6, ఆగస్టు 2009, గురువారం

నాటో - మానవ హనన రాకాసి


ఆఫ్ఘనిస్తాన్ లో నేడు పర్యటిస్తున్న నాటో అధిపతి రామ్సుస్సేన్ దేశంలో సామాన్య జనం హతులవకుమ్డా చూస్తామని హామీ ఇచ్చాడు. అసలు వాళ్ల దేశంలో అడుగు పెట్టి వాళ్ల ప్రాణాలకు వీడు హామీ ఇవ్వడం ఏమిటి? భూమండలంలోనే స్వతంత్ర దేశం లేకుండా చేస్తున్న అమెరికా వాడికి వత్తాసుగా ఏర్పడిన దుష్ట కూటమి ఆగడాలకు అంతులేకుండా పోయింది. ఇటివలి రాకెట్ దాడులలో ఇద్దరు చిన్న పిల్లలు, ఒక పెద్దాయన్ చనిపోయారని వారి పార్ధివ శరీరాలను బహిరంగంగా చూపించినా అలాంటిదేమీ లేదని బుకాయి౦చుతున్నారు వీళ్ళు. ముస్లిం సమాజాన్ని ఉగ్రవాదులుగా ముద్ర వేసి వారిని సమూలంగా నాశనం చేసి వారి ప్రాకృతిక హక్కైన చమురు సంపదను దోచుకునే కుట్రలో భాగంగా జరుగుతున్నా మానవ హననమిది. వాడి మోచేతి నీళ్ళకి ఆశపడి మాత్రు దేశాన్ని తాకట్టు పెట్టె పాలక వర్గాల వత్తాసుతో వాడి దౌష్ట్యాన్ని నిరాటంకంగా కొనసాగిస్తున్నాడు. ఇరాక్ యుద్ధం నాటినుండి పాలస్తీనా దురాక్రమణ వరకు లక్షలాది మంది అభాసుభం తెలియని పసివాల్లతో సహా హతమైన క్రూర దాడులకు గుణపాఠ౦గానే సెప్టెంబర్ దాడులు జరిగాయి. దాంతో సాకుతో మరింతగా రెచ్చిపోయి దాడులు చేస్తూ ఆఫ్ఘనిస్తాన్ దేశాన్ని నామ రుపాల్లెకుండా బాంబింగ్ చేస్తున్నాడు. వాడి తొత్తు కర్జాయిని అధ్యక్ష స్థానంలో కూచోబెట్టి ప్రజలను ప్రేక్షకులను చేసాడు. ప్రజాస్వామ్య వాదులు అమెరికన్ దౌష్ట్యాన్ని ఖమ్దిచాల్సిన అవసరముంది. ఆఫ్ఘన్ ప్రజల పోరాటాలకు మద్దతు తెలియచేయాలని కోరుతున్నాను.

8 కామెంట్‌లు:

  1. వియత్నాం యుద్ధంలో యాభై లక్షలు, కొరియా యుద్ధంలో నలభై లక్షలు, ఇరాక్ యుద్ధంలో పది లక్షలు పైనే. కేవలం మూడు దేశాలలో కోటి మందికి పైగా జనాన్ని చంపారు అమెరికా సామ్రాజ్యవాదులు.

    రిప్లయితొలగించండి
  2. >> "వారి ప్రాకృతిక హక్కైన చమురు సంపదను దోచుకునే కుట్రలో భాగంగా జరుగుతున్నా మానవ హననమిది"

    ఆఫ్ఘాన్‌లో చమురెక్కడిది!

    మీరు సమస్యలో రెండో కోణం చూడటం లేదు. అమెరికా అడ్డు లేకపోతే పరిస్థితి ఇంకా దారుణంగా ఉండేది. ఈ గొడవలన్నీ మొదలెట్టింది అమెరికానే కదా అంటారేమో. కావచ్చు. కానీ అప్పుడు మిగిలినోళ్లందరూ చోద్యం చూసినోళ్లే, అవకాశమొస్తే తామూ ఓ ముక్క గుంజుకుందామని గోతికాడ నక్కల్లా కాపేసినోళ్లే. వాళ్లకి ఇప్పుడు అమెరికాని విమర్శించే హక్కెక్కడిది?

