15, ఆగస్టు 2009, శనివారం

స్వాతంత్ర్యం వచ్చెననీ..


స్వాతంత్ర్యం వచ్చెననీ సభలేచేసి
సంబరపడగానే సరిపడదోయీ...
అన్న ఘంటసాల గానామృతం నేటికీ చెవుల్లో మారుమ్రోగుతూ తట్టిలేపుతోంది. నిజానికి మనకు వచ్చింది స్వాతంత్ర్యమేనా? అధికార మార్పిడి జరిగి తెల్లదొరలు తెరచాటుకు పోయి నల్లదొరల సామంత రాజ్యం ఏర్పడింది. నేటికీ కొనసాగుతున్న కుల మత వివక్షలు, దిన దిన ప్రవర్ధమానమవుతున్న ధనిక పేద అంతరం, సామాజిక సంక్షోభానికి మన పాలక వర్గాల స్వార్ధ పూరిత వ్యాపార రాజకీయాలు, సామాన్య జనాన్ని రోజు రోజుకు మరింత అట్టడుగు స్థాయికి నెట్టివేస్తున్న వైనం కళ్ళముందు కదలాడుతున్నాయి. భద్రమయ జీవితానికి అలవాటు పడిన మధ్యతరగతి ప్రజానీకానికి నిదుర లేకుండా చేస్తున్న ఆర్ధిక మాంద్యం, జీతాల జీవితాన్నుండి బయటకు నెట్టివేస్తున్న క్రమంలో రోడ్డునపడక తప్పడంలేదు. ఇన్నాళ్ళు మన కడుపులో చల్ల కదలకుండా వుందికదా అని సామాజిక బాధ్యత లేకుండా గడిపిన వారు నేడు తప్పక ప్రశ్నించాల్సిన స్థితి. రోజూ జరుగుతున్న రైతన్నల ఆత్మహత్యలు మన ఆహార సంక్షోభాన్నే కాదు మన జీవన దారిద్ర్యానికి కూడా గుర్తు. ఇవన్నీ పట్టని మన యువతరం పభ్ ల వెనక, మగధీర విజయానందంలో కొట్టుకు పోతుంటే మన పాలక రాజావారు తమ గనుల-మణుల వ్యాపారాలు సజావుగా చేసుకుపోతూ ఎక్కడ చిన్న ధిక్కార స్వరం వినిపించినా ఎన్ కౌ౦టర్లు చేయిస్తూ అధికారాన్ని చిరునవ్వులు చి౦దిస్తూ ఎ౦జాయి చేస్తున్నారు. మరి మనం.....?

7 కామెంట్‌లు:

  1. పాలకుల దృష్టిలో స్వాతంత్ర్యం అంటే బిర్యానీలు భుక్కి, కొవ్వూ, కండకావరం పెంచుకునేవాళ్ళకి స్వాతంత్ర్యం. అంతే కానీ పేదవాళ్ళకి స్వాతంత్ర్యం కాదు.

    రిప్లయితొలగించండి
  2. యువతరం మొత్తం పబ్‌ల చుట్టూ, మగధీర విజయానందంలో మునిగి తేలుతున్నయి అని అనడం సబబు కాదు. ఇది మీడియా యొక్క ఓవర్‌హైప్ అని చెప్పవచ్చు. దేశం పట్ల, దాని బాగోగుల పట్ల శ్రద్ధ కలిగిన యువత సరైన మార్గనిర్దేశనం లేక వారి శక్తిని బయటపెట్టడం లేదు. మరి మనం.......? అన్న దానికి సరైన సమాధానం మన రాజకీయ వ్యవస్థ యొక్క ప్రక్షాలనకు పూనుకోవడం. మీ మాటలు నా ఆవేదనను అద్దం పడుతున్నాయి. ఇది కేవలం నా ఒక్కడి ఆవేదన అని అనడం కన్నా, నిజమైన భారత ప్రజానికం యొక్క ఆవేదన అని చెప్పవచ్చు.

    రిప్లయితొలగించండి
  3. ఎవరో ఒకరు ఎపుడో అపుడు నడవరా ముందుకూ అటో ఇటో ఎటో వైపు.

    రిప్లయితొలగించండి
  4. వర్మ, నిక్కచ్చైన సాలోచన. నా "స్వతంత్ర భారతి - స్వేఛ్ఛాగానం" కవిత, వ్యాఖ్యగా వ్రాసిందదే. ఆలోచనకి ఆచరణకి ఆశయాలకి నడుమ అంతరం తొలగాలి. మనం అన్నది మరింత బలోపేతం కావాలి. అపుడీ సంవేదనలు తొలగుతాయి.

    రిప్లయితొలగించండి
  5. ప్రవీణ్ గారు నిజం చెప్పారు.
    సాయి ప్రవీణ్ గారు కొంతమంది యువకులు ముందు యుగం దూతలు అన్న మహాకవి వాక్యం నిజమే కదా? లేకపోతే ఇలా అయినా ఉండేవాళ్ళమా?
    మహేష్ గారు ఎవరో ఒకరు మనం కాకూడదా?
    ఉషా మేడం ఇన్నాళ్ళకు నా అభ్యర్ధనను మన్నించి మాట పంచినందుకు చాలా సంతోషం...

    రిప్లయితొలగించండి
  6. పబ్ కల్చర్ హైదరాబాద్ విషయంలో నిజమే. విజయనగరం, సాలూరు, పార్వతీపురం, శ్రీకాకుళం, పాలకొండ, పలాస లాంటి పట్టణాలలో మాత్రం సినిమాల పైనే క్రేజ్ ఎక్కువ. ఈ మధ్య సాలూరు థియేటర్ లో చిరంజీవి అభిమానులు టికెట్ల కోసం తొక్కిసలాడుకుని ఐదుగురి చావుకి దారి తీసిన వార్త చదివే ఉంటారు.

    రిప్లయితొలగించండి

ఆలోచనాత్మకంగా..