10, ఏప్రిల్ 2010, శనివారం

గిరిజన గోవిందమూ గ్రీన్ హంట్ లో భాగమే...



కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు యిప్పుడున్నది ఒకటే ధ్యేయం. ఆదివాసీలను అడవులనుండి ఖాళీచేసి అక్కడి సంపదను బహుళజాతి సంస్థలకు అప్పగించడం. యిక్కడ సంపదే కాదు ఆ నేలపై హక్కును కూడా మనం కోల్పోతామన్న విషయం దాస్తున్నారు. కొత్త కంపెనచట్టం సెజ్ వలన ఆ ప్రాంతంపై అన్ని రకాల హక్కులను కోల్పోతాం.

ఆదివాసీలది స్వేచ్చాయుత జీవన విధానం. వారి సంస్కృతి, సాంప్రదాయాలు వేరు. వారి పూజా విధానాలే వేరు. వారి భాష కూడా మనకేమాత్రం దగ్గరిది కాదు. వారి దేవుళ్ళు ఏవీ కంటికి కనబడే విగ్రహ రూపాలు కావు. సినిమాలలో చూపించే పెద్ద నాలుక బయట పెట్టే కడుపు దేవతలు కావు. చిన్న చిన్న రాళ్ళ రూపంలోనూ, చెట్ల రూపంలోనూ వారు కొలుస్తుంటారు. వారి మంత్రాలు కూడా మన సంస్కృత మంత్రాల వంటివి కావు. వారి పూజారి జన్నోడు వారిని మభ్య పెట్టడంలో వీళ్ళకేమీ తీసిపోడు కానీ గొడవలు పెట్టే రకం కాదు. చిన్న చిన్న బలులు, కానుకలతో సరిపెట్టేస్తుంటారు. యిలా వీరిది ఓ ప్రత్యేక ఆచార వ్యవహారమయితే మధ్యలో ఈ గిరిజన గోవిందం పేరుతో గిరిజన గూడల్లో గోవిందుడికి వివాహం పేరుతో ఊరేగిస్తున్నారు మన డాలర్ శేషాద్రి గారు. యిది వాళ్ళ సంస్కృతి నుండి వాళ్ళను వేరు చేయడమే. వాళ్ళ ఉనికిని యిప్పటికే ప్రశ్నార్థకం చెస్తున్న మనం వారి నమ్మకాల విషయాలలో కూడా దూరి ఈ కృత్రిమ సంస్కృతిని అంటగట్టడం దేనికి. యిప్పటికే క్రిస్టియన్ మత ప్రచారకులు చేరి వాళ్ళ బుఱలు పాడుచేస్తున్నారు. మరల హిందూ మతం వాళ్ళని యిటు వైపు యిప్పుడు మళ్ళించడం కూడా గ్రీన్ హంట్ లో భాగమే. అది కూడా తూ. గోదావరి జిల్లా నుండి మొదలు కావడమన్నది అక్కడ బాక్సైట్ వ్యతిరేక పోరాటం తీవ్ర స్థాయిలో జరుగుతుండటమే కారణం. మావోయిస్టుల ఏరివేత పేరుతో ఆదివాసీ ప్రాంతాలనుండి వారిని ఖాళీ చేయించి నాగరికత, జన జీవన స్రవంతిలో కలిపే కార్యక్రమాలలో భాగంగా వాళ్ళ మనసులపి దాడి చేయడానికి డిష్ టీవీలు, డివీడీ ప్లేయర్లు యిచ్చి బూతు సేడీలు కూడా సప్లై చేస్తున్నారు. పాలక వర్గాల అభివృద్ధి నమూనా రోడ్లు వేయడమే. యివి వారిపై ప్రేమతో కాదు, వారి నేల, నీరు, సంపదపై దురాశతో. కావున గిరిజన గోవిందమూ ఆపరేషన్ గ్రీన్ హంట్ లో భాగంగానే భావించాల్సి వస్తోంది....

