3, జులై 2009, శుక్రవారం

వానా వానా వందనం

మన ప్రయాణం ఎటు వైపు సాగుతుందో, మన ఆలోచనలు ఎటు వైపు మల్లి౦చబడుతున్నాయో చూస్తూ౦టే మనం ఇరవయ్యొకటో శతాబ్దంలోనే వున్నామా అనిపిస్తోంది. ప్రకృతిలో జరుగుతున్న వాతావరణ మార్పుల వలన, మనం చేస్తున్న ఆత్మహత్యా సద్రుస్యమైన ప్రక్రుతి విరుద్ధ కార్యాల వలన వర్షాలు పడక ప్రకృతి అల్లాడుతుంటే ప్రజలను శాస్త్రీయ ఆలోచనలవైపు మల్లి౦చకు౦డా వరుణ యాగాలు చేయమని పురమాయించడం సమస్యల నుండి దృష్టిని మల్లి౦చే ప్రయత్నం చేస్తూ తాము ప్రజల పట్ల ఎంతో ప్రేమగా వున్నామని నటిస్తూ తమ సొంత వ్యాపారాలను నిరాటక౦గా చేసుకునే నాయకమ్మన్యుల బ౦డారాన్ని బయటపెట్టే విపక్షం కూడా లేకపోవడం ఆ౦ధ్రుల దురదృష్టం. ప్రజల పట్ల నిబద్ధత కల పాలకులైతే వారిని శాస్త్రీయ ఆలోచనలవైపు ప్రోత్సహించి తద్వారా సమాజ అభివృద్ధికి తోడ్పడేట్లు చేయాలి. నిజానికి వరుణ యాగాలు పేరుతొ ఒక వర్గం ప్రజలను ప్రోత్సహి౦చి భక్తిని కూడా సరుకును చేసి కోట్లను కొల్లగొట్టే ప్రయత్నం కాదా? జనాలను ఇలా ఎ౦తకాల౦ మభ్యపెడతారు. ప్రతిపక్షాలు కూడా మతపరమైన భావాలు దెబ్బతింటే తమ ఓటు బ్యాంకు కోల్పోతామని కిమ్మనకు౦డా ఉంటున్నాయి. మన అంతరిక్ష పరిశోధనా శాస్త్ర వేత్తలైనా వీటి పట్ల ప్రజలకు వివరణ ఇస్తారని ఆశిద్దామంటే తాము కాపీ చేసి రూపొందించిన రాకెట్ల నమూనాలు సైతం తీసుకుపోయి తిరుపతి వెంకన్న పాదాల దగ్గర పెట్టె వారిను౦డి ఇది ఆశించగలమా? మన విశ్వవిద్యాలయాల ఆచార్యులున్నారంటే వారు ఎంతసేపూ తమ కులపోల్లకు పనికిరాని అంశాలనిప్పుంచుకొని డాక్టరేట్లు ఇప్పి౦చుకునే౦దుకు నిర౦తర౦ పోటీపడితేనే సరిపోతో౦ది. మరి మనవైపు ఎవరున్నారు? ఒకమారు అ౦దర౦ ఆలోచిద్దా౦. శాస్త్రీయ దృక్పధం వైపు సమాజాన్ని మళ్ళించేందుకు శాయశక్తులా కృషిచేసేందుకు కాస్తా ప్రయత్నిద్దామా?

4 కామెంట్‌లు:

  1. ప్రయత్నం అసాధ్యం కాదు, ఆచరణ అనిశ్చయం కాదు. కాని ఏకత్వం, ఐకమత్యం మనలో లేవు. అవి రానంత వరకు ఈ బేధబావనలు తప్పవు. రానున్న యువత సమీవ భవితకి ఉజ్వల శ్రీకారం కట్టాలని ఆశిస్తూ...

    రిప్లయితొలగించండి
  2. varma garu nenu inkoka mirchy varmani please watch my bolg at http://mirchyvarma.blogspot.com lo

    best of luck andi

    రిప్లయితొలగించండి
  3. యాగాల వల్ల వర్షాలు పడతాయన్నది నిజమైతే మేఘ మధన కార్యక్రమం ఎందుకో?

    రిప్లయితొలగించండి
  4. ఎలుక తోలు తీసి ఏడాది ఉతికినా,
    నలుపు నలుపే కానీ తెలుపు రాదు.

    అగ్నిగుండంలో క్వింటాళ్ళ కొద్దీ నెయ్యి పోసి
    ఎన్ని అగ్నిహోత్ర యాగాలు చేసినా,
    వాన కొలత ఒక శాతమైనా పెరగదు.

    రిప్లయితొలగించండి

ఆలోచనాత్మకంగా..