4, సెప్టెంబర్ 2009, శుక్రవారం

మరో మారు షాజహన్ మరణించాడు


మొన్నటి నుండీ ఆంధ్ర ప్రదేశ్ అంతటా అలముకున్న కారు మబ్బులు నిన్నటి ఉదయానికి వీడిపోయాయి. కాని అవి తెలుగు ప్రజల మనసుపై తీవ్రంగా కమ్ముకున్నాయి. తమతమ రాజకీయ భావాలు ఏవైనా తాము నిత్యమూ ఏదో ఒక రూపంలో చూస్తున్న, వింటున్న మనిషి అర్ధాంతరంగా గగనతలం నుండి అంతర్ధానం కావడాన్ని జీర్ణించుకోలేకపోయారు. నిత్యమూ చిరునవ్వులు చిందిస్తూ తను అనుకున్నది నిర్ధ్వందంగా చేసుకుంటూ ముందుకు సాగిపోయే మొండిమనిషి మరి లేడన్న వాస్తవాన్ని అంత తొందరగా సున్నిత మనస్కులైన తెలుగు ప్రజానీకం అంగీకరించలేకపోయారు. ఇది మరో మిస్టరీగా మిగిలిపోయింది అందరి మదిలో. నమ్మినదానిని ఆచరించడం, నమ్ముకున్న వాళ్ళను ఎంత కష్టమొచ్చినా, అది తనకు ఎంత నష్టదాయకమైనా వాళ్ళకోసం ఎంతటి త్యాగమైనా చేసే మనిషి మరి కనరాడన్న సత్యం ఇంకా అసత్యంగానే నమ్ముతున్న వాళ్ళు అధిక శాతం ఉన్నరనడం కఠోర వాస్తవం. ఇంతమంది హృదయాలలో బందీగా వున్న వాడికి ఈ అకాల మృత్యువు నిజమైనదేనా అని నా సందేహం. నేను నా చుట్టూ వున్న సామాన్య జనం వ్యక్త పరుస్తున్న అనుమానాలను ఇక్కడ మీతో పంచుకుంటున్నా.
అ. తండ్రి మరణిస్తే తనకు కొన్ని తరాలకు సరిపోయే సిరి సంపదలు ఇచ్చిన వాడి ఆచూకీ
కోసం వేలాదిగా తరలి వస్తే తాను ఎందుకు రాలేదు?
ఆ. మీడియా ముందుకు నిన్నటి మధ్యాహ్నం వరకు కుటుంబ సభ్యులెవరూ కనబడరేం?
ఇ. శవపేటిక వద్ద స్టైలిష్ గా నిలబడి నవ్వుతూ అందరికీ చేతులుకలుపుతూ కొద్దిసేపు ఫోజులిచ్చి వెళ్ళిపోవడం తన ధీరోదాత్తతను వ్యక్తం చేయడమా?
ఉ. పిచ్చి జనం గుండె ఆగి, ఉరివేసుకొని, గొంతుకోసుకుని మరణించారు. మరి తన ఉప్పుతిన్న వాడెవడూ పోలేదే?
ఊ. అంతర్ధానమైన మరుక్షణమే ఢిల్లీలో తన అనుచరులను పంపి మంతనాలు సాగించిన వారసుడి నైజం
బయటపడలేదా?
ఋ. పార్ధీవ దేహం ఇంకా ఇంటికి రాకముందే అరువుకుక్కల మీడియా వాళ్ళ స్క్రోలింగులలో తమకు తాను తప్ప దిక్కులేదని తన అనుచర గణంతో ప్రకటనలు ఇప్పించుకోవడం చూస్తుంటె నా లాంటి అమాయక అనుమానపు జనం గుడ్లప్పగిస్తూ చూడడం తప్ప ఏమీ చేయలేని మాటాడలేని నిస్సహాయతను తిట్టుకుంటూ....
ౠ. సాయంత్రమయ్యేసరికి నూరుకుపైగా సంతకాలు రెడీ, దొంగఏడుపుగాళ్ళు ఒకపక్క ఓ మాకలల నేత పోయాడని అంటూనే, చివర్లో యువనేత తప్ప మరో దారిలేదని నిర్లజ్జగా ప్రకటనలివ్వడం జనం వెర్రిపప్పలనేగా?
ఎ. వారసత్వ రాజకీయాలను, అధికారాన్ని ఆమోదించడమేనా మన ప్రజాస్వామ్యం?

పైవన్నీ ఒక నిస్సహాయ తెలుగు వాడిగా నా అనుమానాలు మాత్రమేనయ్యా...
మనసెందుకో ఈ ఔరంగజేబును అంగీకరించలేకపోతోంది....

