది.. రాజీవ్ గాంధీ హత్య జరగడంతో ఆ దేశంలోని తమిళులపై జరిగిన దారుణ మారణ కాండను కనీసం ప్రశ్నించలేని మౌన ప్రేక్షకులైన ఈ దేశ పాలక వర్గం ఎంత కౄరమైనదో తెలుస్తోంది. ఒక జాతి మొత్తం తుడిచిపెట్టే దారుణాన్ని ఒడిగట్టిన దేశంపై కనీస మానవహక్కుల చట్టం గురించి మాటాడని అగ్ర రాజ్యాల అవకాశ వాదం ఇంకెన్ని బలిదానాలు కోరుతుందో? ఈ మారణ హోమం చూసిన వారికి ఎవరికైనా కడుపులో పేగులు నోట్లోకి రాక మానవు....చీ ఇంత నీచమైన కాలంలో బతుకుతున్నామా?
1 వ్యాఖ్య:

  1. నాజీ హిట్లరు కూడా సిగ్గుతో తలవంచు కుంటాడేమో ఈ దృశ్యాలు చూసి. పక్కన ఇంత ఘోరకలి జరుగుతుంటే భారతీయ ఇంటెలిజెన్స్‌కి తెలియకుండా ఎలా వుంటుంది? అయినా కూడా ఏమాత్రం సిగ్గులేక కిమ్మనకుండా ఉండడం మన ప్రభుత్వం దోపిడీతత్వాన్ని మాత్రమే సూచిస్తుంది. ఇక కోట్లు తప్ప మరేమీ కరుణానిధి అర్ధరోజు దీక్షచేసి అయిందనిపించాడు.

    ఇంక రావణ విమానాలు, రావణుడి నిధులు అంటూ రోజుల తరబడి ఊదరగొట్టే మన మీడియాకి కూడా ఇలాంటి విషయాలు మాత్రం అసలే పట్టవు. వీడియోల్లోని దృష్యాలు హ్రుదయాన్ని కలచివేశాయి.

    ఇంక లిబియా, ఈజిప్టు అంటూ గుండెలు బాదుకునే అమెరికాకు ఇలాంటి మారణహోమాలు అసలే పట్టవు.

    అంతర్జాతీయ సమాజం ఈ విషయంపై అంతర్జాతీయ కోర్టులో విచారించి రాజపక్సేని శిక్షించకుండా వదలకూడదు.

    ప్రత్యుత్తరంతొలగించు

ఆలోచనాత్మకంగా..