26, జూన్ 2009, శుక్రవారం

ఎందరో శివపుత్రులు

రాత్రి సాక్షి టి.వి.లో సాక్షి సలాం కార్యక్రమంలో సికందరబాద్లోని ఓ శ్మశాన వాటిక (బొందలగడ్డ) లో ఇల్లు లేని చాలా కుటుంబాలు అందులో నివాసముంటున్నారని చూపించారు. వారితో మాటాడించారు. అక్కడి పిల్లలు, స్త్రీలు ఏ భయమూ లేకుండా జీవిస్తున్నా తీరును చూపించారు. వారిలో ఎవరిని కదిపినా గూడులేక మరో మార్గాంతరం లేక ఇక్కడ వుంటున్నామని అన్నారు. వారి పిల్లలు అక్కడి బొమికలు, పుర్రెలతోనే క్రికెట్ ఆడుకుంటున్న తీరు చూసేవాల్లకు మనసువుంటే ఎంతగా బాధపెడుతుందో అనిపించింది. ఎందుచేతనంటే మన దినసరి కార్యక్రమాలలో ఇటువంటి వాటిని షరా మామూలుగా తీసుకునే దళసరి తోళ్ళుగాల్లమైపోయాం కదా? మీకు శవాలు కాల్చేటప్పుడు భయమేయడం లేదా అంటె అంతా లెదని చెప్పారు. కాని చిన్న పిల్లలను తెచ్చేటప్పుడు మాత్రం భయమేస్తుందని ఒక పాప చెప్పడం హృదయాన్ని ద్రవింప చేసింది. దేశంలో లక్షలాది ఎకరాల భూములను నేటికి 500 మంది సెజ్ కంపెనీల వాళ్ళకు ధారదత్తం చేస్తున్న ఈ 63యేళ్ళ వృద్ధ స్వతంత్ర భారతావనిలో సామాన్యుల పట్ల మన రాజాధి రాజులకు వున్న బాధ్యత ఏపాటిదొ అవగతమౌతుంది. కనీసం వుండటానికి గూడు లేని వాళ్లు నేటికి లక్షలాదిగా మిగిలి వుండడం మన దౌర్భాగ్యాన్ని తెలియచేయడం లేదా. లక్షలాది కోట్ల రూపాయల బడ్జెట్ ఎటువైపు వెళుతోందో మనకు అవగతం కావాలి. వున్నవాడు మరింత వున్నతంగాను, లేని వాడు మరింత అధోగతి పాలు కావడానికి మన పాలకుల నిర్వాకం కారణం కాదా. సామాన్యుడు ఏమి గొంతెమ్మ కోరికలు కోరటం లేదు. కాని తమ కుటుంబాలు ఎల్లకాలం పరిపాలనా పగ్గాలు చేపట్టేందుకు కావలసిన ప్రణాలికలు వేసుకోవడానికి కుక్కలకు బొమికలు విసిరినట్లుగా కొన్ని పధకాలను విసిరికొట్టి తమ ఆస్తులను మాత్రం లక్శ్లాగి కోట్ల రూపాయలకు పెంచుకొనేందుకు నిత్యము మార్గాలు అన్వేషిస్తున్నారు. అన్ని పాలక పక్షాలు ఈతీరుగానే సాగుతున్నాయి. ఓట్లనాడు కాట్ల కుక్కలల్ల ఒకడి మీద ఒకడు పడి కరుచుకు చచ్చే వీళ్ళు వారి అవసరం తీరంగానే ఎంత ధైర్యంగా వారు చేస్తున్న రాచకార్యాలన్ని మనలను అడిగి చేస్తున్నట్టుగా ఫోజులు కొడుతూ సామాన్యుల వెతలను ఖాతరు చేయని వీళ్ళకు గుణపాఠం నేర్పేదెప్పుడో. దరిద్రో నారాయణో హరీ అని దరిద్రులను దేవుళ్లను చేసేసే వీళ్ళ కుట్రలను గ్రహించి నారాయణుల౦తా ముక్కంటిలై వీళ్ళను భస్మం చేసేదెన్నడో.

3 కామెంట్‌లు:

ఆలోచనాత్మకంగా..