13, సెప్టెంబర్ 2009, ఆదివారం

ముసుగులు తొలగించిన మరణం

 

విరసం సీనియర్ సభ్యులు ఎn.వేనుగోపాల్ ను విరసం నుండి సస్పెండ్ చేస్తున్నట్లుగా విరసం కార్యదర్శి కా.పాణి పేపర్లో ప్రకటన ఇచ్చి సంస్థ పై వచ్చే విమర్శలను ఆపే ప్రయత్నం చేసారు. ఈ నెల ఆంధ్రజ్యోతిలో వేణు వై.ఎస్..చివరి పుట్టిన రోజు పేరుతో రాసిన వ్యాసంలో తనకు వై.ఎస్.తో వున్న అనుబంధాన్ని బహిరంగపర్చారు. దానిపై రోజూ వస్తున్న విమర్శనాస్త్రాలనుండి సంస్థను తద్వార తమ తప్పిదాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నమే ఇది. సంస్థలో క్రియాశీలక సభ్యుడుగా వున్న వ్యక్తి, అదీ సిటీ యూనిట్లో వున్న వారి గురించి ఇంతవరకు తెలియని వ్యవహారంలా ఈరోజే దర్యాప్తు నివేదిక అందినట్లుగా చర్య ప్రకటించడం నా బోటి అల్ప ప్రాణికి మింగుడుపడని విషయం. ఎందుచేతనంటే వీరిద్దరూ చాలా క్లోజ్ గానే అన్ని కార్యక్రమాలు రుపొందిస్తారు. లోకమంతా చాన్నాళ్ళుగా వేణు కార్యకలాపాల గురించి తెలిసినా సరే తనకు తాను చెప్పినంతవరకు చర్యకాని విమర్శ కాని  చేపట్టకపోవడం నాయకత్వ లోపమే. తమ వర్గాన్ని కాపాడే ప్రయత్నమే. గొప్పవాళ్ళ తప్పులను కప్పి వుంచడం విప్లవ కార్యాచరణకు  విఘాతం కాదా? తమ రచనలు, ఉపన్యాసాలతో ఎంతోమందిని ప్రభావితం చేసినవారు తామ మాత్రం రక్షణ కవచాల వెనక సౌఖ్యాన్ని అనుభవిస్తూ ఎదుటి వారి త్యాగాలను కీర్తీంచి విప్లవాన్ని కూడా సరకుగా మార్చిన తీరు ఇంత చిన్నగా తేలిపోవడం జీర్ణించుకోలేం.

విరసం అధికార పత్రిక అరుణతారకు  ఆర్ధిక స్థోమత లేక నెల నెలా రాని స్థితి గత కొన్నేళ్ళుగా వుండగా పాలక వర్గ ప్రకటనల ఆలంబనగా సొంత పత్రిక వీక్షణం ప్రతినెలా మార్కెట్లోకి ఐదో తారీఖునకే వచ్చే పెట్టుబడి ఎక్కడిదని ఎవరూ ప్రశ్నించలే. తన సహచరి పై చదువుల నిమిత్తం అమెరికా వెళ్ళగా తానూ  మూడు నెలలు విహరించిన నాడు కూడా తన పట్ల సంస్థ మునుపటి గౌరవాన్నే చూపింది. ఇది సమంజసమా? మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచనా విధానం సూత్రంగా పనిచేసే సంష్తలో మేధో వర్గం గా వచ్చిన గుర్తింపును ఇలా మనం దుర్వినియోగం చేయవచ్చా? మనం అలవర్చుకోవలసింది కార్మిక వర్గ దృక్పథం అన్నది ఎదుటివారికి  చెప్పే నీతి  మాత్రమేనా? మన కార్యాచరణ వలన సంస్థ పై వచ్చే అపోహలను తొలగించగళమా? సంస్థ తన సభ్యుల ఆచరణ ద్వారానే గొప్పదవుతుంది. సంస్థ వేరు వ్యక్తులు వేరు కాదు. జర్నలిస్టులలో ఎంతోమంది అక్షరానికి బలయిన వారే మన ఆదర్శం కావాలి. ఒక ముంతజర్ అల్ జైదీ, దిస నాయగం, లసంత విక్రమతుంగే, మన అమరుడు రసూల్ …

87 వ్యాఖ్యలు:

 1. తన సహచరి పై చదువుల నిమిత్తం అమెరికా వెళ్ళగా తానూ మూడు నెలలు విహరించిన నాడు కూడా తన పట్ల సంస్థ మునుపటి గౌరవాన్నే చూపింది. ఇది సమంజసమా? >>ఈవిడ ఈటీవీ లో ఏదో పోగ్రాం కి ఏంకర్ గా చేసేది కదా, ఇప్పుడు విదేశాలలో చదువుతుందా?

  ప్రత్యుత్తరంతొలగించు
 2. సంస్థలో వున్న సభ్యుల సంపాదన, వృత్తులపై కూడా పరిమితులు వుండేవి. కానీ మారుతున్న కాలానికనుగుణంగా మారాలని కొన్నాళ్ళక్రితం చర్చ జరిగినా అది అసంపూర్ణంగానే మిగిలింది. మావో ఆలోచనా విధానాన్ని అనుసరించే సంస్థగా శ్రామిక వర్గాన్ని ప్రభావితం చేయాల్సిన సంస్థ సభ్యులు లక్షాధికారులు, కోటీస్వరులను అంగీకరిస్తుందా? సానుభూతిపరులుగా సాయపడేవారిగా వుండోచ్చుకాని. వనజగారు ప్రస్తుతం సాక్షి టీ.వీలో చేస్తున్నారు. విదేశాలనుండి జూలైలో తిరిగివచ్చారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. వర్మ మీరు చెప్పింది నిజం ! అందుకనే సామాన్య ప్రజలునుంచి దూరమవుతున్నారు. ఒకప్పుడు వీరి జీవితాల గురించి జనాలకు అంత తెలిసేది కాదు వారు ఏమి చెబితే అదే నమ్మేవారు ఇప్పుడు వీరి జీవనశైలి తెరిచిన పుస్తకం. నామటుకు నాకు మాత్రం వీళ్ళ హిపోక్రసి చూస్తే చీదరనిపిస్తుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 4. India is not a country of Revolution my friends. విప్లవాలు ఎప్పుడో ఉట్టిమీదకెక్కాయి. ఉన్నవల్లా కొన్ని ఆదర్శాలు. మరికొన్ని నమ్మకాలు.వాటికన్నా కూడా జీవితం మరింత విలువైనది.

  వేణుగారి గురించి ఇన్ని చర్చలు అనవసరం అనిపిస్తోంది. ముఖ్యంగా ఈ విషయంలో.

  ప్రత్యుత్తరంతొలగించు
 5. తప్పుగా ఆలోచిస్తున్నారు మహేష్ గారు. విప్లవం చాపకింద నీరులా భారత దేశమంతా అల్లుకుంటోంది. లేకపోతే ఇన్ని కోట్ల రూపాయలు కోబ్రాలకు ఖర్చుపెట్టడు మన పాగా ప్రధాని. ఆదర్శం ఆచరణ ద్వారానే నిలదొక్కుకుంటుంది. జీవితానికి ఆదర్శం లేకపోతే అది జీవంతొ వుంటుందా? మన కడుపులో చల్ల కదలనంత మాత్రాన మిగిలిన ఎనభై శాతం ఎలా గడుపుతున్నారు. ప్రస్తుత ఆర్ధిక సంక్షోభాల సమయం విప్లవాలకు అనువైన కాలమే. 1930 ఆర్ధిక మాంధ్యం తరువాతే చైనా విప్లవం సక్సెస్ అయ్యింది. హంగ్రీ థర్టీస్ రెండో ప్రపంచ యుధ్ధానికి దారితీసాయి. ఇది చారిత్రక వాస్తవం. మొదటి ప్రపంచ యుధ్ధం తరువాత రష్యాలో విప్లవం సక్సెస్ అయ్యింది. నేడున్నంత అంతర్గత సంక్షోభం మునుపెన్నడూ విస్వ వ్యాపితంగా లేదు. పైకి అంతా గంభీరంగా వున్నారు. ప్రజలను ఆ వైపుగా మళ్ళించే చోదక శక్తి కా్వాలి.

  వేణు గురించి చర్చ అనవసరం కాదు. మాట్లాడాల్సిన సమయం ఇదే.

  ప్రత్యుత్తరంతొలగించు
 6. శ్రావ్య గారు బాగా చెప్పారు. హిపోక్రట్స్ ను మనం ఎండగట్టాల్సిన అవసరం వుంది. వీళ్ళ వలన నిజాయితీగా త్యాగం చేసేవాళ్ళను కూడా జనం నమ్మలేని స్తితికి నెట్టేస్తారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 7. మహేష్ గారు వేణు గారికి ఎందుకు exemption ఇవ్వాలో అర్ధం కాలేదు . పొద్దున్న లేస్తే బూర్జువా దేశం అని అమెరికా ఆడిపోసుకొనే వాళ్లకు అదే కావలి. చంద్రబాబు నాయుడు అదేంటి ప్రపంచ బ్యాంకు జీతగాడు వీళ్ళ దృష్టిలో, రాజశేఖర్ రెడ్డి factionist మరి అందరి ముందు మళ్ళి వెనక నుంచి అదే నాయకుల అండ కావాలి. పగలంతా పేపర్లలో , టీవీ లలో పోలీసు లను వీళ్ళు తిట్టే తిట్లు చూసే జనాలు సాయంత్రమైతే అదే డిపార్టుమెంటు కు చేందిన ఉన్నతాధికారులతొ మీటింగులు ఎక్కడుంది నిజాయితి నాకు చెప్పండి. పొద్దున్న లేస్తే అన్యాయాల గురించి మాట్లాడే వీళ్ళు తమలో ఒకడు మావోయిస్ట్ల పేరు చెప్పి దొరికన స్తలాలన్నిబోజనం చేసినప్పుడు ఏమి చేసారు ? బయట ప్రపంచం లో అంట బందుప్రీతి అని మొత్తుకుంటారు వాళ్ళేమి చేస్తున్నారు.
  అంటే ఇవన్ని వేణు గారే చేసారు అని నేను అనటం లేదు , వీళ్ళ హిపోక్రాసి కి ఊదహరణలు చెబుతున్నాను. అద్దాల మేడలో ఉందాం అంకునే వాళ్ళు ఎదుటివాళ్ళ మీద రాళ్ళు వేయకూడదు.

  నిజం గానే వర్మ గారు చెప్పినట్లు నిజాయితి త్యాగాలు వీళ్ళలాంటి వాళ్ళ మరుగున పడుతున్నై!

