2, ఫిబ్రవరి 2010, మంగళవారం
రెహమాన్ అవార్డుల వెనక
ఇటీవల ఏ సంగీత పోటీలలో చూసినా రెహమాన్ కంపోజ్ చేసిన పాటలకు అవార్డుల పంట పండుతోంది. ఆస్కార్ దగ్గరనుండి గ్రామీ అవార్డులవరకు ఆయన కంపోజ్ చేసిన 'జయహో' కు అవార్డులమీద అవార్డులు వచ్చేస్తున్నాయి. రెహమాన్ జయహో అంటున్నది సామ్రాజ్యవాద శక్తులకు కనుకే ఈ అవార్డుల పంట పండుతున్నది. మొన్నటికి మొన్న ఆస్ట్రేలియా వెళ్ళి అక్కడ నుండి తిరిగి వచ్చాక మన వాళ్ళపై జరుగుతున్న దాడులగురించి మాట్లాడుతూ అవి జాత్యాహంకార దాడులు కావని వాళ్ళకు వత్తాసు పలికాడు. పెట్టుబడిదారీ శక్తులకు అనుకూలంగా తీసిన స్లమ్ డాగ్ మిలియనీర్ సినిమాకు అవార్డులు పండాయి. అలాగే వారికి జయహో అన్నందుకు ఈయనకు అవార్డులు కురుస్తున్నాయి. అందాల పోటీలలో మన అమ్మాయిలకు మిస్ యూనివర్శ్ లు, మిస్ వరల్డ్ లు ఇచ్చి తమ సౌందర్య సాధనాలకు 3 వ ప్రపంచ దేశాలలో గిరాకీ పెంచుకున్న పశ్చిమ దేశాల వ్యాపారుల కుట్ర దాగివున్నట్లే దీనివెనక కూడా వారి ప్రమేయం వుంది. 'జయహో' వీడియో ఆల్బం లో డాన్సులు చేసే అర్థనగ్న సుందరీమణులు ఎవరికి జయహో అంటున్నారు?
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
రెహ్మాన్ పుట్టుకతో డబ్బున్నవాడు కాదు. పేదరికం వల్ల హిందూ మతం నుంచి ఇస్లాం మతంలోకి మారిన కుటుంబంలో పుట్టాడు. నడమంత్రపు సిరిలా డబ్బులు వచ్చిన తరువాత సామ్రాజ్యవాదుల భక్తుడయ్యాడు.
రిప్లయితొలగించండిఓహో! అలాగా?! అలా ఐతే ఇహనేం , తమకు కిటుకు తెలిసిపోయింది. ఇక వచ్చే ఏటి నుంచి అవార్డులు మీవే! :)) :P
రిప్లయితొలగించండి