6, జూన్ 2012, బుధవారం

ఈ దేశానికి పట్టిన చీడ ఎవరు??

దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తున్నకార్పొరేట్ రాజకీయ నాయకులు వారి అడుగులకు మడుగులొత్తుతూ జీ హుజూర్ అంటు బానిసల్లా బతుకుతూ సొంత ఇంటి లాభం చూసుకునే స్వార్థ ఐ.ఎ.ఎస్.లు, వీరిద్దరికీ కాపు కాస్తున్న దళారీ న్యాయవ్యవస్థ వీళ్ళ వలన ఈ దేశం ఎంతగా అతలాకుతలమవుతుందో అందరికీ ఎరుకే.

ఏదో గొప్ప నీతిమంతుడి ఫోజుతో మధ్యతరగతి అవకాశవాద మనఃస్తత్వాన్ని సొమ్ము చేసుకొని అధికారంలోకొచ్చేద్దామని కలలు కంటూ రాజకీయాల్లోకొచ్చిన పాత చెదపురుగు లోక్ సత్తా పేరుతో పార్టీ పెట్టిన జయప్రకాష్ నారాయణ నిన్న గనులు దోచినోల్లు నక్సలైట్ల కంటే ప్రమాదకారులని స్టేట్మెంటు ఇవ్వడం చూస్తుంటే ఈయన గారి సామాజిక రాజకీయ ఆర్థిక అవగాహన ఏపాటిదో తెలుస్తోంది.
ఈ దేశానికి నక్సలైట్ల వలన ప్రమాదమా ఇలా దోపిడీ దారుల కొమ్ము కాసే ప్రభుత్వాధికారులవలన ప్రమాదమో ప్లెబిసైట్ నిర్వహిస్తే తెలుస్తుంది జనవాణి. వీళ్ళేదో దేశంలో తెలివైన వారిగా ఫోజు కొడుతూ విపరీతంగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తూ, కుల పొగరు చూపుతూ , అధికారంలో వున్నన్నాళ్ళు రాజభోగాలనుభవిస్తూ, ప్రజల సొమ్ము అప్పనంగా దోచుకుపోయే వర్గం. వీరి వత్తాసు లేకుండా ఏ రాజకీయ నాయకుడూ దోచుకుపోలేడు. అధికారంలో వున్నవాడి కొమ్ము కాస్తూ తమకేదీ జరగదన్న ధీమాతో తామేదో దైవపుత్రులులా మిగిలిన వారిని హీనంగా చూసే ఈ దేశ ప్రధాన పాలక అధికార గణం ఏపాటి నీతి మంతమయినదో అందరికీ తెలిసినదే.
అవినీతిని రూపుమాపే పేరుతో ఈయన ఇంతవరకూ చేసిన ఉద్యమాలేపాటివో, గోడ మీది పిల్లివాటంలా వుంటూ తన పబ్బం గడుపుతున్న మాజీ గారు ఏదో పేపర్లలో కనబడ్డం కోసం ప్రకటనలివ్వడం తప్ప ఈయన చేస్తున్న ప్రత్యేకమైన కార్యక్రమం ఏమీ లేదింతవరకు..
ఈ దేశ సహజవనరులను కాపాడేందుకు ప్రాణాలొడ్డి పోరుతూ బానిస వ్యవస్థను రూపుమాపుతూ సమ సమాజ నిర్మాణమే ధ్యేయంగా అహర్నిశలూ పోరాడుతున్న నిజమైన దేశభక్తులైన నక్సలైట్ల పట్ల ఈయన వైఖరిని ఖండిస్తున్నా..

13 వ్యాఖ్యలు:

 1. Chala roajula tarvata oka manchi posting chusaanu,dhanyavaadaalu,ee desaniki pattina cheeda nissandehamga,nissanchayamgaa,prajaswamyamea,eavars gaallandaroo raajakeeyaalaloaki vachchi prajadroham chestunnaru,ee desaniki,multiparty system panikiraadu,byeparty system undali,ika poate meeranntlu em mataladaali,teliyani vedavalu desaanni paripalistunte,alaage untundi

  ప్రత్యుత్తరంతొలగించు
 2. మరి మీరు చెట్లు నరికారా?
  నల్లమల అడవుల్లో చెట్లు నరికిన మీ దేశభక్తుల గురించి అభిప్రాయం కూడా తెలిపితే బాగుంటుంది.
  తినడానికి తిండి
  బ్రతకడానికి నేల
  ఉండడానికి ఇళ్ళు

  మరి పీల్చడానికి గాలి లేకుండా చేస్తున్న మీ నిజమైన దేశభక్తుల అభిలాష తెలపండి.

  ఇప్పుడు జనాలు భయపడుతున్నది
  అబద్దపు గాంధేయ వాదులకు మరియు నిజమైన మీరంటున్న దేశ భక్తులకు.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. ఫణీంద్ర గారూ చెట్లు నరికి దొంగ వ్యాపారాలు చేస్తున్నదెవరో తెలిసే అడుగుతున్నారా?? లేక అమాయకత్వం నటిస్తున్నారా?? సామాన్య జనాలెవరూ నక్సలైట్లకి భయపడ్డంలేదు..పర్యావరణాన్ని అడవులను కాపాడుతున్నది వీళ్ళే..మీరన్న నల్లమల ప్రాంతంలో వీరు వెనక్కి మళ్ళాక ఎన్ని చెట్లు నేల కూల్చారో ఒకసారి పరిశీలించగలరు..