  ప్రత్యుత్తరంతొలగించు
 8. వర్మగారూ, నాకు ఒకటి అర్ధం కాలేదు, ఇందులో ఎవరు హిపొక్రాట్ అంటారు? వేణునా? విరసమా?
  విరసం సభ్యులైతే అమెరికా వెళ్ళగూడదా? రాజశేఖర్రెడ్డితో సన్నిహిత సంబంధం ఉండకూడదా?
  అసలు ఈ నాటి ప్రపంచంలో విరసం లాంటి సంస్థల రిలవెన్సు ఏమిటి?
  నాకు నిజంగా తెలియకనే అడుగుతున్నాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 9. లక్షలూ, కోట్లూ సంపాదించిన వాళ్ళెవరూ కష్టపడి సంపాదించినవాళ్ళు కాదు. రిలయన్స్ అంబానీతో సహా ధనవంతులందరూ శ్రామికుల కష్టాల మీద కోటలు కట్టే వాళ్ళే. హైదరాబాద్ విషయానికి వద్దాం. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలని నిర్లక్ష్యం చేసి హైదరాబాద్ అభివృద్ధికి ఎక్కువ ఖర్చు పెట్టడం వల్లే హైదరాబాద్ ఇంత అభివృద్ధి చెందింది, హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్స్ వ్యాపారాలు కూడా పెరిగి కొంత మంది ఆ వ్యాపారాల వల్ల కోటీశ్వరులు అయ్యారు. ఒక విప్లవ సంస్థలో పని చేసే వాళ్ళు కూడా కోటీశ్వరులు అవ్వడం, అది కూడా రియల్ ఎస్టేట్స్ లాంటి పూర్తి నిరుత్పాదక వ్యాపారాలతో! ఇది హాస్యాస్పదం కాకపోతే మరేమిటి? రాష్ట్రంలో ఎంత మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా హైదరాబాద్ రియల్ ఎస్టేట్స్ మార్కెట్ విలువ రూపాయి కూడా తగ్గదు. ప్రపంచ ఆర్థిక సంక్షోభం వచ్చి సాఫ్ట్ వేర్ ఇంజినీర్ల ఉద్యోగాలు పోవడం, కొత్త సాఫ్ట్ వేర్ కంపెనీలు రాకపోవడం లాంటివి జరిగితే హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్స్ ధరలు తగ్గుతాయి.

  ప్రత్యుత్తరంతొలగించు
 10. కొత్తపాళీగారు విరసం సంస్థ ఏర్పడిన సందర్భం ఒక ప్రత్యేకమైనది. శ్రీకాకుళ పోరాట వారసత్వాన్ని కొనసాగించడానికి సాహిత్య సాంస్కృతిక రూపంలో జనాన్ని చైతన్య పరిచే మహోన్నత ఆశయంతో అప్పటివరకూ ఉన్న అరసం ఇందిరమ్మ భజనలో కూరుకుపోయి, మదరాసు సినిమా వ్యాపకంలో పడిపోయిన తరువాత ఏర్పడింది. తనకంటూ ఒక ప్రణాళికను రూపొందించుకొని నేటికీ కొనసాగుతోంది. నేడు మనం అనుకుంటున్న అభివృద్ది రూపాలు ఇథియోపియా వంటి దేశాలలో ముందుగా అమలుకాబడి వాటిని ఈనాటి స్థితికి నెట్టిన అగ్ర రాజ్యల వ్యాపార ధోరణి మన కనులముందే వుంది. వ్యవసాయక దేశంగా వున్న మన ఆర్ధిక రంగంపై నేడు అన్ని వైపుల నుండి జరుగుతున్న దాడులును చూస్తున్నాం కదా? మరి ఈ ఎనభై కోట్ల మంది జనం ఏమవుతారు. మన అభివృద్ధి ఎవరి మీద కేంద్రీకృతం అవుతోందో మీలాంటి పెద్దవారికి తెలియదా? ఇది సంక్షోభా్నికి చేరువ చేయదా? నిజానికి మనం చూస్తున్న ఈ ప్రతిపక్ష పార్టీలన్నీ అతుకుల బొంతలోని చిరుగులే కదా? ప్రజల మధ్యన వైరుధ్యాలను సృష్టించి తమ అధికార దాహాన్ని తీర్చుకొనేవే కదా? మరి నిజమైన ప్రతిపక్షం ప్రజల నుండి రావాలని ఆశిద్దాం.

  ప్రత్యుత్తరంతొలగించు
 11. ప్రవీణ్ గారు పై సమాధానంలో కొంత రాసాను. ఏ దేశమైనా తన సొంత ఆర్ధిక స్వావలంబనకు తన వనరులతో అభివృద్ది నమూనాను రూపొందించుకొన్ననాడే నిజమైన అభివృద్ధికి చేరువవుతుంది. మన పాలక వర్గాలు నేలవిడిచి సాము చేస్తు, అమెరికవాడి వ్యాపార సూత్రాలకనుగుణంగా నడుచుకుంటున్నాయి. ప్రస్తుత పాలక వర్గం మునుపు ప్రపంచబ్యాంకులో పనిచేసిన జీతగాళ్ళే. వారి ఆలోచనలరూపాన్నే నేడు అమలుచేస్తున్నారు. సెజ్లు, కార్పొరేట్ వ్యవసాయం ద్వారా మన రైతాంగాన్ని నిర్వాసితులను చేసి వారి సామంతరాజులద్వారా పాలన చేస్తారు. ఇది బ్రిటిష్ వాడి కంపెనీ వలస పాలనకు మరో రూపమే. నేడున్న స్థితిలో మళ్ళీ వలస రాజ్యాలను ఓపెం గా స్థాపించనక్కరలేదు. స్థానిక పాలక వర్గాన్ని తమ గుప్పెట్లో వుంచుకొని తాము రిమోట్ కంట్రోల్ ద్వారా తమ వ్యాపారాలను అత్యధిక లాభాలతో మరింత కౄరమైన పాలన చేస్తూన్నారు. మన నల్లదొరలు జీహుజూర్ అనడం తప్ప మరో గత్యంతరం లేదు. అందుకే నేడు మరో స్వాతంత్ర్య పోరాటం చేయాల్సిన అవసరం వుంది. దీనికి విరసం వంటి సంస్థలు మరిన్ని సజీవంగా వుండాల్సిన అవసరం వుంది. వాటిని నిర్వీర్యం చేయడానికి వివిధ రూపాలలో కుట్రలు జరుగుతున్నాయి. ప్రజాస్వామిక వాదులంతా వీటిని బతికించుకునే కృషి చేయాలి. లేకపోతే ఆ మాత్రం ప్రశ్నించే వారు కూడా వుండరు. కాదంటారా?

  ప్రత్యుత్తరంతొలగించు
 12. ఈ వ్యాఖ్యను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 13. మీ ధర్మాగ్రహం ఆమోదనీయం కాదు. కొడుకులు చేసే తప్పుకు తల్లులను దూషించడం క్షమించలేము.స్త్రీస్వేచ్చ గురించి తీవ్రంగా చర్చించే మీరు భాషను కూడా మోడరేట్ చేసుకోవాలని కోరుకుంటున్నా. ఇంక వేణు ఈ రోజు ఆంధ్ర జ్యోతిలో క్షమాపణ పత్రం రాసారు. చదవండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 14. మీరు చెప్పింది నిజమే కెక్యూబ్ గారు. మన ఇండియా ఇంకా semi-feudal సమాజం అని నాకు కూడా తెలుసు. ఇక్కడ భూస్వామి పాలేరుని లంజ కొడుకు అని తిడతాడు కానీ ఆ భూస్వామిని ఎవరైనా లంజ కొడుకు అంటే సహించలేడు. అతని భావజాలం ప్రకారం అతని కుటుంబానికి చెందిన స్త్రీలు పతివ్రతలుగా ఉండాలి కానీ వేరే కుటుంబాలకి చెందిన స్త్రీలని మాత్రం భోగం స్త్రీలని చూసినట్టు చూస్తాడు. ఈ భూస్వామ్య వర్గానికి చెందిన రాజకీయ నాయకులే మన దేశాన్ని ఏలుతూ మన దేశాన్ని అమెరికా సామ్రాజ్యవాదులకి semi-colonyగా మార్చారు. అందుకే ఈ భూస్వామ్య వర్గాన్ని తిట్టడానికి భూస్వామ్య బాషనే ప్రయోగించాల్సి వచ్చింది. మా అమ్మమ్మ కూడా వాళ్ళ ఇంటి పాలేర్లని లంజ కొడుకులు అని తిడుతుంది. ఆమె భర్త మాజీ MLA & మాజీ MP. ఆమె అన్న కూడా ఒరిస్సాలో మాజీ MLA. భూస్వామ్య కుటుంబాలలో పుట్టిన స్త్రీలు కూడా పాలేర్లని బూతులు తిట్టేటప్పుడు తాము ఆడవాళ్ళమని మరచిపోతుంటారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 15. "విరసం అధికార పత్రిక అరుణతారకు ఆర్ధిక స్థోమత లేక నెల నెలా రాని స్థితి గత కొన్నేళ్ళుగా వుండగా పాలక వర్గ ప్రకటనల ఆలంబనగా సొంత పత్రిక వీక్షణం ప్రతినెలా మార్కెట్లోకి ఐదో తారీఖునకే వచ్చే పెట్టుబడి ఎక్కడిదని ఎవరూ ప్రశ్నించలే."

  వర్మ గారూ,

  "వీక్షణం" తో ప్రత్యక్ష పరిచయం ఉన్న వ్యక్తిగా ఆ పత్రిక నేపధ్యం కొంత వివరిస్తే మీకు ఉన్న ఈ అపోహ తొలగుతుందని ఈ రెండు ముక్కలు రాస్తున్నాను.

  వీక్షణం అని మనం ఇవ్వాళ పిలుస్తున్న పత్రిక అసలు పేరు "ప్రజాపక్ష సమీక్ష". తెలుగులో ఎకనామిక్ ఎండ్ పొలిటికల్ వీక్లీ లాంటి విశ్లేషనాత్మక పత్రిక ఒకటి ఉండాలని సీనియర్ పాత్రికేయులు వి. హనుమంత రావు గారు, ఏ.బి.కె. ప్రసాద్ గారు, ఎన్. వేణు గోపాల్ కలిసి స్థాపించిన పత్రిక ఇది. మొదట పక్ష పత్రికగా మొదలై ఇప్పుడు మాసపత్రికగా మారింది. మీరన్నట్టుగా ఇది వేణు "స్వంత పత్రిక" కాదు.

  ఇక చిన్న పత్రికలకు ఆర్ధిక సాయం చేసే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ప్రతి రిజిస్టర్డ్ పత్రికకూ ప్రకటనలు ఇస్తుంది. ఆ క్రమంలోనే వీక్షణం పత్రికకు కూడా చివరి కవర్ పేజీపై ప్రభుత్వ ప్రకటన వస్తుంది. అయితే ఇలా ప్రకటన తీసుకున్నంత మాత్రాన వీక్షణం ప్రభుత్వ అనుకూల వైఖరి ఏనాడూ తీసుకోలేదు. ఈ ప్రకటనలపై వీక్షణం పత్రిక చాలా సార్లు సుధీర్ఘ వివరణ ఇచ్చింది. దాన్ని మీరు చదివారో లేదో.

