17, జులై 2009, శుక్రవారం

కారంచేడు - దళిత ఉద్యమంనకు దిక్సూచి


కారంచేడులో జూలై పదిహేడు, పందొమ్మిది వందల ఎనభై ఐదు నాడు ప్రారంభమైన ఉద్యమం ఆంధ్ర ప్రదేశ్ సామాజిక చరిత్రలో మెయిలు రాయిగా నిలిచింది. తోలకిరివానకు ఏరువాక సాగి పంట మొలకేత్తల్సిన వేళ గ్రామ దళిత రైతు డొక్కలో బరిసె పోట్లతో నెత్తుటి ఏరులు పారించిన భూస్వాముల దాష్టీకానికి తగిన గుణపాఠ౦ నేర్పే౦దుకు దళిత చైతన్యం ముందుకు కదిలింది. ఎన్నో యుగాలుగా తమ కాలి కింద చెప్పుగా పడివున్న మనిషి చైతన్యంతో ముందుకు వచ్చి ప్రధాన జీవన స్రవంతిలో కలిసేందుకు వేసిన ముందడుగు ఫ్యూడల్ ప్రభువుల కళ్ళల్లో కారం చల్లినట్లయ్యింది. దాంతో ఏదో ఒక సాకుతో వారిని బలిగోనాలని వేచి చూసి తమ రక్త దాహాన్ని తీర్చుకొన్నారు. వారికి మద్దతుగా నాటి వారి కుల ప్రభుత్వం అండగా నిలవడంతో మరింత చెలరేగిపోయారు. నాడు హతులైన తేళ్ళ మోషే, తేళ్ళ ముత్తయ్య, తేళ్ళ యెహోషువా, దుడ్డు వందనం, దుడ్డు రమేష్, దుడ్డు అబ్రహాం మొదలైన వారు దళిత జాతికి స్పూర్తినిచ్చి అమరులైనారు. దళితుల ఆత్మా గౌరవ ఉద్యమం కారంచేడు నెత్తుటి నుంచే పుట్టింది. ఇది తరువాతి ఎన్నో అస్తిత్వ ఉద్యమాలకు స్ఫూర్తిగా నిలిచింది. భారత సామాజిక ఉద్యమాలలో కులం యొక్క ప్రాధాన్యతను చాటిచెప్పింది. మన న్యాయస్థానాల తాత్సార న్యాయాన్ని బయట పెట్టింది. దళితుల అణచివేతలో అన్ని వర్గాల వారిది ఒకే మార్గమని తేట తెల్లం చేసింది. నాటి ప్రజా యుద్ధ పంద తన తీర్పుతో బాధిత తల్లుల కడుపు కోతను కొంతైనా తీర్చగలిగింది. కానీ, నేటికీ ఎక్కడో ఒక చోట దళితులపై దాడులు నిత్యము జరుగుతూనే వున్నాయి. నిన్నను కర్నూలు జిల్లాలో రుద్రవరం మండలం, ఎల్లావత్తుల గ్రామ దళిత రైతులపై అటవి శాఖాధికారులు చేసిన దాష్టీకం శిక్షించ దగ్గది. వారికి విచారణ పేరుతొ తీసుకుపోయి మీసాలు పీకి బూతులు తిట్టి గ్లాసుల్లో మూత్రం పోసి తాగమన్నారు. ఇవి నేటి ఆధునిక సమాజంలో జరుగుతున్న ప్రభుత్వ గూండా చర్యలు కావా? ఇలా చెప్పుకుంటూ పొతే రోజు మన కళ్ళ ముందే ఎన్నో అన్యాయాలు జరుగుతున్నాయి. నేటికి కులహంకారుల దాష్టికం చలామణి కావడం మన సమాజ దౌర్భాగ్యం. వీటిని కారంచేడు, చుండూరు, వేంపెంట ఉద్యమాల స్ఫూర్తితో తీవ్రంగా ప్రతిఘటించాల్సిన అవసరం వుంది.

7 కామెంట్‌లు:

  1. పోరాటం సాగుతూనే ఉంది. వివక్ష రూపుమారుతూనే ఉంది.పోరాటం సాగుతూనే ఉంది.

    రిప్లయితొలగించండి
  2. సంసారులకే జీవితంలో శతృవులు ఉంటారు కానీ సన్నాసులకి శతృవులు ఉండరు. సన్నాసులని కులం పేరుతో కూడా ఎవరూ ఏమీ చెయ్యరు. ప్రధాన జీవన స్రవంతిలో ఉన్న వాడికే అవమానాలు, ఘర్షణలు వగైరా.

    రిప్లయితొలగించండి
  3. మానసికంగా పరిపక్వత చెందే వయసైన , కళాశాలల్లో చదివే రోజుల్లేనే కుల వివక్ష ప్రత్యేకంగా నేర్పిస్తుంటే ఇంకెక్కడ మన 'చదువుకున్న ' వాళ్ళు మారేది ? వాళ్ళు ఎంత దూరం పయనించినా , ఎంత ఎదిగినా అది ఏదొక రూపంలో బయట పడుతూనే ఉంటుంది . ఈ పోరాటాలు జరుగుతూనే ఉంటాయి. వీటిని మార్చటం బ్రహ్మ తరం కూడా కాదు.

    రిప్లయితొలగించండి
  4. మనిషిని మనిషి హింసించే ఆటవిక న్యాయాన్ని ఎక్కదైనా ప్రతిఘటించాలి అది మానవ ధర్మం .

    రిప్లయితొలగించండి
  5. mahEshkumaar gaaru vivaksha rUpu marutunnatlugaane mana pOraata rUpam kudaa maarchukoni poraadalsi vumdi.

    praveen gaaru sannaasulaku kudaa kulam edchimdi ee samaajamlO, vivakshanumdi bayatapadadaaniki matam maarinaa akkada kuda kamma kristian, kaapu kristiyan, maala kristiyan, maadiga kristiyan vamtoo vivaksha chooputunnaaru. alage muslim samaajamlOkudaa varna, varga vivaksha vumdi, sikkulalO kudaa, kaabatti avamaanaalaku, gharshanalaku vyatirekamgaa poraadaalsina avasaram vumdi.

    venkataramana gaaru chadive rojullo kaadu sir, manaku vuggupaalatonE nErpabadutomdi, kaabatti maarpu koraku pOraatam teevramgaa jaragalsina avasaram vumdi. paata taraaniki manataraaniki komta maarpu vachchimdi kadaa? marchatam brhmala taram kaadu, mana taramE alasipOni vennuchupani pratighatanato saadhimcukovaali.

    రిప్లయితొలగించండి
  6. kaneesam tragataniki neellu kaavalanna mundunde kulaanni etla naashanam chestamu ?mitrulu cheppinatluga andarilo chaitanyam theesukuraavalsina avasaram vundi.gajula

    రిప్లయితొలగించండి

ఆలోచనాత్మకంగా..