    @ప్రవీణ్ శర్మ:

    లెక్కలు బాగానే చెబుతున్నారు. మరి హిట్లర్‌తో పోటీ పడి మీ కామ్రేడ్ జోసఫ్ స్టాలిన్ సాగించిన నరమేధం, యూదుల్ని కోయించిన ఊచకోత, వాటిలో బలైన లక్షలాదిమంది లెక్కలూ చెప్పండి. పోయినేడాది ప్రపంచం మొత్తమ్మీద యాభై దాకా దేశాల్లో మూడువేల ఏడువందల మంది దాకా ఉరి తీయబడితే, అందులో మూడు వేల మందికి పైగా మీ 'ఎర్ర చైనా'లోనే ఉన్నారు. కరడుగట్టిన మతవాదులు రాజ్యమేలే ఇరాన్‌లో సైతం ఈ సంఖ్య ముప్పైకి మించలేదు. దీన్ని ఏ వాదమంటారు?

    రిప్లయితొలగించండి
  3. అఫ్ఘనిస్తాన్ లాంటి దేశాలలో లో మెక్ డొనాల్డ్స్ కంపెనీకి ఆవుల ఫారంలు ఉన్నాయి. మెక్ డొనాల్ద్స్ కంపెనీ వల్ల అఫ్ఘనిస్తాన్ లో గడ్డి కూడా తరిగిపోయిందని వార్తలొచ్చాయి.http://www.nostatusquo.com

    రిప్లయితొలగించండి
  4. abrakadabra gaaru
    telugulO post copy kaavadam ledu. afghanistaanlo chamuru nilvalu lekapoyinaa arabik desaalapai daadulaku paakistaan, afghanistaan iraan la gumdaa oka maargam veyadaaniki amerika vaadu root map tayaru chesukunnaadu. idi naati patrikalalo kuda vachchmdi. rahyaanu edurkone kramamlo akkada nedu ugravaadulugaa pilavabadutunna muthala chetiki aayudhaalu ichchimdi amerikaa vade kada?

    com.stalin rashyaalO naadu aa charya teesukokapote aa 50 yellu kuda soviet raajyam vumdedi kaadu. appatike jaar anukula vyaapara vargaalu com .lenin pai hatya yatnam chesaayi.
    romdo praoamcha yuddhamlo rashyaa chEsina tyaagam marevaru cheyaledu. 10 lakshala mamdiki paigaa prajalu sainyamlo swachchamdamgaa cheri poraadaaru. vaari nettuti tyaagam faasijaanni amtam chesimdi. amreikaa vaadu tana aayudhaalanu ammukunenduku choosaadu tappa mumdu faasist kutamiki vyatireka charyalevi teesukoledu. charitralo ivanni nedu maruguna padipotunnayi.

    chainalo amtaara, akkada soshalijam peruto vyaapaarulu paripaalistunnaaru. com.mao taruvaata akkada soshalistu prabhutvam ledu, niyamtala raajyam ayimdi.

    రిప్లయితొలగించండి
  5. @వర్మ:

    రెండో ప్రపంచ యుద్ధంలో రష్యన్ల త్యాగాలు నాకెరికే. ఆ విషయమ్మీద అప్పుడెప్పుడో నా బ్లాగులో ఓ టపా కూడా రాశాను: ముంగిట్లో శత్రువు.

    రిప్లయితొలగించండి
  6. మనిషి యొక్క కక్కూర్తి ఇటువంటి సమస్యలకు దారితీస్తుంది. సమస్యను చర్చించడం మాని, దాని పరిష్కారం కొరకు ఆలోచిస్తే లాభముంటుంది. మన చర్చలను ఈ కోణంలో సాగిస్తే బాగుంటుందని నా భావన.

    రిప్లయితొలగించండి
  7. చర్చ లేకుండా విషయంపై అవగాహన సాద్యమా? అవగాహన లేకుండా సమస్య మూలాలను గుర్తించకుండా పరిష్కారం సాద్యం కాదని నా భావన. మీ అమూల్యమైన కాలాన్ని ఇలా వెచ్చించి చర్చలోనికి వచ్చినందుకు థాంక్స్.

    రిప్లయితొలగించండి
  8. నాజీ జెర్మనీ తరువాత రెండవ పెద్ద టెర్రరిస్ట్ దేశం అమెరికాయే. సామ్రాజ్యవాద చరిత్ర తెలిసిన వాళ్ళెవరికైనా ఈ విషయం అర్థమైపోతుంది.

    రిప్లయితొలగించండి

ఆలోచనాత్మకంగా..