6, సెప్టెంబర్ 2009, ఆదివారం

ఉపాధ్యాయులు – సామాజిక బాధ్యత

భారత దేశ సామాజిక పరిణామాలలో ప్రతి మలుపులోను ఉపాధ్యాయ వర్గం తమ వంతు కృషిని శ్లాఘణీయంగా అమలు పరిచింది. మన ఊహా చిత్రాలుగా మిగిలిన చరిత్రనందు కూడా నాటి గురువుస్థానంలో ఉన్న వారి మార్గ నిర్దేశంలోనే నాటి చారిత్రక పరిణామాలు జరిగాయని తెలుస్తోంది. నిరంకుశ రాజరిక పరిపాలనలను అంతం చేసేందుకు సామాన్య జనంనుండి నాయకులను చాణక్యులవంటి వారు తయారు చేసారని చదువుకున్నాం. ఇది మన భారతీయ సమాజం గర్వించగ్గ గురు స్థానం.

ఆ తరువాత బ్రిటిష్ వారి కంపెనీ పరిపాలన నుండి విముక్తి కోసం జరిగిన స్వాతంత్ర్య పోరాటంలో కూడా అనేక మంది తమవంతు కృషి చేసారు. ఆ తరువాత జరిగిన అధికార మార్పిడి అనంతరం దేశీయ బడాబాబుల చేతులలోకి వచ్చిన అధికారం సామాన్య జనానికి మరింతగా అధ:పాతాళలంలోకి నెట్టివేసే క్రమంలో వారి పక్షాన నిలిచి సాగిన, కొనసాగుతున్న ఉద్యమాలకు మొదటిగా నాయకత్వం వహించినవారు ఉపాధ్యాయ వర్గంలోంచి వచ్చిన వారే. వామపక్ష ఉద్యమాలకు మన ఆంధ్ర దేశంలో నాయకత్వం వహించినవారు ఉదా.:ఆదిభట్ల కైలాసం, వెంపటాపు సత్యం మొదలు కొండపల్లి  సీతారామయ్య, ఆ తరువాత ప్రస్తుత మావోయిస్టు పార్టీ కార్య్దర్శి గా వున్న గణపతి వరకు ఉపాధ్యాయులే. ఇందుకు కారణం వారికి సామాజిక పరిస్తితుల పట్ల దగ్గరగా చూసే అవాకాశం కలిగివుండటం, ప్రజలతో సాన్నిహిత్యం, గ్రామాలలో ప్రజలకు కలిగే సందేహాలను తీర్చే ఏకైక వనరుగా వారు వుండటం మూలాన ప్రజలపట్ల అంకిత భావంగల ఉపాధ్యాయులు సామాజిక ఉద్యమాలను ముందుకు తేవడానికి కృషి చేసారు.

కానీ మారిన నేటి పరిస్థితులలో ఉపాద్యాయులlలోమెజారిటీ వర్గం తమ ఖాళీ సమయాన్ని చిట్టీ వ్యాపారాలు చేయడానికి, వడ్డీ వ్యాపారాలునడపడానికి, పైరవీలు చేసి ఉత్తమ అవార్డులు కొట్టేయడానికి్ ఉపయోగిస్తూ గ్రామాలlలో ఏదో ఒక రాజకీయ పార్టీ తొత్తులుగా తయారయి, కులానికో సంఘాన్ని పెట్టుకుంటూ తమ సామాజిక బాధ్యతను  విస్మరిస్తున్నారు.  ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తూ సొంత కాన్వెంటులు నడుపుతూ పేద విద్యార్ధులకు చదువును అందని ద్రాక్ష చేస్తున్నారు. ఇది అందరినీ ఒకే గాట కట్టి రాయడం కాదు. మెజారిటీ వర్గం పరిస్థితి.

దయచేసి ఉపాధ్యాయ మిత్రులు తమ సామాజిక బాధ్యతను గుర్తెరిగి, తమ జీతాలతో పాటు సామాన్య జనం వెతలపట్ల కూడా స్పందించి ముందుకు రావాలని వి్జ్ణప్తి చేస్తున్నాను.

3 వ్యాఖ్యలు:

 1. గురుర్భ్రహ్మా గురుర్విష్ణుః
  గురుర్దేవో మహేశ్వరః
  గురు స్సాక్షాత్ పరర్బ్రహ్మా
  తస్మైశ్రీ గురవేనమః
  ఇదీ మన సంస్కృతి.

  ప్రత్యుత్తరంతొలగించు
 2. గురువులు స్థానభ్రంశం చెందారనేదే నా ఆవేదన. గురువులు కీచకులుగా కూడా ఈ మద్యన తయారయ్యారు. మన సంస్కృతి అన్నది ఏనాడో మరిచిపోయారు సార్.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. బాగుంది వర్మ గారు. బాగా చెప్పేరు.. అది ఒక్కటే కాదు సరి ఐన అర్హత లేని వాళ్ళను చిన్నపిల్లలకు కాన్వెంట్ టీచర్స్ గా పెట్టటం కూడా మానిపించాలి . మన వ్యక్తిత్వ వికాసం లో తల్లి తండ్రులతో పాటు టీచర్స్ పాత్ర చాలా వుంటుంది. ఇప్పటికి పిల్లలలో అదే పరిస్తితి చూస్తున్నా, భాద్యత సామాజిక స్పృహ వున్న టీచర్ సమాజాన్ని మారుస్తారు అనటం లో ఏమి సందేహం లేదు...

  ప్రత్యుత్తరంతొలగించు

ఆలోచనాత్మకంగా..