16, మే 2010, ఆదివారం
ప్రశ్నించే గొంతులపై ఉక్కుపాదం..
ప్రపంచంలో అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా డప్పాలు కొట్టుకున్న మన పాలకవర్గం యొక్క అసలు ముఖం బయటపడుతోంది. గొంతులేని వారి తరపున పోరాడుతున్న ప్రజాస్వామిక హక్కుల సంఘాలన్నింటిపై మావోయిస్టు మద్ధతుదారులుగ ముద్ర వేసి అణచివేయజూస్తున్న వైనం బయటపడింది. ఇది చాపకిందనీరులా సమాజంలో కాస్త అడిగే దమ్ము వున్న మేధావి వర్గాన్ని భయభ్రాంతులకు గురిచేసేందుకు PUCL, APDR, PUDR, RDF వంటి సంస్థలతో పాటు మహాశ్వేతాదేవి నేతృత్వంలోని బందీముక్తి మోర్చా తో పాటు 57 ప్రజా సంఘాలను ఇంటలిజెన్స్ బ్యూరో రాష్ట్ర ప్రభుత్వాలను హెచ్చరిస్తూ జారీ చేసిన లేఖలో వీటిని మావోయిస్టు ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ గా పేర్కొటూ వీటిపై నిఘావేయాలని ఆదేశాలిచ్చాయి. ఓ పక్క మావోయిస్టు పార్టీతో చర్చలకు మేధావులు కృషి చేయాలని కోరుతూ వారి మెడపై తన డ్రాక్యులా పంటితో గాయం చేయ బూనడం వీరి నియంతృత్వ స్వభావాన్ని, దళారీ బూర్జువా తత్వాన్ని, ప్రశ్నించడాన్ని సహించలేని తనాన్ని బయటపెట్టుకుంటున్నారు. ఈ దేశాన్ని MNC లకు, దళారీ బూర్జువాలకు తాకట్టు పెట్టి తద్వారా తమ ఆస్తులను కూడపెట్టుకోజూస్తున్న వీరే నిజమైన అంతర్గత శతృవులు. ప్రజల కాలికింద భూమిని ఆక్రమించి, స్వదేశంలో కాందిశీకులుగా మారుస్తూన్న వీరు వల్లించే ప్రజాస్వామిక సూత్రాల నిజాన్ని గ్రహించి ప్రజాస్వామిక వాదులంతా మేల్కొనకపోతే దాని వికృత పోకడ మరించ ప్రమాదకరంగా మారి దేశ సార్వభౌమత్వం(?) కోల్పోయే ప్రమాదం వుంది.
దీనిపై విపులంగా వివరణ ఇక్కడ చదవొచ్చు..http://www.tehelka.com/story_main44.asp?filename=Ne220510the_crimson.asp
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఇది ఎప్పుడో చెయ్యాల్సిన పని. మేధావుల ముసుగేసుకున్న ఈ జాతి విద్రోహుల పని ముందు పట్టాల్సిందే.
రిప్లయితొలగించండిఎవరు జాతి విద్రోహులో త్వరలోనే అనుభవంలోకి వస్తుందందరికీ. ఈరోజు కళింగనగర్ లో పోస్కో ప్లాంటుకు వ్యతిరేకంగా అక్కడి ప్రజలు ధర్నాలు చేస్తుంటే వారిపై విచక్షణా రహితంగా కాల్పులు జరిపినవారు ఎవరి అడుగులకు మడుగులొత్తుతున్నారు. అభివృద్ధి పేరుతో విధ్వంసం సృష్టిస్తున్నదెవరో ఎరుకలోకి వస్తున్నది.
రిప్లయితొలగించండిఅవునా ? మరి పోలీసులు చనిపోయినప్పుడు ఏమి చేస్తున్నారు మీరు చెప్పే మేతావులు ? పోలీసు లు మనుషులు కాదా?
రిప్లయితొలగించండి