13, జూన్ 2009, శనివారం

ద్వంద్వ ప్రమాణాలు

నేడు సమాజంలో ప్రతి విషయంలో ద్వంద్వ ప్రమాణాలు రాజ్యమేలుతున్నాయి. ఉన్నతస్థాయి పదవులు మహిళలకు కట్టబెట్టామని చెపుతున్న రాజకీయ పార్టీలు రోజువారీ జరుగుతున్నా దారుణాల పట్ల చూసీ చూడని ధోరణి అవలంబిస్తున్నాయి. ఒక దళిత మహిళను పార్లమెంటు అధ్యక్ష స్థానంలో కూచోబెట్టిన రోజే అనేకమంది మహిళలపై దారుణాలు జరిగిపోయాయి. అవికూడా రక్షక భటుల సాయంతో జరిగినాయని వెలుగులోకి వచ్చాయి. రాష్ట్రంలో ఒక మహిళా హోం మంత్రిగా వెలగబెడుతున్నప్పుడు వరుసగా ఇలాంటి దారుణాలు వెలుగులోకి వచ్చినా సరైన న్యాయం జరిగిన దాఖలాలు లేవు. చాల మామూలుగా శాఖా పరమైన దర్యాప్తులతో సరిపెడుతున్నారు.
అలాగే ఒకవైపు అవినీతి నిరోధక శాఖ వారిని వుసిగోలుపుతున్నట్లు ప్రకటనలు ఇస్తూ మరోవైపు ఎన్నాళ్ళుగానో అవినీతి ఆరోపనలేడుర్కున్న వారిని ప్రమాణ స్వీకార కార్యక్రమాల దగ్గరనుంచి రోజువారి పనులలో కూడా వెంటపెట్టుకు తిరిగుతున్న నాయకమ్మన్యులు మన ఏలికలు. ప్రజలవైపు మాటాడేవారిని తీవ్రమైన హెచ్చరికలతో భయపెడుతూ, మట్టుపెడుతూ తమ గోముఖ వ్యాఘ్రముఖాన్ని రోజూ చూపడం ప్రజల నిస్సహాయతను బయటపెడుతోంది. ప్రజలు తమకు మరో ఐదేళ్లు వరకు బానిసలుగా పడివు౦టారన్న ధైర్యం, ప్రతిపక్షం వారుకూడా ఎన్నికల వరకూ వాళ్ల వ్యాపారాలు కొనసాగాలన్న తమతో కలిసిరాక తప్పదన్న నాజీ ధోరణి ప్రస్ఫుటంగా కనబడుతోంది. దీనిని తొందరగా బద్దలుకొట్టే౦దుకు అంతా సమాయత్తం కావాల్సిన అవసరం వుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆలోచనాత్మకంగా..