ఈ దేశంలో పుట్టి పెరిగినవారు ఒక ప్రాంతంనుంచి వేరొక ప్రాంతానికి వెళ్ళడానికి భయపడేట్లు, వారి ఉనికినే ప్రశ్నార్థకం చేయడం భావ్యమా? మనమున్నది ప్రజాస్వామ్య గణతంత్ర ఫెడరల్ దేశంలోనా, లేక మత, ప్రాంతీయ, భాషాపరంగా విడగొట్టబడిన నేలమీదా?
తాను స్పాన్సర్ చేస్తున్న 20-20 టీం వలన ఇప్పటికే కోట్లాది రూపాయలు నష్టపోయిన కారణంగా, మొన్న జరిగిన క్రీడాకారుల వేలంపాటలో పాకిస్తానీ క్రీడాకారులను ఎవరూ కొనుక్కోకపోవడం గురించి మాట్లాడుతూ వారిని కూడా భాగస్వాములను చేసి వుంటే బాగుండేదన్న కారణంగా ఒక కళాకారుడిగా ఎక్కడా తన దేశభక్తిని శంకించేలా ప్రవర్తించని షారూఖ్ ఖాన్ పట్ల శివసేన తీవ్రంగా విరుచుకుపడడం చూస్తుంటే ముంబయి థాకరే దాదాల స్వభాషా, ప్రాంతీయ,మత దురభిమానం తారాస్థాయికి చేరుకొని అదొక పిచ్చివాళ్ళ రాజ్యంగా మారిందా అనిపిస్తోంది.
షారూఖ్ తండ్రివైపు తాత స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొన్నవాడే. తల్లిగారి తండ్రి నేతాజీ నేతృత్వంలో అజాద్ హింద్ ఫౌజ్ లో జనరల్ గా పనిచేసిన వారు. భారత్-పాక్ విభజనకాలంలో భారత్ వలస వచ్చిన కుటుంబం యొక్క దేశభక్తిని శంకించే మూర్ఖశిఖాణులను ఏమనాలో తెలియడంలేదు. తన స్వదేశ్, చక్ దే ఇండియాల వంటి సినిమాల ద్వారా దేశభక్తిని చాటిన షారూఖ్ ఎందరో క్రీడాకారుల్లో స్ఫూర్తిని రగిలించాడు.
మొన్నటికి మొన్న మన క్రికెట్ వీరుడు మాస్టర్ బ్లాస్టర్ సచిన్ నేను ముందు భారతీయుడిని, తరువాత మరాఠీనన్నందుకు తీవ్రంగా విరుచుకుపడ్డారు.
ప్రఖ్యాత చిత్రకారుడు M.F.హుస్సేన్ వేసిన బొమ్మలపై నిషేధం విధించి తనకు తాను దేశం వదిలివెళ్ళేట్లు చేసారు. తన చిత్రాలలో హిందూ దేవతలను నగ్నంగా చిత్రీకరించారని ఆరోపణ. మరి మన దేవాలయాలపై బూతుబొమ్మలు ఎవరివి?
ఇలా కళాకారులపై, వారి స్వేచ్చపై ఆంక్షలను విధిస్తూ, ఫత్వాలను జారీచేస్తూ, ఇప్పటికి గత 15 ఏళ్ళూగా అధికారానికి ప్రజలు దూరంచేసినా, తమ ప్రైవేటు సైన్యాలతో దాడులు చేస్తూ, విపరీత ధోరణితో విఱవీగే ధాకరేలకు ప్రజలే తగిన బుద్ధి చెప్పాలి.
తాజాగా రాహుల్ గాంధీ ముంబయి పర్యటన కూడా భయం భయంగా హెలికాప్టర్ తో చేసే దుస్థితి కల్పించినట్లు వార్తలు చెప్తున్నాయి.
తమ స్వలాభం కోసం యిలా కుల, మత, ప్రాంతీయ తత్వాలను రెచ్చగొట్టే వారికి తగిన మానసిక చికిత్స అవసరం.
మరి మన దేవాలయాలపై బూతుబొమ్మలు ఎవరివి?
రిప్లయితొలగించండి___________________________________
అవి మన దేవతలవి కావు. సామాన్య మానవులవి. మరో విషయం - హుస్సేన్ తనంతట తానే పారిపోయాడు - ఇక్కడ ఉండి కోర్టు కేసులనెదుర్కోలేక - శివసేన భయమే అయితే దేశం వదిలిపోవక్కరలేదు - మహరాష్ట్ర వదిలితే సరిపోయేది.
But one thing -పాకిస్థాన్ తీవ్రవాదుల మీద ఉన్న కోపాన్ని పాకిస్థాన్ క్రీడాకారులమీద చూపించవచ్చా అంటే .. ఏమో? నా దగ్గరయితే సమాధానం లేదు.
రిప్లయితొలగించండి