  ఏ పత్రికకయినా దాని అమ్మకం ధర కన్నా అచ్చు ఖర్చు ఎక్కువ. వీక్షణం కూడా దానికి మినహాయింపేమీ కాదు. చందాదారులకు పత్రిక పంపితే ఒక్కో కాపీ పై మూడు నాలుగు రూపాయల నష్టం వస్తే అదే పత్రికను న్యూస్ స్టాండ్లో అమ్మితే ఆరేడు రూపాయల దాకా నష్టం వస్తుంది.

  ఇటీవలి కాలంలో వీక్షణం పత్రిక న్యూస్ స్టాండ్లలో అమ్మకాలు పెరిగాయి. దీని ఫలితంగా వీక్షణం నష్టాలూ పెరిగాయి. ఈ విషయాలన్నీ ప్రతి నెలా వీక్షణం తన పాఠకులతో పంచుకుంటూనే ఉంది.

  అసలు ప్రకటనలే లేకుండా పత్రిక నడపాలన్న అలోచన మంచిదే, కానీ పాఠకులకు అది మోయలేని భారం అవుతుంది.

  ప్రతి నెలా పేరుకుపోతున్న అప్పులతో వీక్షణం కూడా ఎక్కువ రోజులు వచ్చే పరిస్థితి కనపడటం లేదు.

  కొణతం దిలీప్

  ప్రత్యుత్తరంతొలగించు
 16. అబిప్రాయాలతో,నమ్మకాలతో,ఆదర్శాలతో సంబంధం లేకుండా మనుషులతో మనుషులుగా సంబంధాలు ఉండకూడదా?

  వేణుగోపాల్ గారికి రాజశేఖర్ రెడ్డితో ఉన్న "పరిచయం" వృత్తిపరం,మేధోపరం. అంతమాత్రానా "అక్రమ"సంబంధాలు అంటగట్టి చిలవలుపలవలు చేసి మాట్లాడం ఏ విధంగా విప్లవ నిబద్ధత?

  ప్రత్యుత్తరంతొలగించు
 17. వృత్తిపరమైన సంబంధం ఉన్నంతమాత్రాన పొగడాలని రూల్ లేదు. నాకు కూడా ఒక రాజకీయ నాయకునితో వృత్తిపరమైన సంబంధం ఉంది. కానీ నేను వాడ్ని పొలిటికల్ గా సపోర్ట్ చెయ్యలేదు. వేణు గోపాల్ తాను రాజశేఖర రెడ్డిని పొగడడం తప్పేనని ఒప్పుకుంటూ ఈ రోజు ఆంధ్ర జ్యోతిలో వ్రాశాడు.

  ప్రత్యుత్తరంతొలగించు
 18. కత్తి, నువ్వు నిబద్ధత గురించి మాట్లాడడం విచిత్రంగా ఉంది. నీ భావజాలం ప్రకారం డబ్బున్న కుటుంబంలో పుట్టి రిజర్వేషన్ కోటాలో ఉద్యోగం పొందడం తప్పు కాదు, హిందూ మతం వదిలి క్రైస్తవ మతంలోకి లేదా ఇస్లాం మతంలోకి చేరిన తరువాత తమ పూర్వ మతానికి చెందిన కులం పేరు చెప్పుకుని రిజర్వేషన్ పొందడం కూడా తప్పు కాదు. నీకు కూడా నిబద్ధత లేనప్పుడు ఇతరుల నిబద్ధతని నువ్వు సర్టిఫై చెయ్యగలవా?

  ప్రత్యుత్తరంతొలగించు
 19. @PKMCT /మార్తాండ/ప్రవీణ్:మీతో అర్థవంతమైన చర్చలు జరిగుతాయనే ఆశ నాకు లేదు. కాబట్టి దయచేసి నన్నుద్దేశించి వ్యాఖ్యలు చెయ్యకండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 20. వేణుగోపాల్ క్షమాపణలు చెప్పాల్సిన అవసరం ఉందని నేను అనుకోను.

  సిద్ధాంత విబేధాలు,ఆశయాల ప్రతికూలత్వం ఉన్నంతమాత్రానా వ్యక్తులతో సంబంధాలు (కనీసం వృత్తిపరమైన పరిచయాలు) ఉండకూడదు అనేది మూర్ఖత్వమే అవుతుంది. నా అభిప్రాయాలతో,సిద్ధాంతాలతో పూర్తిస్థాయిలో విబేధించే స్నేహితులు నాకున్నారు. అంతమాత్రానా నా నిబద్ధత ప్రశ్నార్థకం అవుతుందా? వేణుగోపాల్ విషయంలో కూడా నేను అలాగే ఆలోచిస్తాను

  రాజశేఖర్ రెడ్డికి పలు ముఖాలున్నాయి. వాటిల్లో ఒకటి,ఒకానొక సమయంలో వేణుగోపాల్ గారికి వ్యక్తిగతంగా తెలిసింది. చనిపోయిన మనిషి గురించి “పోయినోళ్ళందరూ మంచోళ్ళే” తరహాలో తలుచుకున్నప్పుడు ఆ “మంచి” ముఖం వేణుకు గుర్తొచ్చింది. ఆ ముఖాన్ని గురించి పత్రికా ముఖంగా చెప్పాడు. అంతమాత్రానా తన విప్లవాత్మక నిబద్ధతకు మలినం అంటిందనడం రంగనాయకమ్మ లాంటి గుహల్లో భద్రంగా బ్రతికే ఆదర్శవాదులు అంటే అర్థం చేసుకోవచ్చుగానీ, ప్రపంచవ్యవహారాల్లో బ్రతికే మిగతావాళ్ళు అనడం హాస్యాస్పదంగా ఉంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 21. వృత్తిపరమైన పరిచయాలు ఉండకూడదు అని ఎవరన్నారు? వృత్తిపరమైన పరిచయాలు ఉన్నంతమాత్రాన రాజకీయంగా పొగడకూడదు అన్నారు. నాకు కూడా ఒక రాజకీయ నాయకునితో వృత్తిపరమైన పరిచయం ఉంది. వాడు స్థాపించిన ఒక ఇన్సిటిట్యూషన్ కి వెబ్ సైట్ డిజైన్ చెయ్యాలని కోరుతూ కొన్ని సార్లు నా దగ్గరకి వచ్చాడు. అతను ఎప్పుడు చెక్ వ్రాసి ఇస్తే అప్పుడు వెబ్ సైట్ డిజైన్ చెయ్యడానికి నేను సిద్ధమే. కానీ అతను చనిపోయినా, బతికి ఉన్నా అనవసరమైన పొగడ్తలు నేను కురిపించను.

  ప్రత్యుత్తరంతొలగించు
 22. పరిటాల రవి రాజశేఖర రెడ్డి కంటే పచ్చి ఫాక్షనిస్ట్. అతను చనిపోయినప్పుడు గద్దర్ అనే మరో వెన్నుపోటుదారుడు అతన్ని పొగడడం జరిగింది. భూస్వాములూ, ఫాక్షనిస్టులు, ఆంగ్లో-అమెరికన్ సామ్రాజ్యవాదుల ఏజెంట్లు చనిపోతే ఏడ్చేవాళ్ళు విప్లవకారులా? క్షమాపణ చెప్పిన వ్యక్తిని క్షమాపణ చెప్పినందుకు తిట్టడం ఏమిటి? తప్పు జరిగింది అని తెలుసుకుంటే తప్పా?

  ప్రత్యుత్తరంతొలగించు
 23. @ప్రవీణ్/మార్తాండ/PKMCT: అసలు మీరు వేణుగోపాల్ రాసిన వ్యాసాన్ని చదివారా? I am sure you haven't read thats why you are making such allegations. Please read
  http://www.andhrajyothy.com/archives/archive-2009-9-6/editshow.asp?qry=/2009/sep/6edit2

  ప్రత్యుత్తరంతొలగించు
 24. నేను చదివాను. వేణు గోపాల్ తాను చేసింది తప్పేనని ఒప్పుకున్నాడు. తెలంగాణా ద్రోహం, ముదిగొండ కాల్పులు, వాకపల్లి రేప్ లు, పోతిరెడ్డిపాడు నీళ్ళ దొంగతనం వగైరా ప్రజా ద్రోహ చర్యల గురించి వేణు గోపాల్ చివరలో ఏమి వ్రాశాడో చదువు. నీతిగా బతకడం బాధ్యత. నీతిగా బతకడం కేవలం వ్యక్తిగత ఆదర్శం అనుకుంటే ఎవరూ నీతిగా బతకరు. రంగనాయకమ్మ గారి రచనలు చదివిన వాళ్ళు ఎవరికైనా ఈ విషయాలు అర్థమవుతాయి. అవకాశవాదమే పరమార్థం అనుకునే వాళ్ళకి మాత్రం అర్థం కావు. ఉదయం పూట పాలక వర్గం వాళ్ళని తిడుతూ, మావోయిస్టులని పొగుడుతూ, సాయింత్రం పూట పోలీస్ ఆఫీసర్లతో పార్టీలకి వెళ్ళే విప్లవ సాంస్కృతికవాదులు ఉంటే విప్లవం ఎలా వస్తుంది? వేణు గోపాల్ కి ఏకంగా ముఖ్యమంత్రితోనే పార్టీలకి వెళ్ళిన అనుభవం ఉంది. పాలక వర్గాన్ని పడదోస్తాం అంటూనే పాలక వర్గ పార్టీల వాళ్ళతో కలిసి డిన్నర్ పార్టీలకి వెళ్తే పాలక వర్గాన్ని ఎలా పడగొట్టగలరు?

  ప్రత్యుత్తరంతొలగించు
 25. @ప్రవీణ్: వేణు క్షమాపణలు చెప్పింది his choice of words కి సంబంధించి.తన అనుభవాలకు సంబంధించి కాదు.

  ప్రత్యుత్తరంతొలగించు
 26. అనుభవాలంటే నీ దృష్టిలో ఏమిటి? ఓ ఉదాహరణ చెపుతాను. పట్టణంలోని ఓ డబ్బున్న వ్యక్తి నన్ను వాళ్ళ రెండవ అబ్బాయి పెళ్ళికి రమ్మని మొహమాట పెట్టాడు. వాళ్ళ పెద్దబ్బాయిది మా బిజినెస్ సిండికేటే. అప్పట్లో శ్రీకాకుళం పట్టణంలో ఇంటర్నెట్ కేఫ్ లకి యూనియన్ ఉండేది. మేము ధరలు పెంచడానికి సిండికేట్ అవ్వాల్సి వచ్చింది. ఆ పెళ్ళికి వెళ్ళాలని నాకు లేదు కానీ వెళ్ళకపోతే వాళ్ళు నా గురించి నెగటివ్ గా అనుకుని బిజినెస్ రిలేషన్ చెడిపోతుందని వెళ్ళాను. సిండికేట్ కొత్తగా ఫార్మ్ అవుతున్న టైమ్ లో ఇలా సిండికేట్ సభ్యుల మధ్య కోపాలు రాకూడదు, సిండికేట్ ఫార్మేషన్ తొందరగా జరిగితే మంచిది అనుకున్నాను. పెళ్ళికి వెళ్ళి భోజనం అయిపోయిన తరువాత పని అయిపోయిందనుకుని ఇంటికి వచ్చేశాను. అక్కడ ఎక్కువ సేపు ఉండలేదు. ఎందుకంటే ఆ పార్టీ వ్యక్తిగతంగా అంత ఇంపార్టెంట్ కాదు కానీ బిజినెస్ పరంగా మాత్రం కొంత అవసరమే. అప్పట్లో పార్టీ ఇచ్చిన వాడి ఇంటర్నెట్ కేఫ్ తప్ప మిగిలిన ఇంటర్నెట్ కేఫ్ లన్నీ లాసుల్లో నడుతున్నాయి. తాను చెప్పినట్టు యూనియన్ గా ఏర్పడితే అన్ని ఇంటర్నెట్ కేఫ్ లకీ సమస్యలు పరిష్కారం అవుతాయన్నాడు. అందుకే పార్టీ ఇచ్చిన వాడిని నమ్మాల్సి వచ్చింది. మరి వేణు గోపాల్ చేసింది ఏమిటి? ఇతనికి రాజశేఖర రెడ్డితో ఉన్న ప్రొఫెషనల్ సంబంధాలు కూడా గొప్ప అని చెప్పుకున్నాడు. ఒక విప్లవకారుడి హోదాలోనే ఒక పాలక వర్గం నాయకుడినీ, అది కూడా గ్రేహౌండ్స్, కోబ్రా ముఠాల ప్రొమోటర్ నీ పొగిడాడు.

