10, మే 2010, సోమవారం

౨౪ గంటలు కె.జి.కన్నబిరాన్ ఆత్మకథాత్మక సామాజిక చిత్రంఆయనను
ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్
'మానవహక్కుల కొరకు ఉద్విగ్నంగా పోరాడే న్యాయవాది'
అంది

నక్సల్బరీ తరం నాయకుడు
సత్యనారాయణసింగ్
'ప్రాసిక్యూటర్లకు ప్రాసిక్యూటర్' అన్నాడు

ఒకప్పటి మానవహక్కుల నేత, జర్నలిస్టు,
ఇప్పుడు సంఘపరివార్ సిద్ధాంతకర్త
అరుణ్ శౌరి
'లోకాధివక్త' అన్నాడు

ఆయన
నాలుగు దశాబ్ధాలుగా
న్యాయవాద వృత్తిలో
పోరాడే ప్రజల హక్కుల
పరిరక్షణ కోసం
అహర్నిశలు శ్రమిస్తున్న
అసాధారణ మేధావి

ఆంధ్రప్రదేశంలోనే కాదు
దేశం మొత్తానికే
పౌర, ప్రజాతంత్ర హక్కుల స్ఫూర్తికి
పర్యాయపదంగా ఎదిగినవాడు

మనిషిగా సామాన్యుడు
వాదనా పటిమలో అసామాన్యుడు
తోటి మనిషి హక్కులను కాపాడడంలో అనితర సాధ్యుడు

ఇంతకంటే విశ్లేషణ ఏమివ్వగలం. కన్నాబిరాన్ పేరు చెపితేనే కౄర చట్టాలకు గడగడ. పోలీసు అధికారుల లోదుస్తులలో చెమటలు పడతాయి. ఆయన తన చిరుత చూపులతో ఎదుటి వాడి కళ్ళలోకి చూస్తు సంధించే ప్రశ్నల బాణాలకు సమాధానం లేక నిరుత్తరులయిన సాయుధ గూండాలు ఎందరో. అటువంటి హక్కుల పోరాట యోధుని ఆత్మకథాత్మక పుస్తకమే 24 గంటలు. దీనిని అక్షరీకరించినవారు N.వేణుగోపాల్. దేవులపల్లి పబ్లికేషన్స్ వారు ప్రచురించారు. ధర రూ.200/-. అయినా కొని తప్పక చదవాల్సిన పుస్తకం. హక్కుల ఉద్యమంలో జీవితకాలం పనిచేస్తున్న ఆయన జీవితాన్ని తెలుసుకోవడమంటే నాలుగు దశాబ్ధాల హక్కుల ఉద్యమాన్ని తరచి చూడటమే. తప్పక చదవగలరు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి

ఆలోచనాత్మకంగా..