11 కామెంట్‌లు:

  1. సుదీర్ఘ కాలం రాజకీయ అనుభవం ఉన్న రోశయ్యని వదిలేసి జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిపూజ చెయ్యడం హాస్యాస్పదంగా ఉంది. రాష్ట్ర రాజకీయాలలో ఇలాంటి తెలివి తక్కువ పనులు తెలుగు దేశం వాళ్ళు మాత్రమే చేస్తారనుకున్నాను.

    రిప్లయితొలగించండి
  2. ఒక ముఖ్యమంత్రి ఇలా దారుణంగా చనిపోవడం నేను జీర్ణించుకోలేకపోయాను. ఒక నేతగా కాకున్నా, ఒక సాటి మనిషి చనిపోయాడని బాధపడతం మాని, అధికారాన్ని, పెత్తనాన్ని చలాయించడానికి ఇదే సరైన సమయముగా భావించే వారిని, ఏమిచేయాలో అర్థం కావడంలేదు. TVల ముందర కన్నీరు మున్నీరవుతున్న నాయకులు నిజంగానే ఈ మరణానికి సంతాపం వ్యక్తం చేస్తున్నవారైతే, ఆ రహస్య మంతనాలు ఎందుకో? వారికి ఒకరి అవస్థ కనపడదు, కేవలం అధికారం మాత్రమే కనిపిస్తుంది.

    రిప్లయితొలగించండి
  3. ఇంత క్రూరంగా మాట్లాడటం నాకు నచ్చలేదు. నేడు మనం ప్రజాస్వామ్యమని పేరు పెట్టుకున్నప్పటికీ ఫ్యూడల్ విధానాలనే ఆచరిస్తున్నాం. కనుక రాజు మరణం తర్వాత సింహాసనం అధిష్టించాల్సింది ఎవరో మీవంటి మేధావులకు ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు. మీరు చూపిన కారణాలు సబబుగా లేవు. దయచేసి తొందరపడకండి.

    రిప్లయితొలగించండి
  4. http://ekalingam.blogspot.com ఇక్కడ ఎవరో వ్రాసిన కామెంట్ ను కొంచం మార్చి, పైన ప్యూడల్ వ్యవస్థ అంటూ కామెంట్ వ్రాసిన ఆయనది చదువుకొంటే, ఇలా ఉంటుంది.

    సామంత రాజులందరికంటే కప్పం ఎక్కువ ఠంచనుగా కట్టి, తన మతానికి అందునా తన తెగకు చెందిన సామంతు రాజు, అందునా తన గురువర్యులయిన వాటికన్ ఆశ్రమం తో కూడా సంభందభాందవ్యాలు ఉన్నవాడు, తన హయాంలో మిగతా సామంత రాజులకంటే తన మతం లోకి జనాలను మార్చటం లో ముందు ఉన్నాడు చనిపొతే మహారాణి బంగారమ్మ గారు, ఎవరికి పట్టం కట్టాలి, ఆ సామంత రాజు కుమారునకే కాదా (అతను ఎటువంటివాడు అనేది కూడా చూడకుండా).

    ఇప్పుడు చెప్పండి జగన్ కే పట్టం కట్టమని పైన కామెంట్ వేసిన వకుమార్ లాంటి వారు, ఇంకొంతమంది పౌరులు యువరాజా జగన్ కు పట్టం కట్టకపోతే మానవ బాంబులు అవుతాం అని తమ ప్రాణాలు తీసుకోవటాని రెడీ అవ్వటం లో తప్పు ఉంది అంటారా?

    ఎందుకయినా మంచిది, యువరాజా జగన్ జిందాబాద్, యువరాజా జగన్ జిందాబాద్, చనిపోయిన అపర ఏసయ్య శామ్యుల్ రెడ్డి గారు అమర్ రహే. ఆత్మ త్యాగం చేసుకొన్న రాజా వారికి (చెప్పి మరీ) సెయెంట్ హూడ్ ఇవ్వకపోతే జగన్ యువరాజా వారు వాటికన్ మీద యుద్దం ప్రకటించాలి. :)

    రిప్లయితొలగించండి
  5. పొలిటికల్ రియాలిటీలో ఎమోషన్ కూడా ఒక యాక్షనే!