  ప్రత్యుత్తరంతొలగించు
 27. వేణు గోపాల్ 1981 (ఇరవై ఏళ్ళ వయసులో) మార్క్సిస్ట్-లెనినిస్ట్ సాహిత్యం వ్రాయడం మొదలు పెట్టాడు. చిన్న వయసులోనే విప్లవ రచయితగా మారిన వ్యక్తి ఒక పాలక వర్గ నాయకుడు, అది కూడా గ్రేహౌండ్స్ లాంటి నరహంతక ముఠాల డైరెక్టర్ తో కలిసి తిరిగిన అనుభవాల గురించి చెప్పుకుంటే వినడానికి అదోలా ఉంటుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 28. చేసిన తెలివి తక్కువ పనిని తప్పు పట్టకుండా క్షమాపణ చెప్పడం తప్పు అనడం కత్తి గారి స్టైల్.

  ప్రత్యుత్తరంతొలగించు
 29. ఇది కత్తికి మనకు మద్యగా మారి చర్చ జరగాల్సిన విషయంపై జరగడం లేదు. వ్యక్తుల ప్రైవేటు బతుకులు మనకు అనవసరం, పబ్లిక్లో నిలబడితే ఏమైనా అంటాం అన్న మహాకవి మాటను ఎవరైనా ఒప్పుకోవాల్సినదే.

  ప్రత్యుత్తరంతొలగించు
 30. మహేష్ గారు వృత్తిపరమైన సంబంధాలను తప్పు పట్టలేదు. మేధోపరమైన సంబంధాన్నే నేను తప్పు పట్టాను. తన మేదావితనాన్ని ఒక ప్రతిపక్ష పాలక వర్గ భూస్వామ్య ఫ్యాక్షనిస్టు నాయకుడికి ఆసరాగా వాడినందుకు. చర్చల తరువాత కోల్పోయినదానిని పుడ్చుకోగాలమా. చర్చలకు పురికొల్పిన మేధావి వర్గం వీళ్ళే కదా? అసలు తెదేపా అధికారం కోల్పోయిన తరువాత ఈయన కామ్గేయుల పాలనపై రాసినది ఎక్కువమంది ఫాలో అయిన దినపత్రికలలో అసలు రాలేదు. నాటి పాలక వర్గ వ్యతిరేక స్వభావం తీవ్రతను కోల్పోవడానికి కారణం ఈ వెచ్చని చిరునవ్వుల కరస్పర్శ కాదా?

  ప్రత్యుత్తరంతొలగించు
 31. వనజ గారి బ్లాగ్ అడ్రెస్ దొరికింది. వేణు గోపాల్ అమెరికా సామ్రాజ్యవాదం గురించి వ్రాసిన పుస్తకం ఒక దాని వెనుక పేజిలు చూడగా అతను సి. వనజ గారితో కలిసి వ్రాసిన పుస్తకం పేరు కనిపించింది. సి. వనజ ఎవరా అని ఆలోచిస్తోంటే మూడేళ్ళ క్రితం నేను చదివిన బ్లాగ్ ఒకటి గుర్తుకి వచ్చింది. http://vanajac.blogspot.com మళ్ళీ ఓపెన్ చేసి చదివాను. ఆ బ్లాగ్ కాంట్రిబ్యూటర్ల లిస్ట్ లో మన తెలుగు బ్లాగర్ జేప్స్ (తెలంగాణా NRI జయ ప్రకాశ్) పేరు కూడా ఉంది. అప్పుడు అర్థం అయ్యింది, ఆమె మనం అనుకున్న వనజేనని.

  ప్రత్యుత్తరంతొలగించు
 32. పాలక వర్గంతో చర్చలు జరిపించడం వల్ల ఏమైనా ప్రోగ్రెస్ కనిపించిందా? పాలక వర్గం వాళ్ళతో చర్చలు జరిపితే వాళ్ళు "మేమందరం శ్రమ జీవుల కష్టాల మీద విలాసాలు అనుభవిస్తున్న పారాసైట్ గాళ్ళం" అని ఒప్పుకుంటారా? తాడేపల్లి హరికృష్ణ వ్రాసిన వాక్యాలు చదవండి "ప్రతి పెట్టుబడిదారుడూ, ప్రతి యజమానీ సెలవిచ్చే నీతిశస్త్రసారమంతా ఇదేను: తానెలా కష్టపడి పైకొచ్చిందీ, అలాగే అట్టడుగునే ఉంటూ ఇంకా కష్టపడితే మీరందరూ కూడా ఎలా పైకిరావచ్చో ప్రతి యజమనీ లేదా ప్రతియాజమాన్యమూ శ్రీరంగనీతులు చెబుతుంది. తనకొడుకు మాత్రం ఏ అర్హతలూ కష్టం లేకుండానే తదుపరి యజమాని ఎలా అవుతాడో వివరించకుండా."

  ప్రత్యుత్తరంతొలగించు
 33. http://img2.imageshack.us/i/scanimage001qj.jpg/
  ఇంత గొప్ప విప్లవ రచయిత పాలక వర్గం ఏజెంట్ గా ఎలా మారాడు?

  ప్రత్యుత్తరంతొలగించు
 34. కత్తి గారి నిబద్దత వామ్మో !

  నా అభిప్రాయాలతో,సిద్ధాంతాలతో పూర్తిస్థాయిలో విబేధించే స్నేహితులు నాకున్నారు. అంతమాత్రానా నా నిబద్ధత ప్రశ్నార్థకం అవుతుందా?
  ------
  నీకు నాకు ఉంటే ప్రపంచం లో ఎవరికీ నష్టం లేదు కాని కొన్ని వందలమంది ప్రాణాలు తెగించి పోరాడుతున్న పోరాటానికి నాది పబ్లిక్ పేస్ అని చెప్పుకోనేవాడి మాత్రం ఉండదు.

  అ భిప్రాయాలతో,నమ్మకాలతో,ఆదర్శాలతో సంబంధం లేకుండా మనుషులతో మనుషులుగా సంబంధాలు ఉండకూడదా?
  ----
  ఎందుకుండ కూడదు బిన్లాడెన్ కు బుష్ కు కూడా ఉండచ్చు

  ప్రత్యుత్తరంతొలగించు
 35. రాజశేఖర్ రెడ్డికి పలు ముఖాలున్నాయి. వాటిల్లో ఒకటి,ఒకానొక సమయంలో వేణుగోపాల్ గారికి వ్యక్తిగతంగా తెలిసింది. చనిపోయిన మనిషి గురించి “పోయినోళ్ళందరూ మంచోళ్ళే” తరహాలో తలుచుకున్నప్పుడు ఆ “మంచి” ముఖం వేణుకు గుర్తొచ్చింది. ఆ ముఖాన్ని గురించి పత్రికా ముఖంగా చెప్పాడు. అంతమాత్రానా తన విప్లవాత్మక నిబద్ధతకు మలినం అంటిందనడం రంగనాయకమ్మ లాంటి గుహల్లో భద్రంగా బ్రతికే ఆదర్శవాదులు అంటే అర్థం చేసుకోవచ్చుగానీ, ప్రపంచవ్యవహారాల్లో బ్రతికే మిగతావాళ్ళు అనడం హాస్యాస్పదంగా ఉంది.
  ---
  అబ్బా ఆలాగ ఆ ప్రపంచవ్యవహారాల్లో బ్రతికే మిగతావాళ్ళు విప్లవం జిందాబాద్ అని ప్రాణత్యాగం చేసే వాళ్ళ జీవితాల మీద తమ వ్యక్తిగత జీవితాలకు పునాదులు వేసుకోవటం లేదు.
  రంగనాయకమ్మ - ఆ పేరు తలుచుకోవటానికి కూడా అర్హత ఉండాలి . ఆవిడ ఏమి చెబుతుందో అదే ఆచరిస్తుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 36. ఓ సారి కత్తి నన్ను అడిగాడు "నీకు ఫ్రీగా లక్ష రూపాయలు వస్తే వదులుకుంటావా?" అని. కత్తిలో నిబద్ధత లోపించిందనడానికి ఇది కూడా ఉదాహరణే. గ్రేహౌండ్స్ & కోబ్రాల లీడర్ ని పొగిడిన సూడో విప్లవకారుడిలో కత్తికి నిజాయితీ కనిపించడం పెద్ద విచిత్రమా?

  ప్రత్యుత్తరంతొలగించు
 37. ఇది సందర్భమో కాదో గాని ...
  ఈ చర్చను చదువుతుంటే, మా గురువు గారు వ్రాసిన ఒక పద్యం గుర్తుకు వచ్చింది.
  " ఎంత మంది చెమట - ఎందరి రక్తమ్మొ -
  పీల్చకుండ నెవడు పేర్చె ధనము ?
  దొరలు చేయు ముసుగు దోపిడీయే ఆస్తి !
  అంతరించవలయు ’ ఆస్తి హక్కు ’ !!
  ( కీ.శే. నండూరి రామకృష్ణమాచార్యుల వారి రచన )

  ప్రత్యుత్తరంతొలగించు
 38. ఆస్తి సంబంధాలలో మార్పు రాకపోతే విప్లవం తెచ్చి సాధించే ప్రయోజనం ఏమీ ఉండదు. ఆస్తి కోసమే కొంత మంది రెబెల్స్ (విప్లవకారులు) రెనెగేడ్స్ (విప్లవ ద్రోహులు)గా మారుతారు. ఆ మధ్య కళ్యాణ రావు గారి అబ్బాయి సినిమా నిర్మాత అవ్వడం కూడా వివాదాస్పదమయ్యింది.

