GHALIB, SON OF Mohammed Afzal, demonstrates in New Delhi on Oyctober 4,2006
2001 డిసెంబరులో జరిగిన పార్లమెంటుపై దాడి కేసులో అఫ్జల్ గురును ఉరితీయాలన్న డిమాండ్ కసబ్ కు ఉరిశిక్ష పడినప్పటినుంచి ఊపందుకుంది. కానీ కసబ్ కు అఫ్జల్ కేసుకు చాలా వ్యత్యాసముంది. అఫ్జల్ తాను ప్రత్యక్షంగా ఆ దాడిలో పాల్గొనలేదు. అయినా సరే ఆనాటి దాడిలో పాల్గొన్న టెఱరిస్టులు 5 రురుకు సహాయపడ్డాడన్న నేరారోపణతో ఆయనకు ఉరిశిక్షవేసింది ఢిల్లీ హైకోర్టు. దానిని ధృవీకరించింది దేశ అత్యున్నత న్యాయస్థానం. 2006 డిసెంబరు 26 న ఉరి తేదీ కూడా ఖరారు చేసారు. కానీ అఫ్జల్ రాష్ట్రపతికి క్షమాభిక్షకోసం దరఖాస్తు చేసుకోవడం దానిని ఆయన తిరిగి హోం మంత్రిత్వ శాఖకు పరిశీలన నిమిత్తం పంపడం, ఆ తరువాత జరిగినది అందరికీ ఎరుకే.
కానీ అఫ్జల్ కేసు ట్రయల్ లోనే లోపాలున్నాయన్నది ప్రముఖ న్యాయవాదులు, మానవహక్కుల సంఘాల వారి వాదన. అసలు 2001 లో కాశ్మీర్ లో సెల్ ఫోన్ పనిచేసే స్థితిలో లేనప్పుడు ఆయనకు టెఱరిస్టులు నుండి కాల్స్ వెళ్ళాయన్న ప్రాసిక్యూషన్ వాదన ఎలా నెగ్గింది. అలాగే అఫ్జల్ ఆ సెల్ ఫోన్ కొన్నది డిసెంబర్ నెల 14 న అని డీలర్ దగ్గర వివరాలుంటే, పోలీసులు నవంబరు 6 నుండి వాడుతున్నట్లుగా చూపించారు.
అలాగే ఒక టెఱరిస్టుకు తాను JNU student అయినందున ఢిల్లీలో ఇల్లు చూపించమని బలవంతపెట్టిన SP గురించి ఫిర్యాదు చేస్తే పట్టించుకున్న నాధుడు లేడు. ఎందుచేతనంటే అఫ్జల్ లొంగిపోయిన మిలిటెంట్. లొంగిపోయిన వీళ్ళను STF పోలీసులు రకరకాలుగా వాడుకుంటారు. మాటవినకపోతే వీళ్ళను టార్చర్ చేస్తారు. అలాగే జరిగింది. ఆ ఇల్లు చూపినందుకు అఫ్జల్ కు డబ్బుకూడా యివ్వడం, దాంతో కాశ్మీర్ నుండి తన కుటుంబాన్ని షిఫ్టు చేసే ఆలోచనలో వుండగా ఈద్ రావడంతో ఆగిన అఫ్జల్ కు పార్లమెంటుపై దాడి జరగడంతో అరెస్టయ్యాడు. యిందులో ఎక్కడా ప్రత్యక్ష పాత్ర లేదు. సుప్రీం గత తీర్పులపాటికి ప్రత్యక్ష పాత్ర లేనివారికి ఉరిశిక్ష వేయరాదు. కానీ టెఱరిస్టు పేరు పెడితే తీర్పులు మారిపోతాయి.
అలాగే ఆయనకు న్యాయస్థానం కల్పించిన లాయర్ కూడా ప్రాసిక్యూషన్ వాదనలకు వ్యతిరేకంగా డిఫెన్స్ వాదనలు వినిపించలేదు. ఎందుచేతనంటే ఆయన జీతం తీసుకునేది ప్రభుత్వం ద్వారానే అన్న విషయాన్ని గమనించాలి.
