30, జనవరి 2010, శనివారం

ప్రకటనల్లో కూడా పేదవారు మన శాస్త్రీజీ




తన జీవితమంతా అత్యంత నిరాడంబరంగా గడిపి, నాటి నుండి నేటి వరకున్న నాయకులలో అత్యంత నిజాయితీ పరుడిగా అందరిచేత మన్ననలందుకొని, దేశం అత్యంత క్లిష్టపరిస్థితి (పాకిస్తాన్ తో యుద్ధం) సమయంలో భారత ప్రధానిగా బాధ్యతలొనరించిన లాల్ బహదూర్ శాస్త్రి గారికి మన భారత పాలకవర్గాలు గత 10 సం.లుగా ప్రచారానికి పెట్టిన ఖర్చు 87 లక్షలు మాత్రమే. అదే సమయంలో గత రెండు నెలల్లో మాజీ ప్రధాని, దేశంలో అత్యంత భారీ రక్షణ కుంభకోణం మచ్చకలిగిన రాజీవ్ గాంధీపై ప్రకటనలకు పెట్టిన ఖర్చు సుమారు రూ.3 కోట్లు. ఈ వివరాలను ముంబైకి చెందిన అజయ్ మరాఠే సమాచార హక్కు చట్టం ద్వారా రాబట్టారు. పాలకవర్గాల అదుపులేనితనానికి గుర్తుకాదా?

4 కామెంట్‌లు:

  1. అవును అప్పట్లో నాయకులు అలాగే ఆదర్శంగా ఉండేవారు. ఇప్పుడు ఆదర్శంగా ఉంటే చేతగానితనమంటున్నారు. అందుకనే రాజకీయాలు ఇలా తయారయ్యాయి ఇప్పుడు.

    రిప్లయితొలగించండి
  2. ఒక చిన్న సవరణ. శాస్త్రి గారు చైనా యుధ్ధం జరుగుతున్నప్పుడు ప్రధాన మంత్రిగా లేరు. 1962లో జరిగిన చైన యుధ్ధ సమయంలో మనం ఇంకా మన మొదటి ప్రధాన మంత్రి పాలనలోనే ఉన్నాం. లాల్‌బహదూర్ శాస్త్రి గారు ప్రధానిగా ఉన్నప్పుడు పాకిస్తాన్‌తో యుధ్ధం జరిగింది 1965లో .రష్యా వారి ఆహ్వానంతో పాకిస్తాన్ తో చర్చలకు తాష్కెంటు వెళ్ళి అక్కడ మరణించటం మన దేశ దురదృష్టం. ఆయన మరణానంతరం, మన దేశ రాజకీయ వ్యవస్త భ్రష్టు పట్టిపోయి, నేటి స్థితికి చేరింది.

    రిప్లయితొలగించండి
  3. రవిచంద్రగారూ అలా అని అవినీతిని సమర్థించలేం. అది మన వ్యవస్థను పూర్తిగా భ్రష్టు పట్టించింది.

    శివగారూ మీ సవరణ సూచనకు ధన్యవాదాలు. మార్చాను. ఇన్ని రుగ్మతలకు కారణం నేటి పాలకుల అవినీతి, బంధుప్రీతే కారణమయి ఇలా మిగిలాం.

    రిప్లయితొలగించండి
  4. లాల్ బహాదుర్ శాస్త్రి తండ్రి ఒక క్లర్క్. క్లర్క్ కొడుకు ప్రధాన మంత్రి అయినా అతనికి అంతగా గౌరవం ఇవ్వరు. ఎందుకంటే ఇది ధనవంతుల ప్రజాస్వామ్యం.

    రిప్లయితొలగించండి

ఆలోచనాత్మకంగా..