16, సెప్టెంబర్ 2009, బుధవారం

శ్రామిక వర్గ రచయిత లక్షణాలు – మాక్సిం గోర్కీ

పా్క్రోవ్స్క్ పట్టణంలోని ఒక సాంకేతిక పాఠశాల సాహిత్య బృంద సభ్యులకి రాసిన ఉత్తరం లోని భాగం:

“ ఏ లక్షణాలని బట్టి నిజమైన శ్రామికవర్గ రచయితని గుర్తించవచ్చు?” అని మీరు అడుగుతారు. అలాంటి లక్షణాలు చాలా వున్నాయని నేను అనుకోను. ఆ లక్షణాలు యివి:

మానవుణ్ణి ఆంతరికంగా, బాహిరంగా ఉభయత్రా పీడించే ప్రతిదాన్నీ, మనవుడి సామర్థ్యాలు స్వేచ్చగా పెరిగి అభివృధ్ధి చెందకుండా ఆటంకపరిచే ప్రతిదాన్ని క్రియాత్మకంగా రచయిత ద్వేషించడం;

సోమరిపోతులపట్లా, పరాన్నభుక్కులపట్లా, నీచుల పట్లా, ఇచ్చకాలమారుల పట్లా, అనేక రూపాల్లో వుండే ప్రతిదుష్టుడి పట్లా మొత్తంగా నిర్ధాక్షిణ్యమైన ద్వేషం వుండటం.

సృజనాత్మక శక్తికి ఆధారభూతుడుగా, సర్వకాల వస్తువులనీ ప్రపంచంలోని సకల అద్భుతాలనీ సృష్టించేవాడుగా, ప్రకృతి విపత్తులకి వ్యతిరేకంగ పోరాడేవాడుగా, తన భౌతిక శక్తులు నిరర్థకంగaావ్యయం కాకుండా వుండేందుకుగాను-వర్గ దేశపు పరిస్థితుల్లో ఈ వ్యయం విధిగా తెలివితక్కువ, పనికి మాలిన న్యాయంగaావుండేది- తన శ్రమవల్లా, శాస్త్ర సాంకేతిక జ్ఞానంవల్లా " విశ్వామిత్ర సృష్టి” చేసిన వాడుగా మానవుడిపట్ల రచయితకి గౌరవం వుండటం.

అహేతుక దోపిడీని, ఒక మనిషిమీద మరొక మనిషి పెత్తనాన్నీ పూర్తిగా తొలగించి వేసేటటువంతి నూతన జీవిత రూపాల సృష్టి ధ్యేయంగా కల స్మష్టి శ్రమని రచయిత కవితాత్మకం చేయడం.

శారీరక సౌఖ్యప్రదాయినిగా కాకుండaాజీవిత కష్టభూయిష్ట పథంమీద విశ్వాస పాత్రమైన సహచరిగా, సహాయకురాలిగా్ స్త్రీల పట్ల రచయిత దృక్పథం వుండటం.

పిల్లల పట్ల బాధ్యతaాదృష్టి వుండటం, మనaంచేసే ప్రతిపనికి మనం వాళ్ళకే బాధ్యులం అనే వైఖరి వుండటం.

జీవితం పట్ల పాఠకుల క్రియాశీల దృష్టిని పెంచి, శ్రమ సంతోషాన్నీ దాని మహత్తర ప్రాముఖ్యాన్ని జీవితపు మహత్తర భావాన్నీ అర్థం అవకుండా అడ్డగించే ఆంతరికమైన, బాహిరమైన దాన్నంతటినీ జయించేటువంటి తమ సామర్థ్యం పట్లaాతమ శక్తి పట్లా, వాళ్ళకి విస్వాసాన్ని కలిగించేందుకు రచయిత ప్రయత్నించడం.

యిది సూక్ష్మంగా శ్రామిక ప్రపంచానికి అవసరమైనర్ అచయితని గురించి నా అభిప్రాయం.మీరు నిజాయితీపరులైన వాళ్ళు కావాలంటే విప్లవకారులు అవాలి.

" అమ్మ " నవల ఫ్రెంచి అనువాదానికి ముందుమాటలో:

శ్రామిక వర్గం ఎంతో రక్తాన్ని చిందిస్తోంది. కాని దాని పాక్షికమైన ఓటములూ, విజయాలూ దాని బ్రహ్మాండమైన పెరుగుదలని యింకాస్పష్టంగా సూచిస్తున్నాయి;దాన్ని ప్రపంచ పోరాటం కోసమూ, సతృవుమీద యీ మహత్తర, విషాదకర దినాల్లో అధికారaంకోసం, నియంతృత్వం కోసం శ్రామికవర్గపు పోరాటంలో నిజాయితీ గల విప్లవ రచయితల కృషి విప్లవాత్మక వర్గ చైతన్యపు అభివృద్ధి మార్గం కోసమే సంపూర్తిగaాఅంకితం కావాలి; ప్రపంచ పెట్టుబడిదారులకి వ్యతిరేకంgగాప్రపంచ శ్రామికులని వ్యవస్థీకరించి, సంఘటితపరచడానికే అంకితం కావాలి; విప్లవకర శ్రామికవర్గపు నిర్మూలనే అప్రకటిత లక్షYaMga aగల యుధ్ధానికి వ్యతిరేకంగా పోరాడే్దాని కోసమే అంకితం కావాలి; బూర్జువావర్గపు నైచ్యాన్నీ, నీతిబాహ్యతని, నేర స్వభావాన్నీ వెల్లడి చేసే, సిర్దాక్షిణ్యంగా బట్టబయలు చేసేదాని కోసమే అంకితం కావాలి. బూర్జువా వర్గం శ్రామికుల్ని క్రూరంgగానాశనం చేస్తోంది – బూర్జువాలపట్ల శ్రామికుల ఆలోచనకీ, దిశకీ గలక్ రూరత్వం యింకా యెన్నో రెట్లు పటుతరంగా వుండాలి.

ప్రతి రచయిత  “ తన హృదయ సర్వశక్తులతోటి మనుషులందరికీ వర్తించే మహత్తర సత్యాన్ని బోధించే ప్రజలు దాన్ని దర్శించేట్టు “ చేసే “ నిజాయితే గల పోరాట వీరుడు, సత్యం కోసం ఆరాటపడేవాడు” కావాలి.

3 వ్యాఖ్యలు:

  1. నా దగ్గర స్టాలిన్, మావో, హోచిమిన్ లు వ్రాసిన రచనలు కూడా ఉన్నాయి. అవి చదివినా శ్రామిక వర్గ విప్లవకారులు ఎలా ఉండాలో తెలుస్తుంది.

    ప్రత్యుత్తరంతొలగించు
  2. ప్రవీణ్ గారు నా వద్ద వున్నాయి. కానీ గోర్కీ రచయితగా తన విశ్లెషణను తన సాహిత్య వ్యాసాలలో విపులంగా ఇచ్చారు. మాటొకటి, పనొకటి చేసే వారికి మరల గుర్తుచేద్దామని..

    నాయిష్టం గారికి మీ సహృదయ ఆలంబనకు నా ధన్యవాదములు.

    ప్రత్యుత్తరంతొలగించు

ఆలోచనాత్మకంగా..