4, అక్టోబర్ 2010, సోమవారం

కుష్టు దేహంపై తెల్ల వస్త్రం ఎంతకాలం కప్పగలవు???

కామన్ వెల్త్ క్రీడల నిర్వహణలో భాగంగా ఢిల్లీ నగరంలోని సుమారు అరవై వేలమంది బిచ్చగాళ్ళను, ఫుట్ పాత్ వ్యాపారులను దూరప్రాంతాలకు తరలించారన్న వార్త పట్ల వివిధ స్వచ్చంద సంస్థలు, మానవ హక్కుల కార్యకర్తలు తీవ్ర నిరసనను వ్యక్తం చేస్తున్నారు. పునరావాస కేంద్రాలలో కేవలం 2,2oo మందికి మాత్రమే వుండేందుకు వీలుంది. మిగిలిన వారిని బలవంతంగా రైళ్ళు ఎక్కించి పక్క పట్టణాలకు తరలించారు. దీనిపై మానవహక్కుల కార్యకర్తలు ఇలా స్పందించారు "నగర సుందరీకరణ, పట్టణ పునరుద్దఱణ కార్యక్రమాల్లో భాగంగా బిచ్చగాళ్ళను తరలించే పధకాన్ని అమలు చేశారు. అధికారులు తొలుత పేదవారిని నేరస్తులుగా చేశారు. తరువాత వారిని కనపడకుండా చేశారు.'' అని ఐజిఎస్‌ఎస్‌ఎస్‌కు చెందిన సింగ్‌ తెలిపారు. ''ఇది చాలా విచారించదగ్గ పరిణామం. ఒక ప్రజాస్వామ్య దేశంలో ఒక పౌరుడు నివసిస్తున్న ప్రాంతాన్ని వదిలిపొమ్మని నీవు ఎలా వత్తిడి తెస్తావు? ఇది నగర పౌరుని ప్రాథమిక హక్కుకు భంగం కలిగించడమే.'' అని ఆయ అన్నారు".

ఈ దేశంలో ఇది కొత్త కాదు. చంద్రబాబు పాలనా కాలంలో బిల్ క్లింటన్ పర్యటన సమయంలో కూడా రోడ్లపక్కనున్న కాలువలపై కూడా తెల్లని వస్త్రాలు కప్పి తమ కుళ్ళును దాచే ప్రయత్నం చేసారు.

పేదరికాన్ని, నిరుద్యోగాన్ని నిర్మూలించే పనిలో విఫలమై ఇలా పై పూతల ద్వారా ఇతర దేశాలవారి ముందు గొప్పలకోసం తంటాలు పడుతున్న మన అంతర్జాతీయ స్థాయి ఆర్థిక నిపుణులైన పాలకుల వారు తమ తెల్లబారిన గెడ్డాలకు రంగువెసినంత మాత్రాన ముడుతలు పడ్డ చర్మాన్ని కప్పుకోగలరా? ఈ కుష్టు రోగాన్ని తెల్ల బట్ట మాటున ఎన్నాళ్ళు దాయగలరు? అసలు ఈ దేశ ఆర్థిక పరిస్థితి గురించిగాని, నగరాల కంపు బతుకుల గురించి విదేశీయులకు తెలియదా? ఇంత సిగ్గుపడుతూ వీటిని నిర్వహించాల్సిన అవస్రమేమొచ్చింది?

క్రీడల నిర్వహణకు తగలేసిని డబ్బుతో వీరందరికీ పునరావాసం కల్పిస్తే ఎంత సంతోషించేవారు?


వార్త ఆధారంఃhttp://www.visalaandhra.com/national/article-25928

5 కామెంట్‌లు:

  1. విదేశీయుడెవరైనా ట్రైన్ లో ప్రయాణిస్తూ దారిలోని పల్లెటూర్లని చూస్తే తెలిసిపోతుంది, ఇండియాలో పేదరికం ఎంతో. విశాఖపట్నం రైల్వే స్టేషన్ లో నెథర్లాండ్స్ కి చెందిన దంపతులు కలిసారు. వాళ్లుండేది ఆమ్స్టర్డాంలో. ఒరిస్సాలోని పల్లెటూర్లు చూసి వచ్చారు. ఒరిస్సా ఎంత వెనుకబడిన రాష్ట్రమో అర్థమయ్యింది. కేవలం పెద్దపెద్ద నగరాలకి పైన పైన రంగులు వేసినంతమాత్రాన విదేశీయులు మన దేశంలో పేదరికం లేదనుకుంటారనుకుంటే అది భ్రమే.

    రిప్లయితొలగించండి
  2. పెట్టుబడిదారి సమాజంలొ ఏయెడుకు ఆ యెడు బిజ్జగాళ్ళ పంటను పెంచుకుంటూ పొతుంది ఈమిగులు జనాభాను {పెట్టుబడికి అధనంగా వున్న మిగులును}అనెకరూపాల్లొ నాసనం అయిపొతుంటారు కార్మిక వర్గానికి ఈపెట్టుబడిదారి సమాజం ఏలాతమను దొపిడీ చెస్తుందూ తెలుసుకూనంతవరకు సరైన పరిస్కారమార్గాలలొ పొరాడలెరు

    రిప్లయితొలగించండి
  3. పెట్టుబడిదారి సమాజంలొ ఏయెడుకు ఆ యెడు బిజ్జగాళ్ళ పంటను పెంచుకుంటూ పొతుంది ఈమిగులు జనాభాను {పెట్టుబడికి అధనంగా వున్న మిగులును}అనెకరూపాల్లొ నాసనం అయిపొతుంటారు కార్మిక వర్గానికి ఈపెట్టుబడిదారి సమాజం ఏలాతమను దొపిడీ చెస్తుందూ తెలుసుకూనంతవరకు సరైన పరిస్కారమార్గాలలొ పొరాడలెరు

    రిప్లయితొలగించండి
  4. USAలో కూడా కొన్ని పట్టణాలలో భిక్షాటన నిషిద్ధం. అక్కడ కూడా పేదరికం ఉంది. అక్కడ నల్లజాతీయులు ఎక్కువగా ఉండే ప్రాంతాలలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతాయి. ఇండియాలో అయినా భిక్షాటనని నిషేధిస్తే దొంగతనాలు చేసుకుని బతుకుతారు కానీ పేదరికం లేదనే భ్రమ కలగదు. అయినా మన దేశంలో ఎంత మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారో, ఎంత మంది మురికివాడలలో ఉంటున్నారో తెలుసుకోవడానికి గూగుల్ సెర్చ్ లో చూస్తే సరిపోతుంది. అందుకోసం ఢిల్లీ కామన్వెల్త్ గేమ్స్ కి రావలసిన పని లేదు.

    రిప్లయితొలగించండి

ఆలోచనాత్మకంగా..