  ప్రత్యుత్తరంతొలగించు
 39. డా.ఆచార్య ఫణీంద్ర గారికి నమస్కారం. ఈ చర్చలో పాల్గొన్నందుకు మీకు ధన్యవాదాలు. గురువుగారు వ్రాసిన పద్యం అక్షర సత్యం.

  ప్రత్యుత్తరంతొలగించు
 40. "అసలు తెదేపా అధికారం కోల్పోయిన తరువాత ఈయన కామ్గేయుల పాలనపై రాసినది ఎక్కువమంది ఫాలో అయిన దినపత్రికలలో అసలు రాలేదు."

  వర్మ గారూ,

  మీరు ఒకరిని విమర్శించాలని నిర్ణయించుకుని దాని కొరకు ఇలా అబద్ధాలను పేర్చుకుంటూ వెళ్లడం బాగోలేదు. ఎన్. వేణుగోపాల్ ఇదే ఆంధ్రజ్యోతి పత్రికలో 2006లో మొదలుపెట్టి "వర్తమానం" పేరిట ఒక కాలం రాశాడు. అందులో రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ప్రవేశపెట్టిన అన్ని అపసవ్య విధానాలపై విమర్శ రాశాడు. 2007 నుంచీ సూర్య పత్రికలోనూ వేణు కాంగ్రెస్ ప్రభుత్వ వ్యతిరేక వ్యాసాలు రాశాడు. గత అయిదేళ్లు గా వీక్షణం పత్రికలో కొన్ని వందల వ్యాసాలు ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ వచ్చాయి. వీక్షణం తాజా సంచికలోనూ సహకార వ్యవసాయ విధానంపై విమర్శా వ్యాసాలు వచ్చాయి.

  అబద్ధాల సాయంతో అల్లిన విమర్శకు విలువ ఉండదని గుర్తుంచుకోండి.

  కొణతం దిలీప్

  ప్రత్యుత్తరంతొలగించు
 41. @వర్మ:విప్లవ మేధావులు అధికార పక్షం(భావజాలం)తో ఒక సమాంతరపోరాటం జరుపుతున్నవాళ్ళు.వేణు ఆ సమాంతర భావజాలానికి ప్రతినిధిగా ఉన్నా, (తను చెప్పిన ఉదంతంతో) తన మేధ ప్రతిపక్షంలో ఉన్న రాజశేఖర్ రెడ్డికి ఒక రాజ్యాంగబద్ధమైన పబ్లిక్ స్పేస్ (అసెంబ్లీ)లో అదే పోరాటానికి కొనసాగింపుగా ఉపయోగపడటం పెద్ద conflict అనిపించకపోయుండవచ్చు. పత్రికల్లో రాసుకునేవాటికన్నా అసెంబ్లీ చర్చలకే ప్రజాస్వామ్యంలో విలువెక్కువ.

  ఒకసారి ఇలా జరిగినంతమాత్రానా వేణుగోపాల్ పాలకపక్షానికి(అప్పట్లో వై.ఎస్.ప్రతిపక్షం)తన ఆదర్శాల్ని తాకట్టుపెట్టినట్టా? ఈ conclusion కి ఎవరొచ్చారు? అంత త్వరగా మనిషి నిబద్ధతని ఎలా శంకించారు? ఒక ఘటనతో ఇన్నిసంవత్సరాల మనిషిపోరాటాన్ని కాలరాస్తున్న కుట్రకు ఆద్యం ఎక్కడ? ఆజ్యం ఎవరు పోస్తున్నారు. ఎందుకు పోస్తున్నారు?

  ప్రత్యుత్తరంతొలగించు
 42. మావోయిస్టులు పాలక వర్గంతో చర్చకి వచ్చేలా చేసి ఆ సమయంలో ఎంకౌంటర్లు పెరిగే పరిస్థితి కల్పించి అనేక మంది మావోయిస్టుల చావులకి దారి తియ్యడం విప్లవ మేధావులు చేసే పనా? నల్లమలలో అనేక మంది మావోయిస్టులు ఎంకౌంటర్లలో చస్తే హైదరాబాద్ లో విరసం సభ్యులు తిని తొంగుంటూ జల్సాగా ఉన్నారు.

  ప్రత్యుత్తరంతొలగించు
 43. రోమ్ నగరం కాలిపోతోంటే నీరో చక్రవర్తి ఫిడల్ వాయించుకుంటూ కూర్చున్నాడు. నల్లమలలో అనేక మంది మావోయిస్టులు చస్తే హైదరాబాద్ లో lavish life style గడుపుతున్న విరసం సభ్యులు కదలలేదు.

  ప్రత్యుత్తరంతొలగించు
 44. అసలాయన చేసిన తప్పు తెలుసుకొని క్షమాపణ చెప్పాడు కాని వీళ్ళకు బాధేమిటో !
  పత్రికల్లో రాసుకునేవాటికన్నా అసెంబ్లీ చర్చలకే ప్రజాస్వామ్యంలో విలువెక్కువ.
  ----
  మరి ఎన్నికలలో పోటీ చేస్తేపోలా

  ఆజ్యం ఎవరు పోస్తున్నారు. ఎందుకు పోస్తున్నారు?
  -----
  మీ ప్రియ వేణు గారికి ఉన్నట్టే ఈ బ్లాగు ఓనరు కి కూడా స్వేచ్ఛా ఉందా లేదా? ఆయనకీ నచ్చింది ఆయన రాసుకున్నాడు మీ దాడి ఏమిటి ?
  ఒక ఘటనతో ఇన్నిసంవత్సరాల మనిషిపోరాటాన్ని కాలరాస్తున్న కుట్రకు ఆద్యం ఎక్కడ? ఆజ్యం ఎవరు పోస్తున్నారు. ఎందుకు పోస్తున్నారు?
  -----
  మనకి ఎప్పటికప్పుడు ఇదే మొదటిసారిలే

  ప్రత్యుత్తరంతొలగించు
 45. @నాయిష్టం : ఇక్కడ మరో పార్శ్వం చూపించే ప్రయత్నం చేస్తున్నానేగానీ ఎవరిమీదా "దాడి" చెయ్యటం లేదు.

  ప్రత్యుత్తరంతొలగించు
 46. అసలు పెద్ద మనిషి క్షమాపణ చెప్పిన తరవాత మరో పార్శ్వం చూపించవలసిన అవసరం లేదు( ఇప్పుడు "వేణు క్షమాపణలు చెప్పింది his choice of words కి సంబంధించి.తన అనుభవాలకు సంబంధించి కాదు" ఇల్లాంటివి చెప్పి ఆ క్షమాపణలు వివరించే ప్రయత్నాలు వద్దు బాబు .,) మీకన్నా ఈ ఓనరు వేణు గురించి తెలుసుకునే అవకాశం ఉన్నట్టు గా కనపడుతుంది. అంతగా చెప్పదలుచుకున్నప్పుడు ఆయన రాసిన దానిమీద కాకుండా
  "మనిషిపోరాటాన్ని కాలరాస్తున్న కుట్రకు ఆద్యం ఎక్కడ? ఆజ్యం ఎవరు పోస్తున్నారు. ఎందుకు పోస్తున్నారు?" ఇలాంటివి రాయటమేమిటి . దానికి ఈ పోస్టు లో ఉన్నదానికి సంభందమేమిటి?

  ప్రత్యుత్తరంతొలగించు
 47. @నాయిష్టం: ఇక్కడ సమస్య వేణు వర్మగారికి బాగా తెలుసా లేదా నాకు తెలుసా అనేది కాదు.చర్చ ఘటన,పత్రికా పకటనల పట్ల పంచుకుంటున్న కొన్ని భిన్నాభిప్రాయాలు మాత్రమే.

  వర్మగారి అభిప్రాయం వేణు మీద జరుగుతున్న కుట్రపూరితమైన character assassination నేపధ్యంలోంచీ mislead చెయ్యబడిందని నా నమ్మకం. అందుకే ఆ మాటలు అన్నాను. నా ఉద్దేశం వర్మగారికి ఖచ్చితంగా తెలుసుందని నమ్ముతాను. అందుకే వారు దానికి సమాధానం చెప్పలేదు. ఇక మధ్యలో మీకొచ్చిన రోషమేమిటో నాకు అర్థం కాని విషయం.

  ప్రత్యుత్తరంతొలగించు
 48. అనుకున్న ఇదే కామెంట్ వస్తదని నా రోషమేమిటంటే వేణు నంటే మీకు వచ్చిన లాంటిదే !

  ప్రత్యుత్తరంతొలగించు
 49. మహేష్ గారు నా పోస్ట్ వెనక కుట్ర లేదు. నేను రాసినది నా ఆలోచనలలోమ్చి వచ్చిన అభిప్రాయమే. దానికి ఇంత స్పందన రావడం, చర్చ జరగడం వెనుక కుట్ర ఎందుకు వుంటుంది.ఈ చర్చలో పాల్గొన్న వారికి వ్యక్తిగతంగా ఎవరికీ వేణు శత్రువు కాదు. నాకు ఆయన తొంభై ఎనిమిదినుండి తెలుసు. (మా సంస్థ ఆంతరంగిక చర్చలు ఇక్కడ రాయకూడదు). నేను విరసంలో బాగా ఇష్టపడిన వ్యక్తీ కూడా. అలాంటి వ్యక్తీ కూడా ఇన్నేళ్ళు సంస్థ లో ఎవరైనా తప్పు చేస్తే కడిగేసే మనిషి తనకు పాలక వర్గాలతో ఏర్పడిన సత్సంబంధాలను కప్పివు౦చాల్సిన అవసరం ఏమొచ్చింది. నేను డిఫర్ అయ్యింది అక్కడే. ఇది మోసం కాదా? కళ్యాణరావుగారిపై వచ్చిన ఆరోపణలకు తీవ్రంగా నిలదీసిన వారు తమ గురించి ఎందుకు చెప్పుకోలేకపోయారు. విమర్శా - ఆత్మవిమర్శ రెండు వర్తిమ్పచేసుకున్నవారే నిజమైన విప్లవ మేధావులు.తమ వాగ్దాటితో ఎదుటివారి నోరు నోక్కేయాలని చూడగూడదు

  ప్రత్యుత్తరంతొలగించు
 50. దిలీప్ గారికి మీరు నేను అబద్ధాలు రాస్తున్నాను అని రాసారు. దానికి సమాధానం ఆపై వాక్యం లోనే వుంది. వర్తమానం ఎన్నాళ్ళు నడిచింది. సూర్య ఎంతమంది చదువుతారు. టిడిపి పై చేసిన దాడిలో సగం కూడా కాదు. కాంగిలు చల్లని ఐస్ కత్తితో గొంతులు కోసారు. చాప కింద నీరులా ప్రపంచ బ్యాంకు సంస్కరణలు అమలు చేసారు. వీటిపై పదునైన రచనలు రాలేదు.

  మీ స్వామి భక్తికి నా హేట్సాఫ్.

