3, ఏప్రిల్ 2011, ఆదివారం

ఐ.సి.యు.లో దేవుడు???

గత నాలుగు రోజులుగా దేవుడుగా కొలవబడుతున్న సత్యసాయిబాబా ఆసుపత్రిలొ వైద్యుల పర్యవేక్షణలో వున్నారని వార్తలు వస్తున్నాయి. కృత్రిమ శ్వాశను అమర్చినట్టు వార్తలు... అలాగే ఆ ప్రాంతమంతా రక్షణ వలయంలో డి.జి.పి.గారి పర్యవేక్షణలో వుందని, ఏ క్షణం ఏ వార్త భక్తులను ఏ గుణానికి దారి తీయిస్తుందో తెలియక ఆందోళన పడుతున్నారని వింటున్నాం...

ఇప్పటికైనా మనిషిని మనిషిగా చూడాలని, దేవుణ్ణి చేయడం, మహిమల ద్వారా జనాన్ని తప్పుదోవ పట్టించడం కూడదన్న సత్యాన్ని గ్రహించాలి... ఇదేదో ఎవరో చెప్తే కానీ తెలియని వాళ్ళు కాకపోయినా మూర్ఖంగా దేశాధినేతల దగ్గరనుండి అంతా మూఢ విశ్వాశాలని వ్యాప్తిచేయడంలో తమ వంతు కృషి చేసారు....విశ్వాశం పరిమితికి మించితే అది మూఢత్వానికి పరాకాష్టగా మారుతుంది....

ఇక్కడ బాబా చేయించిన సామాజిక కార్యకలాపాలను చూడాలని కొంతమంది అనవచ్చు.. అది విశ్వాశాలను శాశ్వతం చేయడంలో భాగంగా చూడాలి... అదంతా ఆయన సంపాదన కాదు... ఆయనకు భక్తులు ఒనగూర్చినది అలా వినియోగించి తన్ను తాను భగవంతుడిగా కొలిపించుకునే దానిలో భాగం కావచ్చు...ఎందుకంటే ఆయనకు హారతులిచ్చి పాదాభివందనాలు చేయడం చూస్తున్నాం... ఇది కూడనిది...

కాస్తా శాస్త్రీయంగా ఆలోచించి మతం విశ్వాశం మాత్రమేనని, మనసుకు స్వాంతన చేకూర్చేంతవరకు దానిని పరిమితం చేసుకుంటే ఎవరికీ ఇబ్బందికరంగా మారదు... అది మూఢనమ్మకమైతే మనిషిని ఎదగనీయదు....


7 కామెంట్‌లు:

  1. విరాళంగా వచ్చిన డబ్బులతో సమాజ సేవ చెయ్యడం చాలా సులభం. జేబు నుంచి వంద రూపాయలు నోటు తీసి ఆపదలో ఉన్నవాడికి ఇవ్వమంటే ఎంత మంది ఇస్తారు? ఒకసారి మా మామయ్య గారి అబ్బాయికి నేను వంద రూపాయలు అరువుగా ఇచ్చాను. కానీ నేను దాన ధర్మాలు చేస్తున్నానంటూ మా నాన్నగారు నన్ను తిట్టారు. అరువు వేరు, దానం వేరు అని తెలిసినా ఆ విషయం తెలియనట్టు నటించి తిట్టారు. దేవుడి హుండీలో ఎంత డబ్బులైనా వేస్తారు కానీ పక్క వాడికి వంద రూపాయలు సహాయం చెయ్యమంటే చెయ్యరు.

    రిప్లయితొలగించండి
  2. ఐసీయూలో దేవుడు...?
    చాలా బాగా చెప్పారు.

    రిప్లయితొలగించండి
  3. ఐ సీ యు లో దేవుడు
    ...........................
    నేను చూశాను దేవున్ని
    మంచమ్మీదున్న వో ముసలివాన్ని
    అందరిలాంటి వాడే వాడు
    చావు పుట్టుకలకు అతీతుడు కాడు
    ఆరిపోయే దీపానికి భూమి నుంచి
    ఆకాశము వరకున్న వైద్యసేవలంట
    పట్టించుకోండ్రా పిచ్చిమంత్రులు
    చిన్నారి పసిగుడ్ల గుండెమంట
    భయపడకండర్రా!
    పిచ్చి వాడు దేవుడయ్యె దేశంలో
    పిచ్చివాళ్ళకు కొదవా ఈ సమాజములో
    దైర్యంగా వుండండర్రా !
    మీ పనులు మీరు చేసుకోండి
    మరో భేషైన పిచ్చాడ్ని తెచ్చే పూచి నాది

    రిప్లయితొలగించండి
  4. కెక్యూబ్ గారు చాలా బాగా చెప్పారు.

    రిప్లయితొలగించండి
  5. praveen garu "విరాళంగా వచ్చిన డబ్బులతో సమాజ సేవ చెయ్యడం చాలా సులభం"
    -- ఎంతమంది లంచాగొందిలు దానాలు చేస్తున్నారు? సమాజ సేవ చేస్తున్నారు. వాళ్ళకు కూడా ఫ్రీ గానే వచ్చిన డబ్బు కదా?

    రిప్లయితొలగించండి
  6. సాధారణ పౌరుడు గారు, ఓ ఇన్సిడెంట్ గురించి ఉదహరిస్తున్నాను. రాజమండ్రి దగ్గర ఒక లైసెన్స్ లేని అనాథాశ్రమాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పిల్లలని స్టేట్ హోమ్‌కి పంపించారు. అనాథాశ్రమం నిర్వాహకులని "illegal confinement of children" కేస్ కింద అరెస్ట్ చేశారు. అసలు ఏమి జరిగిందంటే ఆ అనాథాశ్రమం నిర్వాహకులు కేవలం విరాళాలు కోసం ఆశ్రమం పెట్టారు. విరాళాలు రాలేదని ఆ ఆశ్రమాన్ని సరిగా నిర్వహించలేదు. ముగ్గురు పిల్లలు ఆ ఆశ్రమం నుంచి పారిపోయిన తరువాత అసలు విషయం బయటపడింది. లంచాలు తీసుకునేవాళ్లు సమాజ సేవ కోసం లంచాలు తీసుకోరు కదా. ఇచ్చినవాడు చెప్పిన పని చెయ్యడానికి తీసుకుంటారు కదా. అందుకే వాళ్ళకీ, అనాథాశ్రమాలు లాంటివి నడిపేవాళ్ళకీ తేడా కనిపిస్తుంది.

    రిప్లయితొలగించండి

ఆలోచనాత్మకంగా..