16, ఫిబ్రవరి 2010, మంగళవారం

జయేంద్రా మీకెందుకీ గొడవ?


హాయిగా బొజ్జనిండా తిని, తోచినదేదో ఉపదేశాలిస్తూ, వచ్చిన కట్న కానుకలతో జల్సాచేస్తూ, కాలక్షేపం చేయక చైన్నై రాజకీయాలతో చేతులు కాల్చుకొని, కటకటాలు లెక్కపెట్టి, చావుతప్పి కన్నులొట్టపోయిన చందాన బయటపడిన మీరు ఇక్కడి ఉద్యమాలపై ప్రజల ఆవేశాలను రెచ్చగొట్టేలా మాట్లాడడం ఎవరిని మెప్పించడానికి? వేసుకున్న కాషాయ వస్త్రాలపై వున్న గౌరవం మీలాంటి వారి వల్లనే మట్టిగలిసిపోయాయి. రాజకీయాలు మీకెందుకు? మీరేమైనా దివ్యదృష్టితో తెలంగాణా ప్రజల మనోభావాలను హాంఫట్ అని పట్టేసారా? తెలంగాణా భూమిలో పర్యటించి, వారితో మాటాడి అక్కడే ప్రకటించి వుంటే మేమంతా నమ్మేవారం. హాయిగా యికనైనా ఏసీ రూంలలో జపతపాలు గావించి తమ ముక్తిమార్గమేదో మీరు చూసుకుంటే మీకు ప్రశాంత స్వర్గ ప్రాప్తినొంది అక్కడకూడా సుఖాలను అనుభవించే చాన్సుకోసం ట్రై చేయండి స్వామి. పుణ్యం పురుషార్థం దక్కుతాయి. మీకెందుకీ గొడవలు?

6 వ్యాఖ్యలు:

 1. By the way, what happened to the human rights of the Jawans killed in the West Bengal attack? Why is no Humanrights activist talking about them?

  ప్రత్యుత్తరంతొలగించు
 2. జయేంద్ర సరస్వతి వంటి సాములోర్లు పచ్చగా పసిడిగా వర్దిల్లేది రాజకీయాల పున్యాన్నే కదా.
  ఒక వర్గం దాడి చేస్తే మరో వర్గం కొమ్ము కాస్తుంది.
  మొత్తమ్మీద రాజకీయాలు, రాజకీయ నాయకుల ప్రాపకం అండ దండలు వారికి శ్రీరామ రక్ష.
  ఇక నాలుగు కాసులు గిట్టు బాటవుతాయనే ఆయన గుంటూరులో సమైక్య పల్లవి అందుకున్నాడు.
  తెలంగాణా పల్లవి అందుకుంటే చిల్లి గవ్వ రాదు ... పైగా గుంటూరోల్లు గోచి ఊడబీకి పంపించి వుండే వారు.
  ఇదీ అసలు రగస్యం.

  ప్రత్యుత్తరంతొలగించు
 3. @malak,
  perfect question bro!
  @author..
  any answer to malak's question?

  i'm just wondering what would be your reaction had 20 naxals been killed by police..

  ప్రత్యుత్తరంతొలగించు
 4. Who are you question his freedom of speach? Should all Indians say ' Jai Telangana'?!! Don't you think you guys are idiotically fanatic? :)

  ప్రత్యుత్తరంతొలగించు
 5. Mr.S. Who haves stupid fanatics? ఆశ్రమాలలో బ్లూ ఫిల్ములు చూస్తూ, హత్యానేరాలలో భాగం వున్నవాడి కాళ్ళు కడిగి నెత్తిన పోసుకుంటున్నవారా? ఈ జయేంద్రే కాదు మీ పేరుగాంచిన అన్ని ఆశ్రమాలలో హత్యాకాండలు జరిగాయి. వాటిని మతం అడ్డుగా చూపి కనీసం విచారణకూడా చేపట్టని ఈ పాలనా వ్యవస్థదా? మీకు ప్రశ్నించే వాళ్ళపై ఎందుకు యింత అసహనం. మొదటినుండి రాజకీయ దురద కలిగిన జయేంద్ర ఆ రంగు బట్టలొదిలి రాజకీయ మోక్షం కోసం ప్రయత్నిస్తే బాగుంటుంది.

  ప్రత్యుత్తరంతొలగించు

ఆలోచనాత్మకంగా..