  ప్రత్యుత్తరంతొలగించు
 51. ప్రవీణ్ మరియు నాయిష్టం - మిత్రులారా చర్చను సజీవంగా కొనసాగిస్తున్నందుకు ధన్యవాదాలు. నేనున్నది ఆంధ్రా ఒరిస్సా బోర్డర్ లోని పార్వతీపురం. మాకు సిటీలో జరిగే విషయాలు అంతగా తెలియవు. మిత్రుల ద్వారా అప్పుడప్పుడు తెలిసేవి, కొంతమంది ఎందుకో గాని బయటపడేవారు కాదు. కాని నాకు అలాంటి సంకోచాలు లేవు. ఏదయినా తెలిస్తే వెంటనే అడిగేయడం ఒక్కటే. చర్చకు అవకాశం లేకుండా చేయాలని నాపై వత్తిడి వచ్చింది. కానీ ఇది ఇలా ప్రజాస్వామిక౦గా చర్చలోకి రావడం మంచిదని నాఅభిప్రాయ౦. కాదంటారా. ఇందులో ఖ్యారక్టర్ అస్సాసినేషన్ ఎక్కడ. తనకు తాను బయటపడినప్పుడు మరి చర్చకు ఎందుకు తలుపులు ముసుకోవాలి. నాలాంటి వారికి దినపత్రికలు అవకాసమిస్తాయా? సెలబ్రటేలకున్న చాన్సు మనకుమ్టుండా. నాకున్న ఈ చిన్న స్పేస్ కూడా మూయాలని అనుకోవడం నేను సహించలేకపోయాను. వారికున్న సైద్ధాంతిక పటుత్వం నాకు లేకపోయినా సామాన్యుడి ఫీలింగ్స్ ని అందరితో నాకున్న స్పేస్ లో తెలియచేయడానికి ప్రయత్నించాను. క్షమాపణలు రాసి దానిపై స్పందనలు తెలుసుకోకుండానే చర్చను ముగింపు చేసిన పవర్ వారిది.
  ఏమయినా కానీ మీకు నా ధన్యవాదాలు. నా కొత్త పోస్టులో గోర్కీ దృష్టిలో శ్రామిక వర్గ రచయితా లక్షణాలతో విల్లకి సమాధానం చెప్పే ప్రయత్నం చేసాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 52. నాకు కూడా హైదరాబాద్ తో పెద్ద కాంటాక్ట్ లేదు. మా అమ్మానాన్నలు వరంగల్, కరీంనగర్ లలో ఉద్యోగాలు చేసే రోజుళ్ళో హైదరాబాద్ తరచుగా వెళ్ళేవాళ్ళం. శ్రీకాకుళం వచ్చేసిన తరువాత బయట నుంచి వచ్చే సమాచారం ద్వారానే నాకు విరసం గురించి తెలుస్తూ వచ్చింది. శ్రీకాకుళం జిల్లాలో కూడా పి.ఎస్.నాగరాజు, అరసివిల్లి కృష్ణ లాంటి విప్లవ రచయితలు ఉన్నారు కానీ వాళ్ళు విరసం సభ్యులు కాదు. హైదరాబాద్ సమాచారం ఇక్కడికి చేరడం కష్టమే. సికందరాబాద్ స్టేషన్ నుంచి శ్రీకాకుళం రోడ్ స్టేషన్ కి కాజీపేట మీదుగా ప్రయాణిస్తే 840 కిలో మీటర్ల దూరం అవుతుంది. శ్రీకాకుళం రోడ్ స్టేషన్ నుంచి శ్రీకాకుళం పట్టణం 9 కి.మి. దూరం. అంత దూరం వెళ్ళి వచ్చి సమాచారం తీసుకురావడం కష్టమే. సికందరాబాద్ నుంచి పార్వతీపురం వెళ్ళాలంటే 849 కి.మి. ప్రయాణించాలి. విజయనగరం జంక్షన్ లో మరో ట్రైన్ మారి వెళ్ళాలి. వంగపండు ప్రసాదరావు లాంటి కొంత మందే అంత దూరం ప్రయాణించడానికి ఉత్సాహం చూపుతారు. మేము ఇంత దూరంలో ఉంటూ కష్ట పడి సమాచారం ఎందుకు తెలుసుకుంటున్నాము? కార్మిక విప్లవం విప్లవ ద్రోహులు (renegades) నీరుగారుతుందనే భయం వల్ల. నిజాయితీ ఉన్న విప్లవకారులకి renegadesని చూస్తే భయమే కలుగుతుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 53. కొన్నేళ్ళ క్రితం బూటకపు ఎంకౌంటర్ల వల్ల చనిపోయిన వాళ్ళ కుటుంబాలని ఇంటర్వ్యూ చేసి వీడియోలు తీసి డాక్యుమెంటరీ నిర్మించిన వనజ తరువాత పాలక వర్గం వాళ్ళ దగ్గర Pulitzer పురస్కారం అందుకోవడం, కొంత మంది స్వయం ప్రకటిత విప్లవకారులు ఆమెని పొగడడం కూడా జరిగింది. http://vanajac.blogspot.com/2006/04/on-winning-indias-pulitzer.html ఆమెని పొగిడిన వాళ్ళలో ఒక ప్రముఖ ఇంగ్లిష్ బ్లాగర్ కూడా ఉన్నాడు. అరెస్ట్ అయిన పీపుల్స్ మార్చ్ పత్రిక ఎడిటర్ గోవిందన్ గారి అభిమాని కూడా అతను. పాలక వర్గం వాళ్ళని నమ్మితే ఏమవుతుంతో అతనికి తెలియకపోవడం విచిత్రంగా ఉంది. గోవిందన్ గారిని పోలీసులు ఎలా చిత్రహింసలు పెట్టారో ఆ బ్లాగరే నాకు చెప్పాడు. కానీ అతను కూడా పాలక వర్గ ఏజెంట్ల వలలో పడిపోయాడు.

  ప్రత్యుత్తరంతొలగించు
 54. వర్మ గారు మీ సమాధానం కూడా చాల హుందా గా ఉంది. You have every right to question Mr.Venu on this issue, let his followers or fans think character assasination or something.

  ప్రత్యుత్తరంతొలగించు
 55. సినిమాలలోలాగ చాలెంజ్ చేసి ఏడాదిలో లక్షలు, కోట్లు సంపాదించడం సాధ్యం కాదు. జలగల్లా కార్మికుల రక్తం పీల్చి సంపాదించినా కొన్నేళ్ళు పడుతుంది కోటీశ్వరులు అవ్వడానికి. దళితుడైన కళ్యాణరావు గారి అబ్బాయి సినిమా నిర్మాత ఎలా అయ్యాడు? నిరుత్పాదక వ్యాపారమైన రియల్ ఎస్టేట్స్ వ్యాపారం చేశాడా? కాంట్రాక్టర్ అయ్యి కూలీ వాళ్ళ రక్తం పీల్చి సంపాదించాడా? హైదరాబాద్ లోని కాంట్రాక్టర్ల దగ్గర పని చేసే కూలీలలో ఎక్కువ మంది మహబూబ్ నగర్, ప్రకాశం, శ్రీకాకుళం లాంటి వెనుకబడిన జిల్లాలకి చెందిన వాళ్ళే. వీళ్ళు పేదరికం వల్ల తక్కువ కూలీ రేటుకి పని చెయ్యడానికి ముందుకి వస్తారు. వీళ్ళని శ్రమ దోపిడీ చేస్తే సులభంగానే కోటీశ్వరులు అయిపోవచ్చు.

  ప్రత్యుత్తరంతొలగించు
 56. దళితుడైన కళ్యాణరావుగారి అబ్బాయి అనడం బాగోలేదు. కళ్యాణరావుగారు చర్చల ముందు వరకు ఒంగోలులో ప్రైవేట్ కాలేజీలో లెక్చరర్ గా పనిచేసారు. ఆ తరువాత ఆయన తన మకాం హైదరాబాదుకు మార్చారు. ఆయనకున్న ఫేంను వాళ్ళబ్బాయి కొంతమేర వినియోగించుకొని ఫైనాంస్ సంపాదించి సినిమా తీద్దామనుకున్నాడు. కానీ మొదట వాడిన ఫైనాంస్ తో తన ఆఫీసు షోకులకే సరిపోయి చేతులు కాల్చుకున్నాడు. మీరలా అనడం దళితుడైతే సినిమా రంగానికి పనికిరారా అన్న అర్థం వస్తుంది. క.రా.గారికి అంత స్థోమత లేదు. ఆయన జైలులో వున్నప్పుడు కుటుంబ నిర్వహణ కూడా ఇబ్బందిపడ్డారు తన సహచరి. ఆయన నిబధ్ధత గలిగిన వ్యక్తి. ఆయన రాసిన అంటరాని వసంతం చదవండి. ఏడుతరాలను మించిన మన నేల చరిత.

  ప్రత్యుత్తరంతొలగించు
 57. దళితుల్లో కోట్లు సంపాదించిన వాళ్ళు ఏ కొద్ది మందో ఉంటారు జి.వెంకటస్వామీ, జి.ఎమ్.సి. బాలయోగిల లాగా. కులం-పెట్టుబడి కలిసి ఉన్నప్పుడు దళితుడు సినిమా నిర్మాత అయ్యే అవకాశాలు చాలా తక్కువే. మిడిల్ క్లాస్ కుటుంబంలో పుట్టిన కళ్యాణరావు గారి అబ్బాయి సినిమా నిర్మాత అవ్వడం డౌట్ కలిగించే విషయమే. ఇది కేవలం కులం గురించిన ప్రశ్న కాదు. ఆస్తి తనఖా చూపించకపోతే ఎవరూ అప్పు ఇవ్వరు. బ్యాంక్ వాళ్ళైనా, మార్వాడీలైనా ఆస్తి తనఖా పెట్టకపోతే అప్పు ఇవ్వరు. కళ్యాణరావు గారి అబ్బాయికి సినిమా నిర్మాణానికి అప్పు రావడం ఆశ్చర్యకరమే.

  ప్రత్యుత్తరంతొలగించు
 58. రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడు చంద్రబాబు నాయుడు మొసలు కన్నీళ్ళు కార్చాడు, జనం వోట్ల కోసం. మరి వేణు గోపాల్ ఎందుకు కన్నీళ్ళు కార్చినట్టు? మనం పార్లమెంటరీ పంథాని నమ్మము. మరి వోట్లు కోసం రాజకీయ నాయకులు చేసే పనులు మనం చేస్తే హాస్యాస్పదంగా ఉండదా? కెక్యూబ్ వర్మ గారు చెప్పింది నిజమే. వేణు గోపాల్ కన్నీళ్ళు కార్చడం ఓవర్ యాక్షన్ లంటిదే.