మొత్తమ్మీద అఫ్జల్ పై మోపబడ్డ నేరాలుకు సరైన సాక్ష్యాధారాలు లేకుండానే ఉరి శిక్ష ఖరారు చేసారన్నది బిజెపి మినహా కాశ్మీరీ రాజకీయ పార్టీల వాదన కూడా.
ఇక్కడ మరికొంతమంది వాదనేమంటే అఫ్జల్ ఒక బారతీయుడు కాబట్టి ఆయనకు పడ్డ ఉరిని రద్దు చేయమని. పాకిస్తాన్ లో ఉరిశిక్ష పడ్డ సరబ్ జిత్ సింగ్ కోసం భారతీయుడిగానే వెనకేసుకు రావడం జరిగింది కాబట్టి అఫ్జల్ విషయంలో కూడా ఉరిశిక్షను రద్దుచేయమని కోరుతున్నారు. అలా అయితే వాళ్ళే నయమేమో?
Maulana Abul Kalam Azad has rightly said that of the battle field the largest number of the innocent people got killed on the court rooms. Mr. A.G.. Noorani has written a book 'Indian Political trials 1775-1947 (published by Oxford 2005) which gives analysis of so, many political trails wherein the history has shown that the judges were wrong and the accused were innocent. The Judges of the Hon'ble Supreme Court are bond to see that it would not happened within their sphere of influence.
ఈ వాక్యాల ద్వారా కూడా ప్రాధమిక న్యాయసూత్రమైన వందమంది నేరస్తులు తప్పించుకున్నా సరే ఒక అమాయకుడు బలి కాకూడదనేది గుర్తుంచుకోవాల్సిన విషయం.
ఇక్కడ ట్రైయల్ పై వాదన చదవండిhttp://justiceforafzalguru.org/background/unfair-trial.html
అలాగే Frontline లో కూడా..http://www.hinduonnet.com/fline/fl2320/stories/20061020003511400.html
టెఱరిస్టులను సపోర్ట్ చేసే ఉద్దేశ్యం నాకు లేదు. కానీ అఫ్జల్ కు పడ్డ ఉరి ఆ పోలీసు అధికారికి కూడా వేస్తే బాగుణ్ణు కదా అని. అలాగే ముఖ్యమంత్రి పదవికోసం మతకల్లోలాను సృష్టించేవారూ, మతమౌఢ్యంతో ప్రత్యేకంగా ఒక మతాన్నే టార్గెట్ చేసి తమ ప్రభుత్వ అంగాలన్నింటినీ వినియోగించి నరమేధం సృష్టించినవారూ హాయిగా ఈ దేశంలో పదవులు, అధికారాలు అనుభవిస్తుంటే నిస్సహాయంగా చూసే ఈ దేశంలో అందరూ ఒకలా వుండరు.
అయినా ఉరిశిక్షల వలన నేరాలు ఆగిపోతాయన్న నమ్మకం నాకు లేదు.
No smoke without fire. There is a turn for Everyone. Afjal might not be involved directly in the incident, but he is the main culprit. According to Indian Law, Punsihment would be severe to the person who provoked the crime rather than who committed the crime. This is the same case with Afjal. We might not be able to stop these attacks but we can definitely avoid more kandhahars and mumbai attacks. Worth Reminding Masood Ajhars release caused the Mumbai attack.
రిప్లయితొలగించండిమిమ్మల్ని మాత్రం క్షమించలేము!
రిప్లయితొలగించండిమీకు సుప్రీం కొర్టు తీర్పు పైన నమ్మకం లేదా ?
రిప్లయితొలగించండిభారత సార్వబౌమత్వం మీద నమ్మకం లేదా ..
అఫ్జల్ గురుని క్షమించలేం. మిమ్మల్ని క్షమించలేం.
-----------------------------------------
" ముఖ్యమంత్రి పదవికోసం మతకల్లోలాను సృష్టించేవారూ, మతమౌఢ్యంతో ప్రత్యేకంగా ఒక మతాన్నే టార్గెట్ చేసి తమ ప్రభుత్వ అంగాలన్నింటినీ వినియోగించి నరమేధం సృష్టించినవారూ "
ఇవి పనికిమాలిన ఆరొపణలు.. ఒకటి దర్యాప్తు అయిపొయింది.. ఇంకోటి జరుగుతునది .. వాటి తీర్పురాక ముందే మీరె డిసైడ్ చేసారా.. కోర్టులొ నడుస్తున్న కేసుకి .. సుప్రీం తీర్పు ఇచ్చిన నరహంతకుడు కి పోలికా..
