28, ఫిబ్రవరి 2010, ఆదివారం
విద్యార్థుల భవిష్యత్ తో చెలగాటమా?
ఉస్మానియా విద్యార్థులపై మావోయిస్టు ముద్ర వేయడం ద్వారా ప్రభుత్వం తన తప్పిదానిని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. ఇది తీవ్రంగా ఖండించాల్సిన విషయం.
దేశ అత్యున్నత న్యాయస్థానంలో ఎదురైన పరాభవానికి విద్యార్థులపై మావోయిస్టు సానుభూతిపరులంటూ పోలీసులు ఇచ్చిన రిపోర్టును యదాతధంగా సమర్పించడం ద్వారా ప్రభుత్వం తన దమననీతిని మరో మారు నిస్సిగ్గుగా బయటపెట్టుకుంది. సుప్రీం ధర్మాసనం వేసిన తీవ్రమైన ప్రశ్నలకు సమాధానం దొరకక తత్తరపడింది. సానుభూతిపరులైనంత మాత్రాన నేరస్తులుగా పరిగణిస్తారా? అని సూటిగా ప్రశ్నించింది. జరిగిన విధ్వంసంను కారణంగా చూపగా నక్సలైట్లను అణచివేసేందుకు మీరు తర్ఫీదునిచ్చిన తోడేళ్ళగుంపును యిలాగే రాజకీయపార్టీల సభలకు, ప్రచారాలప్పుడు వాడుతారా అని ముక్కుపై గుద్ది ప్రశ్నించింది.
సిగ్గు తెలీని పాలకవర్గం యింకా ఏ ముఖం పెట్టుకొని ఓట్లకోసం యీ పిల్లల తల్లిదండ్రులదగ్గరకు పోగలదు?
తెలంగాణా ప్రాంత ప్రజల భావావేశాలకు, ఉద్విగ్నతకు ప్రతిస్పందనగా, గుండెచప్పుడుగా మారిన ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని, రాష్ట్ర రాజధాని నడిబొడ్డున వున్నదానిపై ఒక నక్సల్ స్థావరంగా పేర్కొనడం పాలకవర్గ కుట్రకాకపోతే మరేంటి? వారి నిఘావర్గాలు ఏ రాజకీయ నాయకులు విదిలించే ఎంగిలాకుల వెంట తిరుగుతున్నాయో? ఏదైనా విపత్తు సంభవించాక అమాయకులను వేధించడం తప్పించి అసలు నేరస్థులను యింతవరకు పట్టుకున్న దాఖలాలు లేవు. ఎంతో మంది తల్లుల ఉసురు పోసుకున్న వీళ్ళకు యిదేం పోయేకాలం?
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
http://telingana.wordpress.com/2010/02/27/ఊహకందనంత-బలవంతులు-తెలంగా/
రిప్లయితొలగించండిఊహకందనంత బలవంతులు తెలంగాణకు శత్రువులు....
రిప్లయితొలగించండిఊహకందనంత బలవంతులు తెలంగాణకు శత్రువులు....
రిప్లయితొలగించండినాకర్ధంకాని విషయం ఏమిటంటే, "ప్రత్యేక తెలంగాణా"కు వందేళ్ళ పార్టీ నుంచి నిన్న మొన్నటి ప్రజారాజ్యం వరకు ఏకాభిప్రాయం అవసరం అనే పెద్దమనుషులు, మావోయిస్టుల అభిప్రాయాల గురించి పల్లెత్తు మాట అడగరే?
రిప్లయితొలగించండి''వారి నిఘావర్గాలు ఏ రాజకీయ నాయకుల పెళ్ళాల వెంట తిరుగుతున్నాయి?'' నిఘా వర్గాల వైఫల్యాలను చాటడానికి మీరు ఇంకో ప్రతీకను వాడి ఉంటే బాగుండేదేమో.. ఇది కాకుండా మిగతా మీ వ్యాసంతో పూర్తిగా ఏకీభవిస్తున్నా. ఉద్యమాల పట్ల, ప్రత్యేకించి వామపక్ష ఉద్యమాల పట్ల నిఘా వర్గాల నివేదికలు ఇటు రాష్ట్ర్రాల స్థాయిలో, అటు కేంద్ర స్తాయిలోను అన్ని సందర్భాలలో ఇలాగే ఉంటాయని మీకూ తెలుసనుకుంటాను. సుప్రీంకోర్టులో ఇరకాటంలో పడి రాష్ట్ర ప్రభుత్వం తన పరువూ, నిఘావర్గాల పరువూ టోకున బజార్లో పడవేసుకుంది కానీ, అన్ని సందర్బాల్లో వీటి వైఖరి ఇదే. 1970లలోనే తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం భావనను అప్పటి నక్సలైటు పార్టీలు పూర్తిగా సమర్థించాయి. వాళ్లు తమ వైఖరిని ఏరోజూ దాచి పెట్టుకోలేదు. ఈరోజు ప్రభుత్వం, నిఘావర్గాలు పనికట్టుకుని చెబితే తప్ప బహిర్గతం కాని దుస్తితిలో నక్సలైటు పార్టీల ఆచరణ లేదనుకుంటాను. అయితే ఉస్మానియాను మావోయిస్టుల కేంద్రంగా ఆరోపించడంలో రాష్ట్రం, కేంద్రం రెండింటిలో ఉన్న పాలకవర్గాల కుట్ర దాగి ఉందనడంలో సందేహమెందుకు?
రిప్లయితొలగించండిఅభినందనలు
నాకు రాస్తున్నప్పుడు కలిగిన కోపంలో అలా రాసేసాను. తప్పక సరిదిద్దుకుంటాను. యిది మొత్తంగా పాలక వర్గాల కుట్రే. వాళ్ళ పేరుచెప్పి మొత్తం ఉద్యమాన్ని అణచే కుట్ర దాగివుంది. ఆత్మబలిదానాలతో అటు విద్యార్థులు చేస్తున్న త్యాగాలను మరుగునపెట్టేందుకు ఈ రకంగా కేసులతో, తప్పుడు రిపోర్టులతో తీవ్రమైన నిర్బంధంతో తెలంగాణా గొంతునొక్కాలని చూస్తున్నారు. యిది అమానుషం.
రిప్లయితొలగించండిమీ స్పందనకు ధన్యవాదాలు..