  ప్రత్యుత్తరంతొలగించు
 59. కత్తి మహేష్‌ గారూ, రంగనాయకమ్మ గారు ప్రకృతి నిర్మితమైన గుహల్లో భద్రంగా వుంటే, మీరు మానవ శ్రమతో నిర్మితమైన భవనాల్లో అభద్రంగా వున్నారా? ఎందుకొచ్చిన సంస్కారం లేని మాటలు ఇవి? ఆవిడ రాతలు మీకు నచ్చక పోతే ఆ రాతల్ని విమర్శించండి. ఆవిడ ఒక లాగా రాతలు రాసి, నిజ జీవితంలో ఇంకో లాగా ప్రవర్తిస్తే, ఆ విషయమే చెప్పి, విమర్శించండి. మీకు ఆవిడ జీవితం గురించి ఏం తెలుసని ఈ అసందర్భ ప్రేలాపన? రాతల్లో చూడ్డానికి చదువుకున్న వారిలా కనబడుతారు. అలాంటి వారికి ఇటువంటి వ్యక్తిగత దూషణ శోభ నివ్వదు. మీరు ఒకర్ని దూషిస్తే, ఇంకొకరికి మిమ్మల్ని దూషించడానికి ఎంతో సమయం పట్టదు. ఇక మీదట వ్యక్తి గత దూషణలు మాని, విషయ విమర్శకే పరిమిత మవుతారని ఆశిస్తాను.

  ప్రత్యుత్తరంతొలగించు
 60. It is another kind of Hit man story..(Dalaari Prachaa taapam) N Vennu could have write a novel like Cofessions of an Econamic Hit Man...Producer will safe...
  No body asking about his Journalist..housing colony...Vanaja and N Venu got Two plots...I think this is a wonder full debate...thees fellows...asked the Fellow beings these bourgeoisie education will not fit for us..
  let us join...revolution...in this way they spoiled the one generation people a way from the Mainstream education...
  i think this is a conspiracy..against poor daliths to through away from the Universities..
  they occupied the Universities..now enjoying the fruits...
  APCLC..Leaders..fighting with state their children were academicians at Most reputed Universities...
  i know Kalyana Rao garu personally..that is also another conspiracy..
  some intellectuals..wanted to blame..it is also another game...
  now he is under streets..no house...

  ప్రత్యుత్తరంతొలగించు
 61. రంగనాయకమ్మ గారి గురించి మహేష్ కి ఒక్క ముక్క కూడా తెలియదు. రంగనాయకమ్మ గారు ముప్పై ఏళ్ళ క్రితం ప్రజా సాహితీ అనే సాహితీ సంస్థలో ఉండేవారు. ఆ సంస్థ వారు ఆమెకి తెలియకుండా ఆమె వ్యక్తిగత జీవితం గురించి చెడుగా మాట్లాడేవాళ్ళు. రంగనాయకమ్మ గారు తన మొదటి భర్తని వదిలేసి తన కంటే తొమ్మిదేళ్ళు చిన్నవాడైన వ్యక్తితో కాపురం మొదలు పెట్టారు (చలం గారి మైదానం నవలలోని రాజేశ్వరిలాగ). రంగనాయకమ్మ గారికి మొదటి భర్త వల్ల పుట్టిన ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. రంగనాయకమ్మ గారి గురించి, ఆమె రెండవ భర్త గురించి వాళ్ళకి తెలియకుండానే ప్రజా సాహితీ సభ్యులు చెడుగా మాట్లాడుతున్నారని కొందరు ప్రజా సాహితి సభ్యులు ఆమెకి సమాచారం అందించారు. ఈ విషయం బయట పడిన తరువాత ప్రజా సాహితీ సభ్యులు సమాధానం చెప్పలేకపోయారు. సాహితీవేత్తలలో కూడా అలాంటి వాళ్ళు ఉంటారనే రంగనాయకమ్మ గారు ఇతర రచయితలతో ఎక్కువగా మాట్లాడరు. రచయిత్రి మీద వ్యక్తిగతంగా బురద జల్లడం అజ్ఞానమే అవుతుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 62. కస్తూరి గారు చర్చలోకి వచ్చినందుకు థాంక్స్. రంగనాయకమ్మగారి కాంట్రిబ్యూషణ్ గురించి వదిలేసి ఇతర విషయాలను మాట్లాడి చర్చను పక్కదోవపట్టించొద్దని నేను ముందె విన్నవించాను. దళితవాదం పేరుతో విరుచుకుపడుతున్నా సమయంలో ఆమే మార్క్స్ - అంబేద్కరిజం - బౌధ్ధం పై ఒక వివరణాత్మక విశ్లేషణను భారత సమాజానికి అన్వయిస్తూ ఇచ్చారు. ఇది చాలామంది కుహనా దళిత వాదుల నోళ్ళు మూయించి చర్చను అర్థవంతంగా సాగేందుకు దోహదపడింది. ఈ వయసులో కూడా ఆమె అంత ఓపిక సహనాలతో సాహితీ రంగంలో చేస్తున్న కృషికి అందరం ఆమెకు ఋణపడి వుండాలి.

  ప్రత్యుత్తరంతొలగించు
 63. రమాగారు ఏపీసిఎల్సీ వారి పోరాట పటిమను తక్కువ చేసి చూపొద్దు. మేధావి వర్గంగా వున్న కొంతమంది అలా స్టేట్ కు వ్యతిరేకంగా వచ్చి మాట్లాడటం వలన నేడు చట్టం కొంత మేరయినా బాధ్యతగా వ్యవహరిస్తోంది. లేదంటే ప్రశ్నించే వాళ్ళు లేక పది యేళ్ళ క్రితం పోలీసుల ప్రవర్తనకు నేటికీ ఇంత తేడా రాదు. వారి పిల్లల చదువులు, ఉద్యోగాలను గురించి వారికి స్వేచ్చ వుంటుంది. వారు ఉద్యమానికి బాసటగా మాటాడినంత మాత్రాన వారు దానికి రికౄటీలు కాదు. పౌరహక్కుల సంఘం ఏర్పడిందే ఎలైట్ వర్గం నుండి. మీ మిగతా చర్చ పట్ల నాకు అభ్యంతరం లేదు. కొనసాగనివ్వండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 64. మంద కృష్ణ లాంటి దళితులు తమ పేర్ల చివర మాదిగ (చెప్పులు కుట్టేవాడు) అని అవమానకరమైన టైటిల్ తగిలించుకుని అది prestigious symbol అని ఫీల్ అవ్వడం గురించి కూడా రంగనాయకమ్మ గారు వ్యాసం వ్రాసారు. ఆ వ్యాసాన్ని చాలా మంది దళిత నాయకులు అర్థం చేసుకోలేదు.

  ప్రత్యుత్తరంతొలగించు
 65. కులం ను నిర్మూలించడానికి పోరాటాలు చేయాల్సిన వాళ్ళు దానిని మరింత బలపడేట్లు చేసేందుకు ఇటువంటి చర్యలు దోహదపడ్డాయి. అంబేద్కర్ కులనిర్మూలన గురించి ఆరాటపడ్డారు. కాని ఓట్ల బేరగాళ్ళ వుచ్చులో పడిన వాళ్ళు దానికి తూట్లు పొడిచి తమ సొంత ఆస్తులు, పలుకుబడి పెంచుకునేందుకు అమాయక దళిత వర్గాన్ని చైతన్య పరచకుండా తమ పబ్బం గడుపుకొని కొత్త నాయకులుగా తయారయి సమాజాన్ని భ్రష్టుపట్టించారు. వర్గాలుగా విడిపోయి నేడు ఉనికిని పోగొట్టుకున్నారు. దళిత వర్గం నుండి క్రొంగొత్త గొంతుతో మరొ పోరాటం రావాల్సిన అవసరం నేడుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 66. కాలేజిలో ఎవరైనా తాను మాదిగోడిననో, రెల్లోడిననో గొప్పగా చెప్పుకుంటే అతన్ని ర్యాగింగ్ చేస్తారు. రాజాం ఇంజినీరింగ్ కాలేజిలో ఏమి జరిగిందో తెలిసినదే కదా. అలాంటప్పుడు "మాదిగ" అనే కుల సూచిక prestigious symbol అని ఎందుకు అనుకోవాలి? మంద కృష్ణ పై రంగనాయకమ్మ గారు చేసిన విమర్శలు 100% నిజాలు.

  ప్రత్యుత్తరంతొలగించు
 67. >> మాదిగ (చెప్పులు కుట్టేవాడు) అని అవమానకరమైన టైటిల్ తగిలించుకుని

  చెప్పులు కుట్టడం అవమానకరం ఎలా అయింది ? అదేమన్నా మర్డరా మానభంగమా? ఒక సారి జాంబవంతుని పురాణం చదవాలనుకుంటాను నువ్వు.

  అలా ఆలోచిస్తే ఏదో ఒక రోజు ఈ కోడిగ్ కూడా అవమానకరమైన వృత్తే అవుతుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 68. >>>>>
  కాలేజిలో ఎవరైనా తాను మాదిగోడిననో, రెల్లోడిననో గొప్పగా చెప్పుకుంటే అతన్ని ర్యాగింగ్ చేస్తారు. రాజాం ఇంజినీరింగ్ కాలేజిలో ఏమి జరిగిందో తెలిసినదే కదా. అలాంటప్పుడు "మాదిగ" అనే కుల సూచిక prestigious symbol అని ఎందుకు అనుకోవాలి?
  >>>>>
  రెండవ సారి చదువు నాయనా.