6 కామెంట్‌లు:

  1. పాతికేళ్ల క్రితం విద్యార్థి ఉద్యమంలో బాగంగా హైదరాబాద్‌కు తిరుపతినుంచి రైలులో బయలుదేరితే వరంగల్ ఖాజీపేటలో టెకెట్ లెస్ ప్రయాణీకుల కింద పోలీసులు పట్టుకుని ఖాజీపేట్ స్టేషన్‌కు తరలించారు. అక్కడ కొంతమంది విద్యార్థులను వదిలిపెడుతున్నట్లు చెప్పి వాళ్ల బ్యాగులు తనిఖీ చేసారు. అందరి బ్యాగులలో శ్రీశ్రీ, భగత్ సింగ్ తదితర పుస్తకాలు.. ఇలాంటివారిని బాగా వాయించి బయటకు పంపారు. ఒక విద్యార్థి సంచీలో సితార సినీ పత్రిక కనబడింది. తనికీ చేస్తున్న ఇన్సెక్టర్ కళ్లలో ఆనందం. ఇదీరా పిల్లకాయలు చదవాల్సింది. నంజకొడుకుల్లారా.. మీకెందుకురా విప్లవాలు.. అంటూ ఆ అబ్బాయిని తల మీద తట్టి ఒక్క దెబ్బ కూడా వేయకుండా సాగనంపాడా అధికారి. రాజ్యం సాయుధంగానే కాదు సాంస్కృతికంగా కూడా ఎంత సమర్థవంతంగా దాడి చేయగలురుతుందో ఆరోజు ఆ చిన్న సంఘటన మాకు స్పష్టంగానే బోధపర్చింది. విద్యార్తి, విప్లవోద్యమం తీవ్రదశలో ఉన్న ఆరోజుల్లోనే పాలకవర్గం కొమ్ముగాసిన నాటక ప్రయోక్త చాట్ల శ్రీరాములు గారి ప్రత్యక్ష కర్తృత్వంలో భారతి వంటి పచ్చి ప్రజా వ్యతిరేక నాటకాలను రాష్ట్రం నలుమూలలా ప్రదర్సించారు. దానికి కూడా అప్పటి టీటీడీ అధికారులు బ్రహ్మాండంగా సహాయ సహకారాలు అందించారు. గిరిజనులకు బ్లూ పిల్మ్‌ల పంపిణీ.. ఏం.. వూరంతా చెడిపోయినప్పుడు, వూరినంతా చెడగొట్టినప్పుడు, గిరిజనులను మాత్రం ఎందుకు వదిలేయాలి. వాళ్లనూ ఒక పట్టుపడితే పోలా.. గిరిజన గోవిందం.. గ్రీన్ హంట్. ఈ సాంస్కృతిక దాడి ఇప్పటిది కాదు లెండి.

    రిప్లయితొలగించండి
  2. Good Post. బూతు సిడీలు కావాలని సప్లై చెయ్యడమే దారుణం అనిపిస్తోంది.

    రిప్లయితొలగించండి
  3. దళిత గోవిందం కార్యక్రమంలో రాజకీయ నాయకులని కుర్చీల మీద కూర్చోబెట్టి, దళితులని నేల మీద కూర్చోబెట్టారు. ప్లాస్టిక్ కుర్చీలు చవకగా అద్దెకి దొరుకుతాయి. అయినా దళితులకి కుర్చీలు ఇవ్వలేదు. గిరిజన గోవిందం కూడా ఇలాంటిదే.

    రిప్లయితొలగించండి
  4. మరి కిరస్తానీ మిషనరీలు చేస్తున్న మత ప్రచారం, డబ్బ్లులో, ఇంకేటో ఇస్తూ ప్రలోభ పెట్టటం గిరిజనుల ప్రాంతాలలో ఏ హంట్ కిందకొస్తుందో చెప్తారా?
    లొకిక వాదులు కదా మీరు, మర్చిపోయాను లెండి, తప్పు ప్రశ్న అడిగినట్లున్నా :)

    రిప్లయితొలగించండి
  5. అసలు మనదేశంలో లౌకికవాదం లేదు. ఇవ్వాళ్టి లౌకికవాదం లౌకికవాదమే కాదు అది దొంగ లౌకికవాదం.

    రిప్లయితొలగించండి

ఆలోచనాత్మకంగా..