
చతీస్ ఘర్ రాష్ట్రానికి చెందిన విశ్వజిత్ మిత్రా మావోయిస్టులతో మాటాడి వ్యాసం రాసినందుకు ప్రముఖ సామాజిక కార్యకర్త అరుంధతీ రాయ్ పై కేసు వేసారు. న్యాయవ్యవస్థపై ఆ వ్యాసంలో ఆమె చేసిన వ్యాఖ్యలను కోట్ చేస్తు పిటిషన్ వేసారు. కానీ, నేటి వ్యవస్థలోని లోపాలను ఎత్తి చూపడం తప్పెలా అవుతుంది. ఆ ప్రాంతమంతా యుద్ధ భూమి గా మార్చి మీడియాను సైతం అనుమతించక, ప్రవేటు సైన్యాలతో, పారామిలటరీ బలగాలతో ఆదివాసీలపై జరుగుతున్న అకృత్యాలను వెలుగులోకి తేవడం నేరమెలా అవుతుంది. ఆ రాష్ట్రంలోని Special Security Act వంటి కౄర చట్టాన్ని అడ్డుపెట్టుకొని మాటాడేవారి గొంతునొక్కే ప్రయత్నం తప్ప మరోటి కాదు. ఇలాంటి మేధావి వర్గం, ప్రజాస్వామిక శక్తులపైనే యిలా దాడులకు సమాయత్తమవుతున్నారంటే యింక సామాన్యుల గతేంకాను? అందుకే దీనిని అందరం ఖండించాల్సిన అవసరం వుంది.
she deserve it, why to condenm?
రిప్లయితొలగించండిఇప్పటికయినా ..... చట్టం తన పని తను చేసుకోనిద్దాం.. తన మీద తప్పుడు కేసులు పెడితే చూస్తూ కూర్చునేనంత చేతకానిది కాదు అరుంధతిరాయ్ ..
రిప్లయితొలగించండితీవ్ర౦గా ఖ౦డిస్తున్నా౦!! ఇన్ని రోజులక౦టే మరి౦త తీవ్ర౦గా ఖ౦డిస్తున్నా౦!!!
రిప్లయితొలగించండి"ఖ౦డిచడ౦" ఒక జోక్ గా మారి కొన్ని ఏళ్ళయిపోయాయి.
రిప్లయితొలగించండిమన ప్రజాస్వామ్య౦ సాధి౦చిన ప్రగతి ఏమిటో తెలుసా, టోకుగా దేశప్రజలను అవినీతి పరులుగా చేయడ౦. మన దేశప్రజలు ఒక జాతిగా అవినీతితో అలవాటుపడిపోయారు. అవినీతిని సాధన కూడా చేస్తున్నారు. బియ్య౦ కోస౦, టీవీలకోస౦, కులాల కోస౦ ఓట్లేస్తున్నారు. రాజు అవినీతి పరుడైతే సులభ౦గా అతన్ని తప్పి౦చవచ్చు. ప్రజలే అవినీతిపరులైతే....రాజులు వారి అనుచరులకు ప౦డగే. అదే జరుగుతో౦దిప్పుడు.
స్పందించిన హృదయాలకు ధన్యవాదాలు. ఆమె అక్కడేం జరుగుతోందో తెలుసుకోవాలనే వెళ్ళారు. కాబట్టి, పర్యవసానం ఎలావున్నా తన బాధ్యతను నెరవేర్చారు. కానీ కేసులు, కౄర చట్టాలతో అందర్నీ భయపెట్టలేరు అన్న విషయం పాలక వర్గాలు గ్రహించాలి. రాజ్యాంగం పరిథిని దాటి తాను ఆ పని చేయలేదు. అది fail అయిన విషయాన్ని బహిర్గతం చేసారు. కావున ఆమెను టార్గెట్ చేస్తూ యితరులను కూడా భయపెట్టే ప్రయత్నమిది. రాయ్ నే ముప్పుతిప్పలు పెట్టాం మీరనగా ఏమాత్రం అన్న సందేశం యివ్వడానికే యిలాంటి ప్రయత్నాలు.
రిప్లయితొలగించండిపెదరాయుడు గారు మీ ఆవేదనా, ఆవేశం వ్యక్తపరిచినందుకు ధన్యవాదాలు.