    రిప్లయితొలగించండి
  6. నా ఆలోచనలతో పంచుకున్న మీ అందరికీ ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  7. జగన్ ను సీఎం ని చెయ్యకపోతే , ప్రజల ఆస్తులను ( బస్సులను) తగల పెట్టటం ఎంత దారుణం. ఈ కింద ఫోటో లో ఒక్కసారి మృతదేహాన్ని చూడండి. ఎంత దయనీయంగా ఉందో. మనకే ఇంత బాధగా ఉంటే, జగన్ కు ఎంత భాధ ఉండాలి? కాని తను ఏమాత్రం బాధ పడినట్టు కనపడలేదు. మంచి టాపిక్ ఎంచుకున్నారు సర్, దీని మీద నేను ఒక బ్లాగ్ రాద్దామనుకున్నాను. జగన్ ను పీఎం (ప్రధాన మంత్రి ) ని చేయాలంటూ అభిమానులు, వ్యాపారులు, కాంట్రాటర్లు నిరసనలు, ధర్నాలు, గందరగోళాలు చేస్తే ఎలా ఉంటుందో అని వ్యంగం గా రాద్దామనుకున్నాను.
    నేను మీ ఆలోచనలతో ఏకీభవిస్తున్నాను.
    http://picasaweb.google.com/anvvapparao/Gandhi#5389461988645608658

    రిప్లయితొలగించండి
  8. సోనియా గాంధీ జగన్ కి ముఖ్యమంత్రి పదవి ఇచ్చేంత తెలివి తక్కువది కాదు. అందుకే కొన్ని చోట్ల జగన్ అభిమానులు సోనియా గాంధీ బొమ్మలని చించివేశారు.

    రిప్లయితొలగించండి
  9. శాస్త్రి గారు అప్పటికప్పుడు వచ్చిన ఆలోచనలతో రాసిన పోస్ట్. మీరు నాతో ఏకీభవించినందుకు ధన్యవాదాలు. పి.ఎం.మన్మోహం సింగ్ గారు ప్రతిపాదించిన వ్యక్తి రోశయ్యగారు. ఆర్థిక మంత్రిగా వుండి తాను పి.ఎం.అయి ఆర్థిక రంగాన్ని ఒడుదుడుకులనుండి కాపాడుతున్నట్లుగా రాష్ట్రంలో కూడా 17 సం.లు ఆర్థిక మంత్రిగా పనిచేసిన రోశయ్యగారు అయితే బాగుంటుందని ఆయన ప్రతిపాదించినట్లు మొన్న ఆదివారం వార్తలో కూడా రాసారు. అభిషేక్ సింఘ్వీ, వార్త సంఘ్వీ లాంటి వైశ్య రాజకీయనాయకులు కూడా గట్టిగా మద్ధతు ఇవ్వడంతో పాటు ఇన్నాళ్ళూ అవకాశం కోసం కాచుక్కూచున్న వై.ఎస్.వ్యతిరేక వర్గం కూడా చేయాల్సినంత చేయడంతో జగం కలలు కరిగిపోయాయి. వస్తే కాంగ్రెస్ లో చీలిక వచ్చి జగం వేరే పార్టీ పెట్టుకొని ప్రయత్నించడమో, లేకపోతే తెలివిగా వ్యాపారాలు చేసుకోవడమో చేయాల్సిందే. ఆయన రెండోదానివైపే అప్పుడే మొగ్గు చూపినట్లు వుంది. లేకపోతే వాటిపై కూడా దాడులు జరిగి రామోజీరావులా కోర్టుల చుట్టు తిరగాల్సిందే.

    రిప్లయితొలగించండి
  10. జగన్ కి ముఖ్యమంత్రి పదవి ఇవ్వకపోతే కాంగ్రెస్ కే లాభం. ఇప్పటి వరకు కాంగ్రెస్ కి రెడ్డి కులస్తుల డామినేటెడ్ పార్టీగా పేరు ఉంది. ఇప్పుడు ఓ సాహుకారుకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వడం వల్ల కాంగ్రెస్ కి ఉన్న కులం కార్డ్ కొంత పక్కన పడుతుంది. జగన్ కి రాజకీయ అనుభవం లేదు కనుక జగన్ రాజకీయ అనుభవం కోసం కొన్నేళ్ళు పార్టీలో ఒక జూనియర్ నాయకుడుగా ఉండగలడు. సీనియర్ అయిన తరువాత ముఖ్యమంత్రి పదవి అడగగలడు. ఇప్పుడే ముఖ్యమంత్రి పదవి అడిగితే సోనియా గాంధీ ఇస్తుందని నేను అనుకోను.

    రిప్లయితొలగించండి
  11. అది కాంగ్రెసు దౌర్భాగ్యం. వాళ్ళ అధినాయకుల చలవ వుంటే ఎవడైనా ఏమైనా కావచ్చు. ఇందులో ప్రజల భాగస్వామ్యానికి తావులేకపోవడం మన ప్రజాస్వామ్య విషాదం.

    రిప్లయితొలగించండి

ఆలోచనాత్మకంగా..