   తొలగించు
 3. ఈ టపాలో పరిణతి లేదు. ఆవేశం ఉంది. వివరణ లేదు. వ్యక్తిగత దూషణలున్నాయి. మీ శైలి ఇంకా ఎదగాలని కోరుకుంటున్నాను. మన భాషలో నుడికారాల్లా కనపడేవి ఎక్కువభాగం పరదూషణకి ఉద్దేశించినటువంటివి. అవి తెలిసినా, తెలియనట్లే వాటినుంచి వ్రాతరులు దూరంగా ఉండాలి. దూషణతో ఎవఱినీ మార్చలేం. ఒక మాటని ఆహ్లాదకరంగా చెప్పడానికి ఎంతవఱకూ అవకాశం ఉందో అంత దూరమూ వ్రాతరి శ్రమ తీసుకొని ప్రయాణం చేయాలి. ఆ క్రమంలో వ్యాసాన్ని వందసార్లు ఎడిట్ చేసినా తప్పులేదు. నేను అదే చేస్తూంటాను.

  ప్రత్యుత్తరంతొలగించు
  ప్రత్యుత్తరాలు
  1. క్షమించండి ఆ వ్యాఖ్యానం చూసినప్పటి ఆవేశం అలా రాయించింది. ఇకముందు మీరన్న జాగ్రత్త తీసుకుంటాను తాడేపల్లి గారూ..ధన్యవాదాలు..

   తొలగించు
 4. జెపి ఎంతైనా పాలక వర్గాన్ని నమ్ముకున్నవాడు కనుక అలాగే అంటాడు. గనులు దోచుకునేవాళ్ళు ఎంత దోచుకున్నా, వాళ్ళ వల్ల పాలక వర్గం పడిపోదు. పైగా గనులు దోచుకునేవాళ్ళు ఇచ్చిన లంచాల వల్ల పాలక వర్గం మరింత బలంగా ఉంటుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. చక్కని సూచనకి తాడేపల్లి గారికి దన్యవాదాలు!
  జె.పి అలా అనడ౦ ఆయన పరినితిని చూచిస్తు౦ది!......నక్స"లైట్ల"క౦టే ప్రమాదకర౦ జె.పి.లా౦టి అడ్వాన్స్ నాయకుడు

  ప్రత్యుత్తరంతొలగించు
 6. జె.పి.గారు తన పునర్ ఎన్నికకి కాంగ్రెస్ మీద ఆధారపడుతున్నాడనుకుంటా. ఎందుకంటే ఒకప్పటి విజయం కూడా కాంగ్రెస్ భిక్షేనని నాబోటివాళ్ళకి లోలోపల ఎక్కడో ఓ మూల చిన్నఅనుమానం. ఈ మధ్య ఆయనకి అన్నా హజారే కూడా తప్పుడుమనిషిగానే కనిపిస్తున్నారు. భారతదేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సైన కొల్లేటిని పూడ్చి, కలుషితం చేసి, అక్రమించుకొని పర్యావరణాన్ని నాశనం చేసిన బెజవాడ వ్యాపారులు (వీళ్ళ నేపథ్యం ఊహించండి) ఈయనకి మంచిమనుషుల్లా కనిపించినప్పటి నుంచే నాకు "మా జిల్లావా"డనే అభిమానం, నిజాయితీపరుడనే విశ్వాసం కాస్తకాస్త సడలడం మొదలైంది. జె.పి. తన అభిమానుల్లో మళ్ళీ పూర్వపు విశ్వాసాన్ని పాదుకొల్పాలంటే కష్టపడాల్సిందే.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. "సామాన్య జనాలెవరూ నక్సలైట్లకి భయపడ్డంలేదు..పర్యావరణాన్ని అడవులను కాపాడుతున్నది వీళ్ళే" .... interesting !!

  ప్రత్యుత్తరంతొలగించు
 8. ప్రభుత్వ అధికారిగా పనిచేసి ఉండడంవల్ల నక్సలైట్లమీద వ్యతిరేఖతతో వాళ్ళతో పోల్చి ఉండవచ్చు.
  అంత మాత్రాన, జెపి ని మిగతా బూర్జువా నాయకులని ఒకే గాట కట్టడం నాకు సమంజసం అనిపించడంలేదు.

  ప్రత్యుత్తరంతొలగించు
 9. బోనగిరి గారు, ప్రభుత్వ అధికారి పాలక వర్గం తయారు చేసిన చట్టాలకి అనుగుణంగా పని చేస్తాడు. కానీ ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసిన తరువాత ఆ చట్టాలని నమ్మాలని రూల్ లేదు కదా. జెపి ఇప్పుడు కూడా పాలక వర్గాన్నే నమ్ముతున్నాడు.

  ప్రత్యుత్తరంతొలగించు

ఆలోచనాత్మకంగా..