  ప్రత్యుత్తరంతొలగించు
 69. నేను మూడవ తరగతి చదువుతున్నప్పుడు, మా తరగతిలో రావిపాటి కస్తూరి అని ఒకమ్మాయి వుండేది. చాలా బాగా చదివేది. కాపుల పిల్ల అనుకుంటాను. ఒకసారి నన్ను టీచరు చేతి మీద స్కేలుతో కొడితే, దెబ్బ గట్టిగా తగిలిందా అని అడిగింది నన్ను. అంతే, గట్టి వెక్కి వెక్కి (self pity తో) ఏడ్చేశాను. ఏడవద్దూ, రేపు నీకు ఏమన్నా కొనిపెడతాను అని అంది. నా వయసు అమ్మాయే. అంతే. మర్నాడు స్కూలు ఇంటర్వల్లో నక్షత్రకుడిలాగా పట్టుకుని, ఒక పైసా పెట్టి బిస్కట్టు కొని ఇచ్చే వరకూ వదలలేదు నేను. ఐదవ క్లాసు ఆ స్కూల్లో అయిపోయాక, ఆరవ క్లాసు వేరే స్కూల్లో చేరాను. అక్కడ కూడా కస్తూరి నా క్లాసులోనే వుండేది. క్లాసే కాదు, మా సెక్షనే కూడా. చాలా బాగా మార్కులు వచ్చేవి. టీచర్లు అందరూ బాగా మెచ్చుకునే వారు ఆ అమ్మాయిని. అప్పుడప్పుడు నన్ను చక్కగా పలకరించేది కూడా. ఏడవ తరగతిలో సంస్కృతం వెలగ బెడదామని, నేను వేరే సెక్షనుకి మారాను. కానీ స్కూల్లో అప్పుడప్పుడు చూస్తూనే వుండే వాడిని కస్తూరిని. ఏడవ తరగతి కూడా చాలా బాగా చదివింది కస్తూరి. ఏడు తర్వాత హైస్కూలికి ఎనిమిదికి వెళ్ళాము. అక్కడ కస్తూరి మళ్ళీ మా సెక్షనే. ఏడవ తరగతిలో స్కూలు మొత్తానికి చాలా మంచి మార్కులు వచ్చాయని రక రకాల సబ్జక్టుల్లో కస్తూరికి మంచి ఫ్రైజులు వచ్చాయి. ఎనిమిదిలో కొంత కాలానికి పెద్ద మనిషి అయింది. పైట వేసుకుని వచ్చేది క్లాసుకి. ఆ రోజుల్లో ఎందుకో ఆ అమ్మాయి దిగులుగా వున్నట్టు వుండేది. ఎప్పుడూ అడగలేదు నేను. క్వార్టర్లీ లెక్కల్లో ఆ అమ్మాయికి సున్నా వచ్చింది. క్లాసులో ఎవరూ పట్టించుకోలేదు. నాకు మాత్రం చాలా ఆశ్చర్యంగా వుండేది. ఎనిమిదిలో కొలచిన కామేశ్వరి అని ఒక చాలా తెలివైన అమ్మాయి వుండేది. అన్ని ఫస్టు మార్కులూ ఆ అమ్మాయికే. తర్వాత కాలంలో కామేశ్వరి విశాఖ పట్నంలో మెడిసిన్‌ చదివి, తర్వాత ఎం. డి. చేసిందని, పెద్ద గైనకాలజిస్టు అయిందనీ విన్నాను. కస్తూరి మాత్రం చదువులో చాలా వెనక పడిపోయింది. ఎప్పుడూ చాలా దిగులుగా, ఎవరితోనూ మాట్టాడకుండా కూర్చునేది. పలకరించే ధైర్యం వుండేది కాదు నాకు. చివరికి ఎనిమిదో క్లాసు ఫెయిలు అయింది కస్తూరి. ఆ తర్వాత కస్తూరి స్కూలు మానేసింది. ఆమెని మళ్ళీ నేనెప్పుడూ చూడలేదు. ఆమె గురించి ఎప్పుడూ వినలేదు కూడా.
  పెద్దయ్యాక, ఏడవ తరగతిలో స్కూలు అంతటికీ ఫస్టు మార్కులు తెచ్చుకున్న ఆ అమ్మాయి, ఎనిమిది ఫెయిలు అవడం చాలా ఆశ్చర్యంగా వుండేది నాకు. బహుశా పేద కుటుంబం కావటంతో, పెద్ద మనిషి అవగానే చదువు మాన్పించి పెళ్ళి చేసేశారేమోనని అప్పుడప్పుడు అనుకునే వాడిని. ఏ విషయమూ కరెక్టుగా తెలియదు. ఇప్పటికీ కస్తూరిని తలుచుకుంటే, దిగులు వేస్తుంది. చాలా మంచిగా వుండేది. నెమ్మదిగా వుండేది. ఏమిటో జీవితాలు.
  మేము పేదరికంలో పడిపోయాక, నను చదువు మాన్పించి, ఏ సినిమా హాల్లోనో సైకిళ్ళు పార్కు చేసే పనిలో పెడదామా అని మా అమ్మా, నాన్నలు ఆలోచనలు చేసినట్టు గుర్తు. అప్పుడు నేను పదవ తరగతిలో వుండే వాడిని. మా అక్క మాత్రం, "వాణ్ణి చదువు మాన్పించద్దు, వాడు మగ పిల్లవాడు, వాడు చదువుకునేంత మనం చదివించాలీ, నేను వుద్యోగం చేస్తాను" అని అనేది. నన్నెక్కడ చదువు మాన్పిస్తారోనని ఒక రోజు నేను ఏడుస్తుంటే, "నువ్వు బాగా చదువుకో. నిన్ను నేను చదివిస్తాను. ఏదో ఒక ఉద్యోగం చేస్తాను" అని ఓదార్చేది. అప్పుడు అంత సున్నితంగా మా అక్క, మా పరిస్థితులు బాగు పడి, బాగా డబ్బు వచ్చేసరికి, చాలా బండగా తయారయిపోయింది. ఆ భర్త కూడా చాలా వరకూ కారణం లెండి. అదో మాయదారి జీవితం.
  మొత్తానికి కస్తూరి కధ ఇదీ నాకు గుర్తున్నంత వరకూ - kasturi

  ప్రత్యుత్తరంతొలగించు
 70. కస్తూరి పేరు వెనుక వున్నా కథ చదువుతుంటే చాలా బాధ కలిగింది. మనచుట్టూ రోజువారి జీవితంలో ఎంతోమంది ఇలా కుటుంబ ఆర్ధిక పరిస్థితులకు, సామాజిక కట్టుబాట్ల పేరుతొను తమ భవిష్యత్తు నాశనమయి మూగగా రోదిస్తూ రొటీన్ లైఫ్ కు బలయిపోతున్నారు. కస్తూరిని గుర్తుంచుకొని మీ ప్రొఫైల్ టైటిల్ గా పెట్టుకొని మాకు పరిచయం చేయడం చాలా టచింగ్ గా వుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 71. oremuna చర్చలోకి వచ్చినందుకు సంతోషం. ప్రవీణ్ రాసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోడు. ఇంతకు ముందు తిట్ల విషయంలో కుడా నేను వ్యతిరేకించాను. కులం వృత్తి సంబంధంగా ఏర్పడింది. తలమీద పాగానో, గోడుగుకో వున్న విలువ కాళ్ళ కింద చెప్పులకు కుడా వుంటుంది. దేని అవసరం దానిదే. మారిన నేటి పరిస్తితులలో బాతా కంపెని నుండి అనేక చెప్పుల తయారీ పరిశ్రమలలో బ్రాహ్మణులు కుడా అధిక శాతం మండే పనిచేస్తున్నారు. కావున నేడు చర్చను దళితుల ఆత్మా గురవ పోరాటం వైపుగా సాగిస్తే బాగుంటుంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 72. మంద కృష్ణ వాళ్ళ అబ్బాయి కూడా కాలేజిలో కులం పేరు చెప్పుకుని ర్యాగింగ్ కి గురైతే అప్పుడు మంద కృష్ణకి తెలివి వికసిస్తుంది, దళితులు కులం పేరు చెప్పుకుంటే ఎంత అవమానమో. ఇప్పుడు మాదిగ వాళ్ళలో ఎక్కువ మంది కుల వృత్తి చెయ్యడం లేదు. వాళ్ళు ఎక్కువగా వ్యవసాయ కూలీ పనులు చేసి సంపాదిస్తున్నారు. చెప్పులకి కూడా విలువ ఉంటుంది. అయినా మాది చెప్పులు కుట్టే కులం అని గొప్పగా చెప్పుకోవడం అనవసరమే.

  ప్రత్యుత్తరంతొలగించు
 73. Dear preveen sharma....
  for your kind information....reg. Madiga...
  u know they have....NAMES.....
  I DONT KNOW ANY THING WRONG WITH...TAGS...
  Caste..become an ornament for...so called upper cate..and woond for Marginalizwed...
  tyhey are asking for the causes and consequences..for that...
  they have every right to put their..Names...

  ప్రత్యుత్తరంతొలగించు
 74. గ్లోరీ కావాలనుకుంటే దళితులు కూడా పేరు చివర శర్మ, శాస్త్రి, ఆచార్య లాంటి టైటిల్స్ పెట్టుకోవచ్చు. మాదిగ వెంకయ్య తన పేరుని వల్లభాచార్యగా మార్చుకోవచ్చు, రెల్లి జంగయ్య తన పేరుని జగన్నాథ శాస్త్రిగా మార్చుకోవచ్చు. పేరు చివర మాల, మాదిగ, రెల్లి లాంటి టైటిల్స్ పెట్టుకుని కుల గౌరవం పొందుతామంటే అది సాధ్యం కాదు.

  ప్రత్యుత్తరంతొలగించు
 75. varma garu, virasam sabhyulai vundi ila samstha baita charcha cheyatm bhavyam kadandi. dayachesi charchanu stop chesi, blog nundi tolaginchandi

  ప్రత్యుత్తరంతొలగించు
 76. flowers bloom ్గారికి నమస్తే. పేరులో పూవులు వికసించాలని కోరుకున్న మీరు ఇలా రాయడం బాగోలేదు. ఈ చర్చలో ఎక్కడా విరసంపై విమర్శ్ లేదు. అలాగే సంస్థ్ బయట చర్చ భావ్యం కాదనారు. మనం చైనాలో లేము. కేంద్రీకృత ప్రజాస్వామ్యం స్వేచ్చగా అమలవుతున్న తీరు సంస్థలో లేదు. కొత్త నీరుకు అవకాశం లేదు. మరి ఇక్కడ జరిగిన చర్చలో ఎవరూ సంస్థపై పల్లెత్తు మాట అనలేదు. చర్చ ఇప్పుడు దళితవాదంపై జరుగుతోంది. వేయి పూలు వికసించనీయండి. ఇది తప్పైతే మీరు ఏ చర్య తీసుకున్న అనుభవించడానికి నేను సిధ్ధం. దీనివలన నాకొచ్చిన గొప్పతనమేమీ లేదు. ప్రశ్నించడాన్ని ఆహ్వానించలేదు మీరెప్పుడూ. ప్రశ్నించిన వారిని ఎవరిని మిగలనీయలేదు. మరిక్కడ మనం కోల్పోయేదేమిటి? మనది రహస్య సంస్థ కాదు కదా? జరగనివ్వండి.

  ప్రత్యుత్తరంతొలగించు
 77. విరసం వాళ్ళకి ఏమైనా రహస్య అజెండా ఉందా? వాళ్ళు మన కత్తి మహేష్ లాగ పైకి ఒకలా మాట్లాడుతూ లోపల మరో ఇంటెన్షన్ పెట్టుకునే రకమా? మరి అలాంటప్పుడు విరసం గురించి బహిరంగంగా చర్చిస్తే తప్పేమిటి?

  ప్రత్యుత్తరంతొలగించు
 78. కస్తూరి గారికి ఎదురైన అనుభవం నాకు కూడా ఎదురయ్యింది. మా బంధువు ఒకతను తన కూతురుని అసలు చదివించలేదు కానీ ఆమెని గవర్నమెంట్ ఉద్యోగికి ఇచ్చి పెళ్ళి చెయ్యాలనుకున్నాడు. వీరేశలింగం గారు, రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు పుట్టక ముందు ఇలాంటి వాళ్ళని చూస్తే ఆశ్చర్యం కలిగేది కాదు కానీ ఇప్పుడు కూడా ఇలాంటి వాళ్ళు ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

  ప్రత్యుత్తరంతొలగించు
 79. సందర్భం లేకుండా ఎక్కడ బడితే అక్కడ ఇకిలించేవాల్లని ఏమంటారు?

  ప్రత్యుత్తరంతొలగించు
 80. వేణు గోపాల్ డిలీట్ చేసిన వ్యాసం ప్లానెట్ లో కనిపిస్తుంది http://teluguwebmedia.net/planet/కడలితరగ నా ప్లానెట్ లో ఆర్కివ్స్ స్టోర్ చేసే సెట్టింగ్ పెట్టాను.

  ప్రత్యుత్తరంతొలగించు

ఆలోచనాత్మకంగా..