ఈ టెర్రరిస్ట్ లు పొట్టన పెట్టుకున్న వారిలొ మీ (సొ కాల్డ్ మెధావులు) వాళ్ళెవరయినా వుంటే తెలుస్తుంది .. పక్కన కూచుని కామెంట్లు చేసే మెధావులకి.. వారికేం పొయింది.. ఎన్నయినా చెప్పొచ్చు.. నా వుద్దేస్యం లొ అయితే ఇలాంటి కూరమృగాలని డిల్లి నడిరొడ్డు మీద రాళ్ళతొ కొట్టి చంపాలి
కసబ్ ని కూడా క్షమించేయ్ ఒక పని అయి పోద్ది.. నువ్వు కూడా మేధావి వర్గం లో చేరి పొవచు..
రిప్లయితొలగించండిస్పందించిన మిత్రులందరికీ ధన్యవాదాలు.
రిప్లయితొలగించండినేను చెప్పాలనుకున్న విషయం ఆసాంతం చదివినందుకు కృతజ్నతలు. అఫ్జల్ కేసు ట్రయల్ ఫైయిర్ గా జరగలేదన్నది వాస్తవం. మనకున్న దేశభక్తి వగైరా ఆయనమీద తీవ్ర ఆగ్రహాన్ని కలిగించి, చంపేయాలన్న కోరికను కలిగించవచ్చు. కానీ ఎవరికైనా తనమీద వచ్చిన ఆరోపణలను నిరూపించే అవకాశం కలిగించాలి. అది న్యాయస్థానాల విధి. ఇది పోటా కేసు కాబట్టి ఇక్కడ పోలీసులు చెప్పిందే వేదమయ్యింది. అసలు టెఱరిస్టుకు ఢిల్లీలో స్థావరం చూపించమన్న దేవేందర్ సింగ్ అన్న డిఏస్పీ గురించి పట్టించుకోలేదు. లొంగిన మాజీల పరిస్థితి, అది కాశ్మీర్ లో ఎలా వుంటుందొ అక్కడివారికే తెలుస్తుంది. అక్కడ భారత సైన్యం పోలీసు విధులను నిర్వహిస్తూ చేసిన అకృత్యాలు బయటి ప్రపంచానికి అంతగా రాలేదు. మానవహక్కుల కార్యకర్తలు వాటి గురించి గొంతుచించుకున్నా పట్టించుకున్న నాధుడు లేడు. కల్లోలిత కాశ్మీర్ గురించి ఒకమారు అధ్యయనం చేయండి.
కసబ్ విషయంలో అంత పారదర్శకంగా చేసిన వాళ్ళు ఈ కేసు విషయంలో అలా చేయలేదన్న ఆరోపణకు తావీయరాదన్నదే ఈ పోస్టు ఉద్దేశ్యం. ఇది భా.జ.పా.ప్రభుత్వ వైఫల్యాన్ని బయటపెట్టే కేసు కాబట్టి ఆ కేసులో నిందితుడ్ని ఎంత తొందరగా ఉరితీస్తే వారికి ఓ పనైపోద్దె. కానీ ఉరితీసేముందుకూడా చివరికోరిక అడిగే వారి మానవత్వం సంపూర్ణంగా ప్రస్ఫుటమవాలన్నదే నా కోరిక.
నిజమే నండీ సుప్రీం తీర్పును ఆషా మాషీగా తీస్కో కూడదు..క్షుణ్ణం గా పరశీలించాకే తీర్పు వెలువడుతుంది...పైగా తమ తీర్పులు తర్వాత్తర్వాత రిఫరెన్స్ గా చూడబడతాయని వారికి ముందే తెలుసు గాబట్టి తీర్పు వెలువరించేటప్పుడు అత్యంత జాగ్రత్తలు తీస్కుంటారు లోపాలు లేకుండా...
రిప్లయితొలగించండి