ప్రముఖ మార్క్సిస్టు అర్థ శాస్త్రవేత్త, గణాంక శాస్త్రవేత్త ప్రొ.R.S.రావు గారు ఇక లేరు.. ఆయన అరుదైన మార్క్సిస్ట్ మేధావులలో ఒకరు, పీడిత ప్రజల పక్షపాతి, మార్క్సిస్ట్ ఉపాధ్యాయుడు ఈ మధ్యాహ్నం ఢిల్లీలో 1.40 PM కు చనిపోయారు.. ఆయన గోథలే ఇన్ స్టిటూట్, పూణే, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిటూట్, కోల్ కతలలో పనిచేసి సంబల్ పూర్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పదవీ విరమణ చేసారు. సామాజికార్థిక రాజకీయ పరిశీలకులుగా, ఉత్పత్తి శక్తుల నక్సల్బరీ పోరాట మార్గాలను విశ్లేషిస్తూ పుస్తకాలు రాసారు. ఉపన్యాసాలిచ్చారు. అభివృద్ధి-వెలుగు నీడలు (1990), Towards understanding Semi colonial Society (1995), కొత్త చూపు (2011) వెలువడ్డాయి..
ప్రొ.సోమేశ్వరరావుగా ఇటీవల ఒరిస్సా మల్కన్ గిరి జిల్లా కలెక్టర్ కిడ్నాప్ సమయంలో మధ్యవర్తిగా అందరికీ సుపరిచుతులు..
ఆయన లేని లోటు పూడ్చుకోలేనిది.. వరుసగా ఆ తరం మేధావి వర్గాన్ని కోల్పోతుండడం బాధాకరం.. ఆయనకు జోహార్లర్పిద్దాం... (పోటోలో ఈ చివరి వ్యక్తి)
సాహిత్యాన్ని చూడడానికీ, చదవడానికీ కొత్త ప్రమాణాలు వెతకాలన్న తరం నించి వచ్చిన ఆయన విమర్శ వ్యాసాలు మరో సారి మన పాఠకులకు అందించాల్సిన అవసరం వుంది. మీకు వీలునప్పుడు మీ బ్లాగులోనో, మరెక్కడో అప్పుడప్పుడూ ఆయన విమర్శ వ్యాసాల్లోని విలువయిన కొన్ని భాగాలు అందిస్తే బాగుంటుంది.
వర్మ:
రిప్లయితొలగించండిఆర్. యస్ . రావు గారి నిష్క్రమణ విషాదకర వార్త.
సాహిత్యాన్ని చూడడానికీ, చదవడానికీ కొత్త ప్రమాణాలు వెతకాలన్న తరం నించి వచ్చిన ఆయన విమర్శ వ్యాసాలు మరో సారి మన పాఠకులకు అందించాల్సిన అవసరం వుంది. మీకు వీలునప్పుడు మీ బ్లాగులోనో, మరెక్కడో అప్పుడప్పుడూ ఆయన విమర్శ వ్యాసాల్లోని విలువయిన కొన్ని భాగాలు అందిస్తే బాగుంటుంది.
@Afsar: మీ సూచనను తప్పక పాటిస్తాను సర్....
రిప్లయితొలగించండి