2, మే 2011, సోమవారం

నువ్వొక్కడివే....
నిన్ను చంపేసామని
నువ్వు ఇంకలేవని
నీ నీడ మరి కనబడదని
నీ గొంతు వినబడదని
నీ భౌతిక కాయం సముద్రంలో కలిపేసామని
శ్వేత సౌధంలో ఈరోజు హాయిగా
కడుపునిండా తాగి నిదురోతున్నాడు...

భూమండలాన్నంతా చాపలా చుట్టి
తన చంకలో పెట్టుకున్నానని విర్ర వీగిన
హిరణ్యకశిపుడి డొక్కలో నీవు తన్నిన తాపుకు
వాడికి ఊపిరాడలేదిన్నాళ్ళు...

ప్రపంచాన్నంతా సరకుజేసి కట్టుకున్న
తన వ్యాపార మూల స్తంభాలు కూల్చిన
నీ నేర్పరితనం జూసి వాడి కాళ్ళ కింద నేల నెర్రెలు బారింది...

వాడి సాంకేతికత అంతా ఒట్టి
పటాటోపమేనని నిరూపించావొక్కడివే...

ప్రాణ భయంతో కలుగులో దూరిన వాడి
మొఖం చూసిన క్షణం బడుగు జనాల
గుండె మూడింతలయ్యిందన్నది ముమ్మాటికీ నిజం...

వాడి గుండెల్లో పరిగెత్తిన విమాన రొద
ఎప్పటికీ విజయ చిహ్నమే...

నిన్ను పట్టుకున్నామన్నది
వాడి గొప్పతనంకాదని ఎవడో యూదా కావచ్చు
లేక బ్రూటస్సో లేక కత్తుల సమ్మయ్యో కావచ్చు
నీ ఆనుపానులు చెప్పిన తల్లి కడుపులో
చెయ్యి పెట్టిన ద్రోహి...

నువ్వు చేసింది తప్పనిపించలా ఇప్పటికీ...

కానీ
నువ్వు లేవన్నది మింగుడుపడట్లేదెందుకో....

5 వ్యాఖ్యలు:

 1. (Long live the spirit of Anti Americanization)
  nijam gaa mee bhavana adbhutham ..piriki pandhala america

  ప్రత్యుత్తరంతొలగించు
 2. రెండు నాల్కల అమెరికా - సామ్రాజ్యవాదాన్ని ఎండగట్టడంలో మీరెప్పుడూ ముందే వుంటారు. మీ పోరాటం నిజమైనది కూడా . లాడెన్ మంచివాడా ? టెర్రరిస్టా అన్నది తరువాత విషయం . అమెరికా యిలా చేయటం సమంజసమా ! కాదా ? అన్నది యిప్పటి చర్చనీయాంశం. కొంతామంది వ్యక్తులనూ, కొన్ని జాతులను , కొన్ని రాజ్యాలను టార్గెట్ చేసుకుని అమెరికా చేస్తున్న దమన కాండను అందరం గర్హించాలి.
  ఆ పనిని మీ కవితతో దునుమాడినందుకు అభినందనలు కుమార్ వర్మ గారు.
  మీ కలం ఖడ్గమై శత్రువు గుండెల్లో దిగబడింది.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. వస్తువు మీ కలాన్ని పదునెక్కించింది.అభినందనలు...
  అమెరికా సామ్రాజ్యవాదానికి కరుడు కట్టిన మత తత్వం సమాధానం కాదు కదూ వర్మగారూ......

  ప్రత్యుత్తరంతొలగించు
 4. malliగారు లాడెన్ కరడు కట్టిన మత తత్వాన్ని ప్రదర్శించలేదనుకుంటా? జీవిత కాలం అమెరికా దురహంకారానికి వ్యతిరేకంగా పోరాడాడె తప్ప ముస్లిం మత చాందస వాదాన్ని ప్రచారం చేయలేదు.. చివరి క్షణం వరకు తన కలాష్నికోవ్ కు పనిచెప్పాడు...

  ప్రత్యుత్తరంతొలగించు
 5. ప్రతాప్ మరియు యోహాన్ గార్లకు ధన్యవాదాలు...

  ప్రత్యుత్తరంతొలగించు

ఆలోచనాత్మకంగా..