31, మార్చి 2010, బుధవారం

కళింగనగర్ పై టాటా వాడి దాడికి వ్యతిరేకంగా జంతర్ మంతర్ వద్ద రేపు ప్రదర్శన

ఒరిస్సా లోని కళింగనగర్ ప్రాంతంలో టాటా వాడికి ప్రభుత్వం అప్పనంగా కట్టబెట్టిన గిరిజనుల భూమికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాన్ని అణచివేయడానికి 26 ప్లాటూన్ల రిజర్వ్ సైన్యంతో ఆ ప్రాంతాన్నంతా చుట్టుముట్టి కాల్పులు జరుపుతు గిరిజనాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్న కార్పొరేట్ సి.ఎం. నవీన్ పట్నాయక్ చర్యలకు వ్యతిరేకంగా నౌజవాన్ భారత్ సభ ఆధ్వర్యంలో ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద రేపు భారీ ప్రదర్శన జరుతున్నది. ఇప్పటికే చాలామంది గిరిజనులు ఈ కాల్పుల వలన గాయాలపాలవ్వడం, మరణించడం జరిగింది. ఇదంతా టాటా sponsored State Terrorism. ప్రైవేటు పెట్టుబడిదారుల కొమ్ముకాస్తూ, అక్కడి సహజ సంపదను కారు చౌకగా పారిశ్రామికీకరణ పేరుతో అమ్మివేస్తూ, స్తానిక ప్రజల అస్తిత్వాన్ని ప్రశ్నార్థకం చేస్తున్న పాలక వర్గాల కుట్రను బహిర్గతపరిచే కార్యక్రమం. కావున ప్రజాస్వామిక వాదులు, మానవతా వాదులు తప్పక హాజరుకావాలని కోరుతున్నారు.

http://lite.facebook.com/events/Demonstration-against-Tata-Sponsered-attacks-in-Kalingnagar/108653165830501/

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆలోచనాత్మకంగా..